breaking news
powerhouse
-
డిజిటల్ ఎకానమీలో భారత్ పవర్‌హౌస్!
న్యూఢిల్లీ: డిజిటల్ ఎకానమీ వృద్ధి పరుగులు తీస్తుండటంతో భారత్ తిరుగులేని శక్తి (పవర్‌హౌస్)గా ఆవిర్భవించిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో సుస్థిర ప్రగతికి భద్రత, విశ్వసనీయత అత్యంత కీలకమని, వీటిపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా హెడ్‌గా ఇటీవలే ఎంపికైన ప్రీతి.. ఏఐ రంగంలో భారత్ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో గూగుల్ భద్రతా చార్టర్‌ను మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.ఆన్లైన్ మోసాలు, స్కామ్‌ల నుంచి యూజర్లకు రక్షణ కల్పించడం.. ప్రభుత్వం, కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి వంటి అంశాల్లో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ చార్టర్ ఒక బ్లూప్రింట్‌గా నిలుస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రీతి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ విషయానికొస్తే మరింత మెరుగైన, వృద్ధిదాయకమైన డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు గూగుల్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కాగా, గుత్తాధిపత్యానికి సంబంధించి భారత్‌లో గూగుల్‌పై కేసుల గురించి మాట్లాడుతూ.. గూగుల్ ఏ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. అక్కడి స్థానిక చట్టాలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో నిరంతరం కలిసి పనిచేస్తామని ఆమె తేల్చిచెప్పారు.కొత్త టెక్నాలజీతో సవాళ్లు...ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీస్తున్నాయని.. అయితే, వాటివల్ల డీప్‌ఫేక్స్ వంటి సవాళ్లు కూడా పుట్టుకొస్తున్నాయని ప్రీతి అంగీకరించారు. ‘అందుకే మా ఏఐ సాంకేతికతను ఉపయోగించి రూపొందించే ఏ కంటెంట్‌లో అయినా వాటర్‌మార్క్‌లు ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల యూజర్లు ఈ కంటెంట్‌లో దేనినైనా అప్లోడ్ చేస్తే, వాటిలోని ‘సింథ్ఐడీ’ని ఆయా షేరింగ్ టూల్స్ గుర్తించగలుగుతాయి’ అని వివరించారు. ఏఐ ఆధారిత తప్పుడు సమాచారాన్ని, డీప్‌ఫేక్స్ సవాళ్లను ఎదుర్కోవాలంటే పరిశ్రమవ్యాప్తంగా సహకారం అవసరమన్నారు. గూగుల్ సహా ఇతర కంపెనీలన్నీ ఈ కీలక అంశంపై దృష్టి సారిస్తున్నాయని చెప్పారు.యూపీఐ.. అద్భుతంభారత్లో డిజిటల్ ఆర్థిక స్వరూపం ఎంతో ప్రత్యేకమైనదని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తమకు తిరుగులేదని నిరూపించిందన్నారు. ‘డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) శరవేగంగా విస్తరించడం దీనికి మచ్చుతునక. గూగుల్ పే వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు అంచనాలను మించి విజయం సాధించాయి. కొన్నేళ్ల క్రితం యూపీఐ ప్రజల దైనందిన జీవితాల్లో ఇలా చొచ్చుకుపోతుందని ఎవరైనా ఊహించారా. ఇప్పుడు దేశంలో ఇదో అద్భుతమైన డిజిటల్ విప్లవంగా మారింది. వందల కోట్ల లావాదేవీలతో యూపీఐ ప్రజల వినియోగం, కొనుగోళ్ల తీరునే సమూలంగా మార్చేసింది’ అని ప్రీతి పేర్కొన్నారు. భారత్ కీలక మార్కెట్...గూగుల్‌కు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా కొనసాగుతోందని.. సమీప భవిష్యత్తులోనే ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్లకు చేరే దిశగా దేశ డిజిటల్ ఎకానమీ పరుగులు తీస్తోందని ప్రీతి పేర్కొన్నారు. అడ్వర్టయిజింగ్, క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ రంగాల్లో గూగుల్‌కు ఉన్న పట్టు, నైపుణ్యాలను భారత్ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఉపయోగిస్తామన్నారు.దేశ ఆర్థిక పురోగతికి ముఖ్యంగా డిజిటల్ రంగంలో గూగుల్ ఇతోధికంగా సహకారం అందిస్తున్న ‘ఈ కీలకమైన, ఉత్తేజకరమైన తరుణం’లో కంపెనీ ఇండియా హెడ్‌గా కొత్త బాధ్యతలను చేపట్టడం చాలా ఉత్సాహాన్నిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. గూగుల్ ప్రపంచవ్యాప్త వ్యూహంలో భారత్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తుందనడానికి యూట్యూబ్ షార్ట్స్, జీపే తొలుత ఇక్కడే ప్రారంభించడం నిదర్శనమని కూడా గుర్తుచేశారు. -
మరో పవర్‌హౌస్ మూత
గోదావరిఖని 18 మెగావాట్ల ప్లాంట్ మూసివేతకు సింగరేణి నిర్ణయం ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం ఆందోళన బాటలో కార్మిక సంఘాలు గోదావరిఖని (కరీంనగర్) : కంపెనీ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్ మూతపడనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పవర్‌హౌస్‌లో పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీ చేయడంలో భాగంగా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లకు వెళ్లడానికి దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో పవర్‌హౌస్ మూసివేయవద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 1998లో బెల్లంపల్లి పవర్‌హౌస్, 2014లో కొత్తగూడెం పవర్‌హౌస్ మూసివేతకు గురికాగా ఆ జాబితాలో గోదావరిఖని పవర్‌హౌస్ చేరనున్నది. 1968 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రామగుండం రీజియన్‌లో 1959 సంవత్సరం బొగ్గుగను లు చేపట్టగా 1961 నుంచి బొగ్గును వెలికితీత ప్రారంభమైంది. ఆ సమయంలో విద్యుత్‌కు ఇబ్బందిగా మారడం తో యాజమాన్యం గోదావరిఖనిలో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌హౌస్‌ను రుమేనియా దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించింది. 1968 నుంచి మూడు టరై్బన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైం ది. మొదట్లో 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినా.. క్రమేణా ఒక టరై్బన్‌తో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైంది. ఈ పవర్‌హౌస్‌లో 248 మంది పనిచేయా ల్సి ఉండగా ప్రస్తుతం 111 మంది మాత్రమే ఉన్నారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియాలకు సరఫరా పవర్‌హౌస్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని పలు బొగ్గుగను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. పలు కాలనీలకు సైతం వినియోగిస్తున్నారు. 2013లో పవర్‌హౌస్‌లోని రెండవ టరై్బన్‌కు సంబంధించి రన్నర్ రీ–బ్లేడింగ్ చేయడానికి రూ.70లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పటివర కు ఆ టరై్బన్‌ను సదరు సంస్థ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఒకే టరై్బన్‌తోనే నాలుగు మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం పవర్‌హౌస్ మూసివేతన నేపథ్యంలో అందులో పనిచేస్తు న్న ఉద్యోగుల్లో మొదటి విడతగా వివిధ డిజిగ్నేషన్లకు చెందిన 15 మందిని స్థానికంగా ఉన్న ఏరియా వర్క్‌షాపు, ఆటో వర్క్‌షాపులకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల ని యాజమాన్యం ప్రకటించింది. అయితే పవర్‌హౌస్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను బదిలీ చేసే ఆలోచనను విరమించుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
వెన్నునొప్పి... అశ్రద్ధ చేస్తే వైకల్యమే
వెన్నుపూస ఒక పవర్‌హౌస్ లాంటిది. దీని ద్వారా కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడకు పవర్ సప్లై అవుతుంది. శరీరం మొత్తాన్ని స్థిరంగా ఉండేలా చేస్తుంది. కొన్ని కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్ హౌస్ నిర్జీవం అవుతుంది. దీని వలన భుజం, మెడ నొప్పులు, వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీనపడినట్లు చురకలు, పోట్లు, మంటలు మొదలవుతాయి. వీటన్నింటికీ పరిష్కారం కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలే అంటున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి.కృష్ణ ప్రసాద్. మన జీవితం ఒక్కోసారి నడి సముద్రంలో నావలా ఇరుక్కుపోతుంది. ఎటు పోవాలో దిక్కుతోచదు. క్రమేపీ అన్ని దారులూ మూసుకుపోతాయి. తీవ్రమైన మెడ, నడుము నొప్పితో పాటు క్రమేపి రెండు చేతుల్లో విపరీతమైన తిమ్మిర్లు వస్తాయి. ఒక దశలో బలం కోల్పోయి పట్టుతప్పి తెలియకుండానే వస్తువులు జారిపోతుం టాయి. ప్రతిసారీ విశ్రాంతి తీసుకోవాలంటే కుదరని పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగితే కళ్లు తిరుగుతాయి. పడుకున్నప్పుడు తలకింద పెట్టుకున్న చేతులు కొద్ది సేపటికి మొద్దుబారినట్లుగా ఉంటాయి. దీంతోపాటు తీవ్రమైన నడుము నొప్పి రెండు కాళ్లలో తిమ్మిర్లు, పోట్లు, చెమట వంటివి వస్తాయి. నడవాలంటే తూలి పడిపోతున్న భయం, వెన్ను, నడుం, మెడతో పాటు, అధిక బరువు, మధుమేహం తదితర సమస్యలతో బాధపడుతుంటారు. ఆయుర్వేదంలో వీటిని వాతానికి సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తారు. సర్జరీతో ఒరిగేదేమిటి? వెన్నునొప్పితో వెళితే మొదటిగా అల్లోపతి పెయిన్ కిల్లర్‌స, బెడ్ రెస్ట్ తీసుకోమం టారు. పెయిన్ కిల్లర్‌స అదేపనిగా వాడటం వల్ల దుష్ఫలితాలు అనేకం. కడుపు ఉబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. దీంతో ఇక సర్జరీకి వెళ్లినా శాశ్వత పరిష్కారం దొరకదు. ఏం జరుగుతుంది? మొదట్లో నొప్పి వెన్ను ప్రాంతంలోనే వస్తుంది. వెన్ను భాగంలో కండరాలు బలహీనమవుతాయి. తరువాత మెడ, నడుము, వెన్నుపూసలో డిస్క్ పక్కకు జరిగి వెన్నుపూస నరాల మీద ఒత్తిడి పడుతుంది. కారణం మెడ, నడుము దగ్గరున్న కండరాలు బలహీన పడటమే. ఈ కండరాలన్నీ వెన్నుపాముతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయుర్వేదం ఏం చేస్తుంది? ఆయుర్వేదంలో వెన్నునొప్పి రావడానికి కారణాలను పరీక్షలతో తెలుసుకుంటారు. తరువాత ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పిన కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, మర్మ చికిత్సలు, మేరు చికిత్సలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానంలో ఔషధాలతో తయారు చేసిన అత్యంత సారవంతమైన కేరళ నూనెలతో వెన్నుభాగం అంతా మర్దనచేసి కండరాలకు బలాన్నిచ్చే కటిబస్తి, గ్రీవబస్తి, కటిధార చికిత్సలు చేస్తారు. వీటితో పాటు పంచకర్మలో ముఖ్యమైన వస్తి, విరోచనం చికిత్సలు చాలా ముఖ్యం. వీటివల్ల నొప్పి రావటానికి ఉన్న దోషాలను సమూలంగా, శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పోతాయి. కనుక తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నవారు కేరళ ఆయుర్వేదంలోని పంచకర్మ చికిత్సలతో పునఃశక్తి పొంది వెన్నెముక బలంగా తయారై... పవర్‌హౌస్ సక్రమంగా పనిచేసేట్టు చేయవచ్చు. అడ్రస్ శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నం 17, హైదరాబాద్, వివరాలకు: పి.కృష్ణ ప్రసాద్. 9030013688/9440213688/040& 65986352 E mail: krishnaprosad.6600@gmail.com -
గుండెదడ...
గుండెదడ... ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్నిసార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగా చెప్పవచ్చు. గుండెదడ అంటే... గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి అది లక్షణం కూడా కావచ్చు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మానసిక ఆందోళన, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం లాంటి అనేక వ్యాధుల్లో కూడా గుండెదడ ప్రధాన లక్షణం. ఈ కారణంగా వచ్చే గుండెదడ... ప్రధాన వ్యాధికి తగిన చికిత్స చేస్తే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో గుండెదడకు ప్రధాన కారణం ఇదే. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మరికొందరిలో మాత్రం గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్లో తేడాలు రావడం వల్ల గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుంది. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టాకికార్డియా’ అని, నెమ్మదిగా కొట్టుకుంటే దాన్ని ‘బ్రాడీకార్డియా’ అని వైద్య పరిభాషలో చెబుతుంటారు. గుండె ఎలక్ట్రిక్ సర్క్యుట్ ప్రాధాన్యం... గుండె లయబద్ధంగా (నిమిషానికి 60 నుంచి 100 సార్లు) స్పందించడానికి అవసరమైన కండరశక్తిని సమకూర్చడంలో గుండె తాలూకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అత్యంత కీలకం. గుండె కచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోడానికి అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్‌మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీనిపేరే ‘సైనస్ నోడ్’. ఇది గుండె తాలూకు పవర్హౌస్లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు కర్ణిక (ఏట్రియమ్), జఠరిక (వెంట్రికిల్)ల కూడలి వద్ద ఉన్న ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైనా ఈ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ వాటిని గుండెకు చేరకుండా నియంత్రిస్తుంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్‌కి పోలీస్ ఆఫీసర్లాగా భావించవచ్చు. ఈ ఏవీనోడ్ నుంచి విద్యుత్ తరంగాలు గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్) నుంచి కుడి (జఠరిక) వెంట్రికల్కు ప్రసరిస్తాయి. ఇది సాధారణ స్పందనల్లో జరిగే ప్రక్రియ. అసాధారణంగా గుండె స్పందనల ఎందుకు? మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువగా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు. గుండెదడ లక్షణాలు గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలివి... ఆయాసం తలతిరగడం కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు. చికిత్స గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. డాక్టర్ రోగికి కొన్ని చిట్కాలు సూచిస్తారు. చల్లనినీళ్లతో ముఖం కడుక్కోవడం, ఊపిరి బిగబట్టి ముక్కడం వంటి చాలా సాధారణ చిట్కాలతో దీన్ని అధిగమించవచ్చు. గుండెదడ అనియంత్రితంగా జరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. అప్పుడు దీనికోసం కొన్ని మందులు వాడటం లేదా అబ్లేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుండెదడను నియంత్రించడానికి ఉపయోగించే మందులు చాలా రకాలుగా ఉంటాయి. గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో అధిక ప్రకంపనలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో నిర్ధారణ చేసి, తగిన మందులను గుండె వ్యాధి నిపుణులు సూచిస్తారు. సాధారణంగా 90 శాతం వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ తరహా మందులను జీవితాంతం వాడాల్సి రావడం వల్ల వీటి తాలూకు దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) తలెత్తే అవకావం ఉండవచ్చు. అందుకే ఒకవేళ మందులు పనిచేయకపోయినా లేదా మందుల కారణంగా దుష్ర్పభావాలు కనిపించినా అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏస్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో చూసి, వాటిని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స అంత సంక్లిష్టమైనది కూడా కాదు. సురక్షితమైనది కూడా. పైగా గుండెదడను నియంత్రించడానికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబార్చడం కోసం ‘ఆస్పిరిన్’ మందును ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా చికిత్స గురించి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో కేవలం ఆందోళన వల్లనే... గుండెదడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ కనిపించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. వ్యక్తిగత లక్షణాలలో భాగంగా కొందరికి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం తేలిగ్గా ఉద్రేకాలను లోనుకావడం వంటివి సంభవించవచ్చు. ఇలా జరిగేప్పుడు వచ్చే గుండెదడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఆందోళనలను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అయితే ఈ తరహా చిట్కాలు కూడా ప్రయోజనం ఇవ్వని సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి గుండెదడ కనిపించినప్పుడు అది రోగికి ఆరోగ్యపరంగా ఇబ్బందినీ, సమస్యను కలిగించే స్థాయిలో ఉందా లేదా అన్నది హృద్రోగ నిపుణులతో పరీక్షింపజేసుకుని, అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదని వారు భరోసా ఇచ్చాక దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ అన్నప్పుడే చికిత్స అవసరమని గుర్తిస్తే చాలు. -నిర్వహణ: యాసీన్ గుండెదడ... గుండెపోటు ఒకటేనా? గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్‌లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది. వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టుకుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు 24 గంట పాటు ఈసీజీ తీసి పరీక్షించడానికి హోల్టర్ అనే పరికరాన్ని కూడా అమర్చాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు టీఎంటీ పరీక్ష కూడా అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏది ఎప్పుడు చేయాల న్నది వైద్యులు సూచిస్తారు. డాక్టర్ సి.రఘు కార్డియాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్, హైదరాబాద్