-
మేడమ్ క్యూరీ కూతురిని చంపినట్టుగా..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ - ఎన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్(69) శరీరంలో పోలోనియమ్ అనే రేడియో ధార్మిక మూలకాన్ని ఇంజెక్ట్ చేశారని ఎమ్‌క్యూఎమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్ గురువారం ఆరోపించారు. పోలోనియమ్ అనే రసాయనం నెమ్మది నెమ్మదిగా విషంగా మారుతుందని తెలిపారు. పాలస్తీనా ఉద్యమ కారుడు యాసిర్ ఆరాఫత్‌ను 2004లో ఇలాగే చంపేశారని తెలిపారు. అలాగే రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మేడమ్ క్యూరీ కూతురు, నోబెల్ గ్రహీత ఇరెనె జోలియట్ క్యూరీని కూడా 1956లో ఇలాంటి విషమే ఇచ్చి చంపేశారని ఉదాహరణగా చూపించారు. ఈ విషాన్ని అంతర్జాతీయ ప్రమాణాలున్న ప్రత్యేక ప్రయోగ శాలల్లో మాత్రమే కనుగొనగలమని తెలిపారు. పోలోనియమ్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదట అది రక్త కణాలను నాశనం చేస్తుంది. తర్వాత డీఎన్ఏపై దాడి చేసి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీస్తుంది. అనంతరం లివర్, కిడ్నీ, ఎముక మజ్జలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. పోలోనియమ్ రసాయనం గురించి, దాని దుష్ప్రభావాల గురించిన పరిశోధనాత్మక ఆర్టికల్‌ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అల్ అజీజియా కేసులో లాహోర్‌లోని కోట్ లక్పత్ జైల్లో ఏడేళ్ల ఖైదును అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్‌ను అక్టోబర్ 22న అనారోగ్య కారణాల వల్ల లాహోర్‌లోని సిమ్స్ (సర్వీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ కారణాలతో కోర్టు నవాజ్‌కు అక్టోబరు 29న బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడకముందే ఆయనను బుధవారం తన స్వగృహం జతి ఉమ్రాకు తరలించారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. 24 గంటలు ఆయన్ను డాక్టర్లు కనిపెట్టుకుని ఉంటారు. ఇందుకోసం ఆయన ఇంట్లోనే ఐసీయూ ఏర్పాటు చేశారు. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముండడంతో కుటంబసభ్యులను తప్ప బయటి వారిని ఎవ్వరినీ కలవనివ్వటం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మర్రియుమ్ ఔరంగజేబ్ ప్రజలకు తెలియజేశారు. -
సునందను చంపిన విషం.. పొలోనియం!
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం'. ఈ విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఉంది. పొలోనియం అనేది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. దీన్ని క్యూరీ దంపతులు 1898లో కనిపెట్టారు. గతంలో ఎవరికైనా విషపూరిత ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాల్సి వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించేవారు. ఇంతకుముందు పాలస్తీనా నాయకుడు యాసిర్ అరాఫత్‌ను, కేజీబీ ఏజెంటు ఒకరిని చంపడానికి కూడా ఇదే పదార్థాన్ని ఉపయోగించారు. ఒకసారి దీన్ని ఇంజెక్ట్ చేస్తే కనుక్కోవడం చాలా కష్టం. పౌడర్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించేందుకు అవకాశం ఉంది. సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేటప్పుడు శాంపిళ్లను పరీక్ష కోసం విదేశాలకు కూడా పంపారు. అక్కడే ఈ పొలోనియం వాడిన విషయం తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement