breaking news
pictured
-
తల్లిదండ్రులారా జాగ్రత్త, మీ పిల్లల ఫోన్లపై కన్నేయండి
రవి (పేరు మార్చం) కాలేజీ విద్యార్ధి. క్లాస్‌లో ఫస్ట్. ఇలాంటి విద్యార్ధి సడన్ గా కాలేజీకి వెళ్లకుండా, చదువులో వెనకబడిపోయాడు. తల్లిదండ్రుల్ని కేర్ చేయడం లేదు. దురలవాట్లకు అలవాటు పడ్డాడు. 24 గంటలు ఫోన్లోనే గడిపేవాడు. దీంతో కొడుకు రవి భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తన స్నేహితుల్ని, కాలేజీలో ఆరా తీశారు. కానీ కొడుకు గురించి ఎవరు నెగిటీవ్‌గా చెప్పలేదు. పైగా మంచోడు. బాగా చదువుతాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అప్పుడే తల్లిదండ్రులకు కొడుకు రవి ఫోన్‌ను చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఓ రోజు మరిచిపోయి రవి తన ఆండ్రాఫోన్ను ఇంట్లో పెట్టి వెళ్లగా అతని ఫోన్‌ను చెక్ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ లాక్ ఉండడంతో తనకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ ఫోన్ లాక్ ఓపెన్ చేయించాడు రవి తండ్రి. ఫోన్లాక్ తో రవి ఇలా తయారవ్వడానికి కారణం ప్రేమేనని తేలింది. కొడుకు ప్రేమించిన అమ్మాయికి పెళ్లైపోయిందని, అది తట్టుకోలేక రవి మనోవేధనకు గురైనట్లు అతని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం కొడుక్కి కౌన్సెలింగ్ ఇప్పించి మామూలు మనిషిని చేశారు. ఇలాంటి ఘటనలు ఒక్క రవి ఇంట్లోనే కాదు..అందరి ఇళ్లల్లో సాధారణం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగించే టీనేజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఫోన్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ, వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు మనం..లాక్ ఉన్నా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ల ఫోన్ లో ఉన్న డేటాను చూడొచ్చు. అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లకు లాక్ అంటే పాస్వర్డ్, ప్యాట్రాన్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఫోన్లో ఉండే అప్లికేషన్లకు కూడా లాక్ వేస్తారు. ముఖ్యంగా గ్యాలరీలోని ఫోటోలకు. ఇలా ఉండే వారి ఫోన్లో ఫోటోలు, ఇతర డేటాను మనం చూడొచ్చు. దీనికి ఒక చిట్కా ఉంది.ప్రతి ఆండ్రాయిడ్ ఫోనలలో క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. కాబట్టి గ్యాలరీ లాక్ ఉన్న ఫోన్ లో క్రోమ్ ఓపెన్ చేసి,URL స్థానం లో file:///sdcard/ అని టైపు చేస్తే సరి. ఆ సంబంధిత ఫోన్లో ఉన్న ఎస్డీ లోని ఫోటోలన్నీ బ్రౌజర్ ద్వారా చూసేయొచ్చు. ఇందులో డీసీఐఎంను ఓపెన్ చేయోచ్చు. చదవండి : Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా? గుర్తించండిలా?! -
