-
మరదలిపై కన్ను.. కాదనడంతో మొత్తం కుటుంబమే ఖతం
నాగ్‌పూర్: మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తి మరదలిపై కన్నేసి తీవ్ర దారుణానికి ఒడి కట్టాడు. నాగ్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల అలోక్ మాతుర్కర్ ఆదివారం రాత్రి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్‌పూర్‌లోని గోలాబార్ చౌక్ సమీపంలో జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అలోక్ గత కొన్ని రోజులుగా తన భార్య చెల్లెలిపై కన్నేశాడు. అంతేకాకుండా గతంలో ఆమెపై పలుమార్లు లైగింక దాడి చేశాడు. అలోక్ తన భార్య చెల్లెలు తనకే సొంతమని చెప్పి కుటుంబసభ్యులను తీవ్ర చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ విషయంపై కుటుంబంలో వివాదం చెలరేగడంతో ఆగ్రహానికి గురైన అలోక్ ఆదివారం రోజున తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలిని పొడిచి చంపి ఉరి వేసుకున్నాడు. ఇంటి చుట్టు పక్క వాళ్లు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాపలాదారుడిగా పనిచేసే నిందితుడి మామ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అలోక్ మాతుర్కర్‌కు విజయతో వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. పారి, సాహిల్. టైలరింగ్ పని చేసే తన భార్య చెల్లెలు అమీషాకు అలోక్ సహాయం చేసేవాడు. అయితే, ఆమె ఇతర వ్యక్తులతో స్నేహంగా ఉంటే అలోక్.. అమీషాను వేధించేవాడని తెలిసింది.స్నేహితుడితో ఫోన్లో మాట్లాడినందుకు అలోక్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ అమీషా దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అతడికి బుద్ది చెప్పి విడుదల చేశారు. దీంతో అలోక్ తన కుటుంబసభ్యులను చంపడానికి ప్రణాళిక వేశాడు. అందుకోసం ముందుగానే ఆన్లైన్లో కత్తులను ఆర్డర్ చేశాడు. ఆదివారం రాత్రి తన భార్య విజయతో, అమీషాతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దదిగా మారటంతో విచక్షణ కోల్పోయిన అలోక్ ముందుగా సిద్ధం చేసుకున్న కత్తులతో తన భార్యను, మరదలిని, అత్తను తీవ్రంగా పొడిచి హత్య చేశాడు. తన పిల్లలను బండతో మోది హతమార్చాడు. చివరగా అలోక్ కూడా ఉరి వేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. మాట్లాడుకుందామని పిలిచి ఒక్కసారిగా.. -
ప్రేమికా... తెలుసుకో ఇక!
ప్రేమ... అందులోంచి ఈర్ష్య... అసూయ... ఇతరులతో మాట్లాడితే సహించలేకపోవడం... తనను మాత్రమే ఇష్టపడాలనే తత్త్వం... ప్రేమలో ఇవన్నీ సర్వసాధారణం... ఇందులో అసాధారణమైనదే ఓవర్ ‘పొసెసివ్‌నెస్’ అంటున్నాడు సుభాష్ తన ‘పొసెసివ్‌నెస్’ లఘుచిత్రం ద్వారా... డెరైక్టర్స్ వాయిస్ మాది విశాఖపట్టణం. నేను వైజాగ్‌లోని ఎం.వి.జి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ (ఐటీ) చేశాను. ప్రస్తుతం చెన్నైలోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో ‘మాస్టర్స్ ఇన్ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్’ కోర్సు చేస్తున్నాను. నాకు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా ఉంది. ముఖ్యంగా స్నేహితులు సపోర్ట్ చేస్తున్నారు. మా స్నేహితుడితో కలిసి ఎం.