breaking news
Pravasi Bhartiya Divas
-
జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్.. ఊపందుకున్న ఉద్యమం
మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ వలసలు ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా, అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. కోవిడ్ మరణాలు కోవిడ్ పరిస్థితుల వలన తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109). వందే భారత్‌లో కోవిడ్ సందర్భంగా గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) వేల మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చారు. జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్ కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి. భారంగా మారిన తిరుగు ప్రయాణం కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్తగా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ.30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు. ప్రవాసీ విధానం ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆన్లైన్ ఓటింగ్ 38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీస వేతనం గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విదేశీ భవన్ కావాలి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్ భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ... - మంద భీంరెడ్డి (+91 98494 22622 ) -
‘అద్భుతం.. నమ్మలేకపోతున్నా’
న్యూఢిల్లీ : తన నృత్య ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకున్నారు బీజేపీ ఎంపీ హేమ మాలిని.. మంగళవారం ‘ప్రవాసి భారతీయ దివాస్’ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశిలో హేమ మాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో హేమ మాలిని గంగ పాత్రలో నటించారు. కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులు సమక్షంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. దీనిలో హేమ మాలిని గంగా నది ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ప్రస్తుతం అది ఎలా కలుషితమవుతుందో వివరిస్తూ చేసిన నృత్యం అందరిని ఎంతో ఆకట్టుకుంది. హేమ మాలిని నృత్యానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయ్యారు. ప్రదర్శన ముగిసిన వెంటనే సుష్మా వేదిక మీదకు వెళ్లి హేమ మాలినిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ ‘నీ నృత్య ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. నా జీవితంలో తొలిసారి టీవీ కార్యక్రమాల్లో వాడే మూడు పదాలను వాడుతున్నాను. ‘అద్భుతం, నమ్మలేకపోతున్నా, ఊహాతీతం’’ అంటూ కొనియాడారు. ఈ నాటకం కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా దుస్తులను డిజైన్ చేశారు. #WATCH Veteran actor & BJP MP Hema Malini performing at the 'Pravasi Bharatiya Diwas' in Varanasi. (22.01.2019) pic.twitter.com/akP9fVwHKv — ANI UP (@ANINewsUP) January 23, 2019 -
‘భారతీయులు ఎక్కడున్నా అంతే’
బెంగళూరు: 21వ శతాబ్దం మన దేశానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాతృదేశానికి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాసీ భారతీయ దివస్ లో ఆయన ప్రసంగించారు. భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నానని మోదీ అన్నారు. విదేశాల్లో 30 మిలియన్ల భారతీయులు నివసిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కుటుంబం ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని చెప్పారు. భారతీయులు ఎక్కడున్నా కష్టించి పనిచేయడం, పర్యావరణాన్ని ప్రేమించడం చేస్తుంటారని అన్నారు. తాము ఎంచుకున్న రంగాల్లో ప్రవాస భారతీయులు విశేషంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ఎన్నారైలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రవాసులు సంక్షేమం, సంరక్షణ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. విదేశాల్లో ప్రవాసుల అవసరాలు, సమస్యలపై వెంటనే స్పందించాలని రాయబార కార్యాలయాలను ఆదేశించామన్నారు. విదేశాల్లో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న భారతీయ యువత కోసం ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకం ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. భారతి చెందిన వారు తమ దగ్గరున్న పీఐఓ కార్డులను ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డులుగా మార్చుకోవాలని కోరారు. దీనికి నిర్దేశించిన గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు చెప్పారు. సుందరమైన నగరమైన బెంగళూరులో ప్రవాసీ భారతీయ దివస్ జరగడం సంతోషంగా ఉందంటూ ఎన్నారైలకు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా
లక్నో: గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకాలేకపోయారు. విమాన ప్రయాణానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారడంతో వేడుకలకు అఖిలేష్ రాలేకపోయారు. కాగా, గుజరాత్ లో పెట్టిన అఖిలేష్ యాదవ్ పోస్టర్లు, హోర్డింగ్ లను తొలగించడంతో తమ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాజ్ వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకుంటారని, కానీ ఆయన మద్దతుదారులు.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి పోస్టర్లు పీకేశారని ధ్వజమెత్తారు.