ఈగ వాలింది
నాన్న నిస్సత్తువగా నులక మంచం మీద పడుకుని వున్నాడు. అతని చేతిమీద ఈగ వాలింది. అప్రయత్నంగా తోలేడు. నాన్న...నా చిన్నప్పుడు వూరు అతని మాట కోసం ఎదురుచూసేది. అతడు మా చుట్టుప్రక్కల గ్రామాలకు ఒకే ఒక్క చిత్రకారుడు. అతడు ‘వూ’ కొట్టేడంటే ఆ ఇంటిగోడమీద బొమ్మ తయారైపోయినట్టే. వూరు పండుగ జరుపుకోవాలంటే నాన్న గోడల మీద బొమ్మవేయాల్సిందే. బొమ్మ వెయ్యడానికి దీసరి ముహూర్తం చూసేవాడు. ఆ ముహూర్తానికే కొండమొదులుకెళ్ళి జేగురు మట్టి సేకరించి బొమ్మ మొదలుపెట్టేవాడు. ‘‘దేనికి నానా?’’ అని అడిగేవాడిని‘‘ఇంటిగోడ మీద ఈ జేగురెక్కాల’’ అనేవాడు. ‘‘అదే దేనికి?’’ తిరిగి ప్రశ్నించేవాడిని. ‘‘జేగురు రంగు దేవతల కోసం’’అనేవాడు. తవ్వుతున్న మట్టి వైపు చూసేవాడిని. నిజంగానే దాన్ని చూస్తుంటే ఎర్రబడిన దేవత కళ్ళులా కనిపించేది. ఇంటిగోడమీద వున్న జేగురు బొమ్మ నా కళ్ళముందు నిలబడేది. ‘‘ఈ రంగు దేవతలకిష్టమైన రంగు’’ అనేవాడు. జేగురు ఎరుపు దేవతల రౌద్రానికి గుర్తు. ఎర్రజేగురుకి గెడ్డలోని చెలమ నీళ్ళే కలిపి రంగుతేవాలి. ‘‘తేకపోతే?’’ అడిగేవాడిని‘‘ఆ రంగు రాదు... దేవతలు శాంతించరు... శలమనీళ్ళైతేనే చల్లగా వుంటాయి, దేవతలూ మనల్ని చల్లగా చూస్తార’నేవాడు. పెరటిలోని ఆనప పాదు కిందకెళ్ళి బాగా ఎండిపోయిన ఆనపతుంబని కిందికి దించేవాడు. అది కొన్నాళ్ళకి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చేవాడు. ‘‘ఎందుకు నానా?’’ అడిగేవాడిని ‘‘ఇది మసి సేసి నల్లరంగు సెయ్యాల’’ అనే వాడు. ఒక్కోసారి వరిగడ్డిని కూడా కాల్చి ఆ మసిని నల్లరంగు కోసం వాడేవాడు. ‘‘ఇదే ఎందుకు?’’ అని అడిగేవాడిని. ‘‘నలుపంటే పంటలు పండకపోవడం. చేనుమీద దయ్యాలు తిరిగాయని అర్ధం’’ అనేవాడు. ‘ఇంటిగోడ మీద నల్లరంగు లేకపోతే పంటలు పండవు. పండినా పీడ వదలదు’కలిపిన పెతీ రంగూ జాగర్తగ కలపాల. నేకపోతే ఆ రంగు పండదు. పండకపోతే ఆ ఇంటికి నష్టం జరగొచ్చు.గోడమీదవేసిన బొమ్మల్లో మరొక రంగు తెలుపు. వరిబియ్యం గానీ కొర్రబియ్యం గానీ స్వయంగా రోకలిలో దంచి పిండి చేసేవాడు. పిండిలో వేడి నీళ్ళు కలిపి తెలుపుని కలుపుకునేవాడు. చలిరోజులు ముదిరే నాటికి బొమ్మలు గీయడం మొదలయ్యేది వూర్లో. చుక్కల పండుగ, కందికొత్తలూ,ఆగం పండుగ సమయాల్లో కొత్త బొమ్మలు మొలుచుకొచ్చేవి కొందరిళ్ళలో. నాన్న చేతిలో తయారయిన ఆ రంగులు నాకు అత్యంత ఆకర్షణీయంగా వుండేవి. గోడమీద జంతువులు ఒక దిక్కున... మొక్కలు మరోదిక్కున...