ఆర్.ప్రొడక్షన్ స్థాపించాను. ఈ బ్యానర్ మీద ఇప్పటికి 99 లఘుచిత్రాలు తీశాను. మా సంస్థ స్థాపించి ఈ సంవత్సరం డిశంబరు ఒకటికి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది. 100వ చిత్రం తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కథ విషయానికి వస్తే... ప్రేమించుకునే వారి మధ్య పొసెసివ్‌నెస్ ఉంటుంది. దానివల్ల ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక్కోసారి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పే పరిస్థితి వస్తుంది. అటువంటివారిని నేను ప్రత్యక్షంగా చూశాను. అలా ఒక వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎయిర్టెల్ నెట్వర్క్ వారు ముందుకొచ్చి, మా చిత్రానికి దేశవ్యాప్తంగా www.airtel.co.inID67 ద్వారా పబ్లిసిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వెడ్ మంత్ర, సెలబ్రిటీ క్రికెట్ లీగ్... లొకేషన్లో షూట్ చేశాం. షార్ట్ స్టోరీ శ్వేత, రాకేశ్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. రాకేశ్ ఓవర్ పొసెసివ్‌గా ఉంటాడు. దాంతో వాళ్ల ప్రేమ బ్రేకప్ చెప్పే స్థితికి వచ్చేస్తుంది. ఆ తరవాత ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. క్లుప్తంగా ఇదీ కథ. కామెంట్ ప్రస్తుత యువతకు ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టిన నాలుగు రోజులకే రెండు లక్షల వ్యూస్ దాటాయి. చిత్రాన్ని చాలా మంచి ప్రమాణాల్లో తీయడం వల్ల చలనచిత్రం చూస్తున్న భావన కలుగుతుంది. ఇందులో రెండు పాటలు ఉన్నాయి. ఆ పాటలు, ట్యూన్స్ బాగానే ఉన్నాయి. వాటి చిత్రీకరణ మాత్రం చాలా బావుంది. ముఖ్యంగా ఇందులో సంభాషణలు మంచి స్థాయిలో ఉన్నాయి. ‘ప్రేమలో పొసెసివ్‌నెస్ ఉండచ్చు గాని, ఓవర్ పొసెసివ్‌గా ఉండకూడదు’ ‘ఏం చేస్తున్నావు.. వెయిట్ చేస్తున్నా... అయితే వచ్చేస్తున్నాను’ ‘కస్టమర్ కేర్ వాళ్లకి చేస్తే నీ కంటె తొందరగా సమాధానం చెబుతారు’ ‘నిన్ను ప్రేమించడం ముఖ్యం కానీ, అది అందరికీ చూపించడం కాదు’ ‘వాడెవడికైనా కష్టం వస్తే, కర్చీఫ్ ఇచ్చేసి వస్తాను, కానీ నీకు కష్టం వస్తే కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకుంటాను’ ‘ఇద్దరు మనుషులు కలిసుండాలంటే కావలసింది నమ్మకం’ ‘ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ ఇష్టం జీవితాంతం ఉంటుంది’ ‘నిన్ను మామూలు అమ్మాయిలా కాకుండా, మా అమ్మలా ప్రేమించాను’ వంటి డైలాగులు కథకు బలం చేకూర్చాయి. సినిమా టైటిల్లో జీ అక్షరం మీద లవ్ సింబల్ బావుంది. హీరోగా వేసిన కుర్రాడు బావున్నాడు. అమ్మాయి కూడా బావుంది కానీ, వాయిస్‌లో అంత పట్టు లేదు. మంచి డైలాగులను మంచి మాడ్యులేషన్‌తో, మంచి గొంతులో వినిపించినప్పుడే ఆ సంభాషణలు అందరి మనసుల్లో నాటుకుంటాయి. మంచి చిత్రాలు తీస్తున్న ఈ డెరైక్టర్ ఇటువంటి చిన్నచిన్న సూచనలను పాటిస్తే, తప్పక మంచి డెరైక్టరు కాగలుగుతాడు. - డా.వైజయంతి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్‌ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement