‘అద్భుతం.. నమ్మలేకపోతున్నా’ | Sushma Swaraj Praised Hema Malini's Performance | Sakshi
Sakshi News home page

హేమ మాలినిపై ప్రశంసలు కురిపించిన సుష్మా స్వరాజ్‌

Jan 23 2019 11:42 AM | Updated on Jan 23 2019 1:43 PM

Sushma Swaraj Praised Hema Malini's Performance - Sakshi

న్యూఢిల్లీ : తన నృత్య ప్రదర్శనతో మరోసారి ఆకట్టుకున్నారు బీజేపీ ఎంపీ హేమ మాలిని.. మంగళవారం ‘ప్రవాసి భారతీయ దివాస్‌’ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశిలో హేమ మాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో హేమ మాలిని గంగ పాత్రలో నటించారు. కేంద్ర మంత్రులు, దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథులు సమక్షంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. దీనిలో హేమ మాలిని గంగా నది ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ప్రస్తుతం అది ఎలా కలుషితమవుతుందో వివరిస్తూ చేసిన నృత్యం అందరిని ఎంతో ఆకట్టుకుంది.

హేమ మాలిని నృత్యానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఫిదా అయ్యారు. ప్రదర్శన ముగిసిన వెంటనే సుష్మా వేదిక‌ మీదకు వెళ్లి హేమ మాలినిని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ ‘నీ నృత్య ప్రదర్శన ఎలా ఉందో చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. నా జీవితంలో తొలిసారి టీవీ కార్యక్రమాల్లో వాడే మూడు పదాలను వాడుతున్నాను. ‘అద్భుతం, నమ్మలేకపోతున్నా, ఊహాతీతం’’ అంటూ కొనియాడారు. ఈ నాటకం కోసం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నీతా లుల్లా దుస్తులను డిజైన్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement