breaking news
Public Health Engineering
-
పబ్లిక్ ఎగ్జామ్‌లో టాపర్ సన్నీ లియోన్
పట్నా: జూనియర్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్(పీహెచ్ఈడీ) నిర్వహించిన పరీక్షలో సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. ఉద్యోగ అర్హత పరీక్షలో అత్యధిక మార్కులతో సహా గ్రాడ్యూయేషన్‌లో సాధించిన మార్కులతో కలిపి మొత్తం 98.5 పాయింట్లతో మెరిట్ లిస్టులో తొలిస్థానంలో ఉంది. దీంతో జూనియర్ సివిల్ ఇంజనీర్‌గా త్వరలోనే బాధ్యతలు చేపట్టనుంది. వీటికి సంబంధించిన వివరాలు పీహెచ్ఈడీ అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం తమ అధికారిక వెబ్సైట్ చూడాలంటూ కోరింది. అయితే ఇక్కడ సన్నీ లియోన్ అంటే హీరోయిన్ కాదు. బిహార్‌కు చెందిన మామూలు మధ్యతరగతి కుటంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి పేరు లియోనా లియోన్. అయితే ప్రస్తుతం పీహెచ్ఈడీ అధికారిక వెబ్సైట్లో మెరిట్ జాబితాలో ఉన్న సన్నీ లియోన్‌కు సంబంధించిన వివరాలను స్ర్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారుతోంది. హీరోయిన్ సన్నీ లియోనే పరీక్షలో టాపర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. -
పన్నులు పెంచాల్సిందే!
పట్టణాభివృద్ధిపై తుమ్మల కమిటీ సిఫారసులు ఆస్తుల బదలాయింపు రుసుమును 1.2% నుంచి 2.5%కి పెంచాలి వారంట్ టాక్స్‌ను 0.12% నుంచి 5 శాతానికి పెంచాలి ఆస్తిపన్ను గణనలో లోపాలను సరిదిద్దాలి ఆక్రమణల క్రమబద్ధీకరణను మళ్లీ చేపట్టాలి 6 స్మార్ట్ సిటీలు, 7 శాటిలైట్ సిటీలు నిర్మించాలి మున్సిపాలిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: నిధులు లేక నీరసించిన మున్సిపాలిటీలన్నీ ఆదాయం పెంచుకోవడానికి పన్నుల మోత మోగించాల్సిందేనని తుమ్మల ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పన్ను వసూళ్లను పకడ్బందీగా చేపట్టాలని... ఆస్తి పన్ను గణనలో లోపాలను సరిదిద్ది, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించింది. కాలం చెల్లిన పురపాలన, పట్టణాభిృద్ధి చట్టాలకు స్వస్తిపలికి కొత్త చట్టాలను రూపొందించుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆరు స్మార్ట్ సిటీలు, ఏడు శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని ప్రతిపాదించింది. నగర, పురపాలక సంస్థల్లోని ఖాళీల భర్తీని తక్షణమే చేపట్టాలని ఉప సంఘం పేర్కొంది. ఆదాయం పెంపు, ఇతర ఆర్థిక అంశాలు స్వల్పకాలిక ప్రణాళికలు.. ప్రస్తుతం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఆస్తి విలువలో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీని రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేస్తోంది. ఇందులో పురపాలికలకు రావాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీని 1.5 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలి. ఈ భారం ప్రజలపై పడకుండా స్టాంపు డ్యూటీని 4 నుంచి 3 శాతానికి తగ్గించాలి. ఆస్తిపన్ను పెంపుపై కోర్టు కేసులకు అయ్యే ఖర్చుల కోసం వసూలు చేసే వారంట్ ట్యాక్స్‌ను 0.12 నుంచి 5 శాతానికి పెంచాలి. ఆస్తి పన్నుల గణనలో లోటుపాట్లు, అసలు కొన్ని భవనాలకు గణనే జరగకపోవడం వంటి వాటిని సరిదిద్దాలి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్ధీకరణ) ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునే అధికారాన్ని పురపాలికల పాలకవర్గాలకు అప్పగించాలి. సాంకేతిక అనుమతుల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వసూలు చేస్తున్న 3 శాతం స్క్రూటినీ చార్జీలను రద్దుచేయాలి. మున్సిపాలిటీల్లో మొత్తం 3,887 పోస్టులుండగా.. 2,155 ఖాళీగా ఉన్నాయి. తక్షణమే 1,329 ఖాళీలను భర్తీ చేయాలి. మిగతా పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. కొత్త నగర పంచాయతీల్లో 260 కొత్త పోస్టులను మంజూరు చేయాలి. తక్షణమే 100 పోస్టులు భర్తీ చేయాలి. మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలు రాష్ట్ర పురపాలక, పట్టౄభివద్ధి శాఖ పరిధిలో మూడు విభాగాలు, ఏడు సంస్థలు పనిచేస్తున్నాయి. సీడీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర చోట్లలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలు/సంస్థలకు బదిలీ చేసేందుకున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏృీకత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి. ఆస్తిపన్నుల గణనలో లోపాలను నిర్మూలించేందుకు ఉపగ్రహ (జీఐఎస్) పరిజ్ఞానం ఆధారంగా గణన చేపట్టాలి. ఇందుకు రూ. 5.04 కోట్లు కేటాయించాలి. కేబుల్ ఆపరేటర్ల నుంచి వసూలు చేసే వినోద పన్ను మొత్తాన్ని వాణిజ్య పన్నుల శాఖ క్రమం తప్పకుండా మున్సిపాలిటీలకు చెల్లించాలి. పట్టణ ప్రణాళిక స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్)ను మళ్లీ అమలు చేయాలి. 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా నిర్ణయించి ఆలోగా ఏర్పాటైన అక్రమ లే ఔట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ పట్టణాలకు రింగ్ రోడ్లను నిర్మించాలి. 12 మున్సిపాలిటీల్లో కాలం చెల్లిన మాస్టర్ప్లాన్లను సవరించాలి. కేంద్రం అమలుచేస్తున్న స్మార్ట్‌సిటీస్ పథకం కింద వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్ నగరాలను ప్రతిపాదించాలి. శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా మేడ్చేల్, భువనగిరి, పెద్దఅంబర్‌పేట్, షాద్‌నగర్, సంగారెడ్డి పట్టణాలనుృఅభివద్ధి చేయాలి. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న ృఅమత్’ పథకం కింద హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, మిర్యాలగూడ, ఆదిలాబాద్, సూర్యాపేట పట్టణాలను చేర్చే విధంగా ప్రయత్నించాలి.