దేవతలు మరోదిక్కున. శ్రమిస్తున్న మనుషులు మధ్యలో. ఎవరు ఏ దిక్కున వుండాలో నిర్ణయించేదిదీసరి. ఆవిధంగానే నాన్న చేతిలోంచి బొమ్మ రూపుదిద్దుకునేది. నాన్న కొండ పనులు చేసుకుంటూనే వూర్లో అన్ని ఇళ్ళకూ బొమ్మలు గీసేవాడు. బొమ్మ గీసినందుకు సంతోషంగా ఎంతో కొంత నగదు ముట్టజెప్పేవాళ్ళు. తొలి రోజుల్లో తీసుకునేవాడు కాదు గానీ, అందరూ ఇస్తూ వుండడంతో ఆ డబ్బుని తీసుకునేవాడు. చేతినిండా పనితో మనిషీ నిండుగా వుండేవాడు. అతని బొమ్మ ఇంటిలో వుండాల్సిందేనని పొరుగూరు వాళ్ళూ నాన్నని తీసుకువెళ్ళి వేయించుకునే వాళ్ళు. ఆ బొమ్మ...శాంతినిస్తుంది ఇంటికి. కాపాడుతుందని నమ్మకం.కానీ...ఈ రోజు?ఆ బొమ్మ లేదు గోడమీద. ఆ గోడ మట్టినొదిలి సిమెంటు ధరించింది. మిద్దిల్లు రేకిళ్ళుగా మారి స్లాబిల్లుగా రూపాంతరం చెందింది. తెల్ల సున్నం గోడగా వున్నన్నాళ్ళూ జేగురు మాత్రమే బొమ్మగా నిలిచి వుండింది. మరికొన్నాళ్ళకు అదీమాయమైపోయింది. ఈ రోజు నాన్న నిస్సత్తువగా పడుకునివున్నాడు నులక మంచమ్మీద. ఈగ వాలితే తోలుకున్నాడు. నాన్న పులిమిన రంగులు నాచేతికంటాయి. స్కూల్లో టీచర్ చెప్పిన బొమ్మ చిటికెలో తయారైపోయేది కాగితమ్మీద. డ్రాయింగ్ పోటీల్లో స్కూలు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బహుమతులు గెలుచుకున్నా కడుపునిండడానికి అవి సరిపోవని కొద్ది రోజులకే తెలిసిపోయింది. ఓ రోజు నాన్న స్కూలుకి దిగబెడుతూ ‘బొమ్మలు బతుకు పెట్టవురా! సక్కగ సదువుకో’ అనడం నాకు గుర్తుంది. సర్టిఫికేట్లు చేత బట్టుకునిఐటీడీయే ముందు గ్రీవెన్స్ లైన్లో నిలబడ్డాను కాలేజీ చదువులు పూర్తయ్యాక. ఆ కొన్ని రోజులకి బొమ్మలే కాదు చదువు కూడా బతుకు పెట్టదని తెలిసిపోయింది. ఐటీడీయే చుట్టూ తిరిగితే యూత్ ట్రైనింగ్ సెంటర్లో చేరమని సలహా ఇచ్చేరు పీవో గారు. అక్కడ చేరాక తెలిసింది. వాళ్ళు ఇచ్చే శిక్షణ నాకు చాలా కష్టమైనదని. ఎలక్ట్రిక్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, హోటల్‌మేనేజ్‌మెంట్ లాంటి పనులు... ఏవీ నాకు సరిపడనివి... చేతకానివి. అవి నేర్చుకున్నా వాటిమీదే బతకాలంటే పెట్టుబడి కావాలి. మామూలు పెట్టుబడి కాదు. పోటీలో నిలబడగలిగే పెట్టుబడి కావాలి. అది లేకుండా నిలబడాలంటే నాకు సాధ్యం కాలేదు. అందుకే తిరిగి వూరు