-
Diabetes: బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?
ఇటీవలి కాలంలో ఎక్కువమందికి వస్తున్న జీవనశైలి వ్యాధులలో మధుమేహం ఒకటి. షుగర్ వ్యాధి పేరులోనే చక్కెర ఉంది కానీ, రుచికి మాత్రం చేదే. ఇది చాపకింద నీరులా కిడ్నీల పనితీరు మందగించేలా చేస్తుంది. ముఖ్యంగా కనుదృష్టిని క్షీణింపచేస్తుంది. అలాగని షుగర్ ఉన్న వారంతా భయపడాల్సిన పనిలేదు. చాలామంది మధుమేహం ఉన్నా దశాబ్దాల తరబడి చక్కగానే ఉంటున్నారు. అయితే ఏ వ్యాధినైనా వచ్చాక బాధపడేకంటే రాకుండా నివారించుకోవడమే చాలా మేలు. చిత్రం ఏమిటంటే బీపీ, షుగర్ చాలా మందికి అవి వచ్చినట్లే తెలియదు. ఏవో కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్ దగ్గరకు వెళ్తే, వారి సలహా మేరకు పరీక్షలు చేయించుకుని ఉన్నట్లు తెలుసుకుని అప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్ వ్యాధి లక్షణాలేమిటో, అది ఎందుకు వస్తుందో, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. లక్షణాలు ►ఆరోగ్యవంతులు 24 గంటల కాలాన విసర్జించే మూత్ర ప్రమాణం 800 – 2500 మిల్లీలీటర్లు ఇంతకన్నాఅధికంగా మూత్రవిసర్జన జరిగితే దానిని అతి మూత్రవ్యాధిగా చెప్పవచ్చు. ఇలా అతిగా మూత్రం పోవడం అన్నది డయాబెటిస్‌కు ఒక సూచన. ►మొదటి ప్రధాన లక్షణం మాటిమాటికీ మూత్ర విసర్జన చేయాల్సి రావడం... అదీ ఎక్కువ ప్రమాణంలో. అంతేగాకుండా చెమట ఎక్కువ పట్టడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి, నిస్సత్తువ, నిస్త్రాణ, ఎక్కువ దాహం కావడం, కళ్లు తిరిగినట్లుండటం, కంటిచూపు మసకబారటం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. అలాగని ఈ లక్షణాలు ఉన్నవారందరికీ షుగర్ ఉందని కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారిలోనూ ఇంచుమించు ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అందులో అయితే గొంతు వద్ద వాపు, జుట్టు ఊడిపోవటం వంటివి అదనపు లక్షణాలు. యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ►ఆఫీసుల్లో లేదా పని ప్రదేశాల్లో శారీరక శ్రమ లేకుండా అదే పనిగా కూర్చుండటం, ఎక్కువసేపు నిద్రించటం, పెరుగు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, పాలు, బెల్లం, తీపివస్తువులు, అరటి, సపోటా, మామిడి లాంటి తీపి ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తినడం, కొవ్వుపదార్థాలు తీసుకోవడం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తరచు తీసుకోవడం మధుమేహానికి ప్రధాన కారణాలు. స్థూలకాయం... షుగర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని గుర్తించాలి. ►సక్రమమైన ఆహారాలు, క్రమం తప్పకుండా వ్యాయామం వలన చక్కెర అదుపులో ఉంటుంది. నివారణ ►మధుమేహ నివారణలో మందులతో పాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ►ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయపు నడక లేదా సాయంత్రపు నడకను కచ్చితంగా అలవర్చుకోవాలి. పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినడం మంచిది. అయితే పెరుగన్నం లేదా చిక్కటి మజ్జిగ బదులు పలుచటి మజ్జిగే మంచిది. ►పరగడుపునే ఒక లీటర్ నీటిని తాగడం, కాకర కాయ కూరను తరచు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ►నెలకి ఒకసారి కచ్చితంగా ఉపవాసం చేయాలి. ఇది షుగర్ లేనివాళ్లకు మాత్రమే. ►యోగాసనాలు, సూర్య నమస్కారాలు దినచర్యలో భాగం చేసుకుంటే దాదాపుగా మధుమేహం, రక్తపోటు నుంచి బయటపడవచ్చు. తినవలసినవి.. బార్లీ, గోధుమలు , కొర్రలు , రాగులు, పాతబియ్యపు అన్నం , పెసలు , కాయగూరలు, ఆకుకూరలు , చేదుపొట్ల , కాకరకాయ , మెంతులు, దొండకాయ, వెలగపండు, మారేడు , నేరేడు గింజలు, ఉసిరిక పండు, పసుపు, పండ్లలో యాపిల్, బొప్పాయి, జామ, బత్తాయి. దానిమ్మ మంచిది. తినకూడనివి.. ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం, వేపుళ్లు, నేతి వంటకాలు, మద్యం, చెరుకు రసం, పుల్లటి పదార్థాలు, చింతపండు, పెరుగు, వెన్న , జున్ను , దుంప కూరలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు వాడకూడదు. అదేవిధంగా రాత్రిపూట మేలుకొని పగలు ఎక్కువ నిద్రించటం, ధూమపానం, మద్యపానం మంచిది కాదు. మలమూత్రాలను ఆపుకోకపోవడం మంచిది. తనంతట తానుగా మన శరీరం దాదాపు ప్రతి వ్యాధిని నివారణ చేసుకోగలదు. కానీ మధుమేహం వస్తే అది కుదరకపోవచ్చు. అందుకే డయాబెటిస్ విషయంలో నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలి. చదవండి: ఈ హెర్బల్ టీతో ఇమ్యునిటీని పెంచుకోండి ఇలా.. -
కళ్లు నులుముకుంటే గొంతుకు ఇన్ఫెక్షన్!
నివారణ అవును... మురికి చేత్తో కళ్లను నులుముకుంటే... క్రిములు కన్నీటి నాళాల నుంచి గొంతుకు చేరి శ్వాస సంబంధమైన అంటువ్యాధులకు కారణం అవుతాయి. కాబట్టి తరచు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అన్ని రకాలుగా ఆరోగ్యకరం. శ్వాసకోశ సంబంధమైన అనేక అంటువ్యాధులు చాలా చిన్న కారణాలతోనే వస్తుంటాయి. వాటిని నివారించాలంటే... ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత నిద్రపోవాలి. ప్రయాణాలలో తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈత కొలనులో ఈత కొట్టే ముందు ఆ నీటిని క్లోరినేట్ చేశారా, లేదా అని తెలుసుకోవాలి. క్లోరినేట్ చేసినట్లు నిర్ధారించుకున్న తర్వాతనే నీటిలోకి దిగాలి. నీటిని కానీ, ఇతర పానీయాలను కానీ మరీ చల్లగా తాగకూడదు. సమతుల ఆహారం తీసుకోవాలి. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు రెండు లీటర్ల నీటిని తాగాలి. వంట చేయడానికి, తినడానికి, మందులు వేసుకోవడానికి కూడా చేతులు శుభ్రంగా ఉండాలి. ధూమపానం చేయరాదు. ప్యాసివ్ స్మోకింగ్ (స్వయంగా పొగ తాగక పోయినా, ధూమపానం చేస్తున్న వారు విడుదల చేసే పొగను పీల్చడం) కూడా హానికారకమే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement