postpone tour
-
YS Jagan: పొదిలి పర్యటన వాయిదా
సాక్షి, ప్రకాశం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పొదిలి పర్యటన వాయిదా పడింది. రేపు(బుధవారం, మే 28) ఆయన అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే.. భారీ వర్షాల నేపథ్యంతో పొదిలి పర్యటన(Podili Tour) వాయిదా పడిందని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో తెలిపింది. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యటన విషయమై తదుపరి ప్రకటన చేస్తామని వెల్లడించింది. కూటమి పాలన(Kutami Prabhutvam)లో మద్ధతు ధర లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్లి స్వయంగా వారి సమస్యలు తెలుసుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.ఇదీ చదవండి: కోనసీమ విషాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి -
అమిత్ షా పర్యటన వాయిదా: మురళీధర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో ఎన్టీఏ పక్షాల కీలక సమావేశం కారణంగా శుక్రవారం నాటి పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో మురళీధర్‌రావు మాట్లాడుతూ.. పార్ల మెంట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నాయకుల పర్యటనలూ వాయిదా పడ్డాయన్నారు. షా హైదరాబాద్ పర్యటన వాయిదా పడిందే తప్ప రద్దు కాలేదని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. కొన్ని ముఖ్య బిల్లుల విషయంలో ఎన్డీఏ పక్షాలను సమన్వయపరిచే బాధ్యతను షాకు ప్రధాని మోదీ అప్పగించడంతో పర్యటనలో మార్పు జరిగిందన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి షా తప్పకుండా వస్తారని, ఈ నెలలోనే కార్యక్రమం ఉంటుందన్నారు.