చేరాను. వూరు ఖాళీగా కనిపించింది. ఉపాధి పనులు చాలక ఇంకా డబ్బులు సంపాదించడం కోసం వూరొదిలి చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలకు వలసపోయిన వాళ్ళతో వూరు మరింత నిశ్శబ్దాన్ని సంతరించుకున్నది. అప్పుడే... వూరిలో పెళ్ళి కవుర్లకని నాగయ్య బావ ఎదురయ్యేడు. ‘‘బావా! ఇంటి కడ మీ చెల్లి పెల్లి గదా ఇంటి గోడ మీద బోర్డు రాయవా?’’ అని అడిగేడు కార్డు చేతిలొ పెడుతూ. ‘‘ఎందుకు రానూ? బోర్డుకి ఎంతిస్తావైతే?’’ అన్నాను ఇగటమాడుతున్నట్టే‘‘నీనెప్పుడేనా ఒట్టిన పని చేయించుకున్నానా సెప్మి? నువ్వింత అను. ఇచ్చెస్తను’’ అని ఆ ఇంటి అరుగు గోడమీద ఎగురుతున్న జంట పక్షులు... ఇరువైపులా చెట్లు... మధ్యలో పారుతున్న గెడ్డ బొమ్మ వేస్తూ ‘పార్వతి వెడ్స్ చిరు’ అని రాసేను. దానికి ‘మండంగి వారి పెళ్ళి పిలుపు’ అని కాప్షన్ ఇచ్చాను.ఆ బొమ్మకి వూర్లో వాళ్ళు అందరూ మెచ్చుకుని ‘మరేమైతే... దీని కోసం ఎవుడికో పిలిసి డబ్బులు తగలెయ్యడమేలా?’ అని వూర్లో ఎవరి పెళ్లైనా ఆ ఇంటి గోడ మీద బోర్డు నేనే రాసేవాడిని. దానికోసం మార్కెట్లో దొరికే వార్నీస్సే వాడే వాడిని. ఆ కొన్నాళ్ళకు ఎలిమెంటరీ బడి గోడల మీద చిన్న చిన్న బొమ్మలు అక్షరమాల, ఎక్కాల వరసలు రాయమంటే రాసేను. అప్పుడప్పుడూ గూడేల్లో కొత్తగా కట్టిన గుడి, చర్చీల్లో కూడ బొమ్మలు వెయ్యడానికి వెళ్ళేవాడిని. శివపార్వతులూ, సరస్వతీదేవి, యేసుక్రీస్తు... ఏదైనా. వాటర్ కలరో... వార్నీసో వాళ్ళేది కోరుకుంటే దానితో వేసేవాడిని. దానితో చుట్టు ప్రక్కల వూరోళ్ళందరూ ‘బొమ్మల గవరయ్యా!’ అని ప్రేమగా పిలిచేవాళ్ళు. ఆ పిలుపు నాకూ ఆనందాన్నిచ్చేది. సరదా అనిపించేది. ఆ సరదా నాకు ఎన్ని రోజులో నిలవలేదు.వూర్లో ఓ రజస్వల ఫంక్షనైతే బోర్డు రాయడానికి నన్ను పిలవలేదు. భోజనాలకి వెళ్ళినపుడు చూసేను. ఆ అమ్మాయి నిలువెత్తు ఫోటో... రకరకాల పోజుల్లో అందంగా నిలబడి వుంది ఫ్లెక్సీ రూపంలో. ‘‘ఎలగుందివోయ్ దద్దా?’’ అని అడిగేడు అది చేయించిన సుబ్బారావు దద్ద దాన్నే చూస్తూ నిలబడివున్న నా వెనక చేయి వేస్తూ.‘‘మరెందుకూ నీకు ఇబ్బంది పెట్టడం... తొందరగైపోద్ది గదాని నీకు పిల్లేదువోయ్.. ఏటనుకోకు’’ అన్నాడు. ఇంటికొచ్చి మంచమ్మీద కూర్చున్నాను. మంచం పక్కనే నా పెయింటింగ్ సామాన్లు పెట్టుకున్న పెట్టి. అప్రయత్నంగా దాని వైపు చూసేను.దానిమీద ఈగ వాలింది. తోలాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత అదిలిస్తున్నా అది వాలుతూనే వుంది. ‘క్లిక్’ మని శబ్దం వినపడ్డంతో అటు చూసేను. పెళ్ళిఫొటోలు తీస్తున్నాడు కురపాం సుధ.