breaking news
Prasad Reddy body
-
ప్రసాద్‌రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నేమ్ ప్లేట్!
-
ప్రసాద్‌రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నేమ్ ప్లేట్!
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి మృతదేహం వద్ద రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ నేమ్ ప్లేట్ ఉంది. రాప్తాడు తహసీల్దార్ కార్యాయంలో ప్రసాద్‌రెడ్డిని ఈ ఉదయం కొందరు దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపిన విషయం తెలిసిందే. పోలీసులు, టీడీపీ వర్గీయులే ప్రసాద్ రెడ్డిని హతమార్చారని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. తన అన్న ప్రసాద్‌రెడ్డిని తహశీల్దార్ ఆఫీసుకు పిలిపించి హత్య చేశారని ఆయన సోదరుడు ఆనంద్ రెడ్డి ఆరోపించారు. ఇందులో మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని చెప్పారు. ఇందులో ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ పాత్ర కూడా ఉందని ఆనంద్ రెడ్డి ఆరోపించారు. ప్రసాద్‌రెడ్డి మృతదేహం వద్ద ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ నేమ్ ప్లేట్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆనంద్ రెడ్డి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రసాద రెడ్డి హత్య వెనుక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై విచారిస్తామని ఎస్పీ రాజశేఖర బాబు చెప్పారు. -
ప్రభుత్వం చేయిస్తున్న హత్యలు ఇవి: గుర్నాధరెడ్డి
-
ఇది రాజకీయ ప్రేరేపిత హత్య: వాసిరెడ్డి పద్మ
-
రాప్తాడులో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య