కేమెరా మీద ఎండ పడకుండా పేపరు అడ్డు పట్టుకోమన్నాడు. పట్టుకున్నాను. ఆ సాయంత్రం అతనితోనే నడిచి వెళ్ళేను స్టుడియోకి. ఆ వెళ్ళడం రోజూ అలవాటైపోయింది. అక్కడికి రోజూ రమ్మన్నాడుసాయంగా వుండడానికి. అలా వెళ్ళిన నేను కంప్యూటర్ ముందు కూర్చుని చిప్‌లోని ఫోటోలను లోడ్ చేసి ప్రింట్ ఇవ్వడం నేర్చుకున్నాను. అక్కడితో ఆగిపోకుండా ఫోటోషాప్ కూడా నేర్చుకున్నాను. అది మొదలు, స్టుడియో సుధర్శనతో ప్రోగ్రాములకి వెళ్ళడం ఫోటోలు తీయడం లాంటి పనులకు కూడా అప్పగించేవాడు. ఆక్రమంలోనే ఫోటో షాప్ నేర్చుకున్నాను. స్టుడియోలో పనులన్నీ చేయగల సామర్ధ్యం సంపాదించేను. ఇంటర్నెట్ కూడా వుండడంతో ఆ పనులూ అప్పజెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను వూరు మారిపోయేడు. అక్కడ ఇంతకన్నా పెద్ద షాపింగ్ మాల్ బిజినెస్ కోసంఓనరు వెళ్లిపోవడంతో అక్కడ కూడా తనలాంటి వాళ్ళు అవసరముంటుందని ‘నేనూ వచ్చేస్తాను సార్!’ అన్నాను. దానికతను ‘నువ్వాపని చెయ్యలేవ’ని సున్నితంగా తిరస్కరించేడు. ఏమి చెయ్యాలో తెలీలేదు. స్టుడియో షిఫ్టింగ్ సమయంలో నాకొక కొత్త ఐడియా వచ్చింది. పాత కెమేరాలని ఒక డొక్కులో దాచి పెడుతున్నాడు ఓనరు. ‘‘సార్! నాకో సాయం చెయ్యండి’’ అన్నాను. ఏమిటన్నట్టు చూసేడు ఓనరు. ‘‘నేనెలాగా మీ కొత్త షాపులో పనికి పనికి రాను. మీ పాత కెమేరా ఒకటి ఇప్పించండి’’ అన్నాను. ‘‘ఒరేయ్! ఇది చాలా కాస్ట్లీ కెమేరారా’’ అన్నాడు. ఇవ్వడం కుదరదన్నట్టు. బ్రతిమాలేను.‘‘సాయం చెయ్యండి. మీ రుణముంచుకోను’ ఆ రేటుని ఇన్స్టాల్మెంట్ల మీద తీర్చుకుంటాను’’ అన్నాను. మొదట్లో ఒప్పుకోకపోయినా... కాసేపటికి ఒప్పుకున్నాడు. అనుకున్నది సాధించాననే గర్వంతో తొలి రోజుల్లో చాలా వేగంగా పనులు చేయడం ఆరంభించాను. కొన్ని రోజులాగి ఒక కొత్త కేమెరా కొనుక్కోవచ్చని ఊహతో వున్నాను. కానీ... పెళ్ళి ఫోటోలు తీయడం... కరిజ్మా ఆల్బవ్ు చేయించి ఇవ్వడం... ఆధార్, రేషన్ కార్డులకి కూడా పాస్ఫోటోస్ తీయడం కూడా చేసేను. వూర్లో అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో ఆ పని కూడ కాస్త తగ్గింది. అందరూ వాట్సప్ ల్లో లైవ్ కవరేజీల్లో బిజీ అయిపోయేరు. ఇన్స్టాల్మెంట్లు తీరేసరికి... నా కెమేరా మీద కూడా ఈగ వాలింది. దాన్ని తోలుతూ అలిసిపోయాను గానీ, అది వాలడం మానలేదు. అలిసిన కళ్ళను మూసి నిదురలోకి జారిపోయేను. కళ్ళు తెరిచి చూస్తే... ఎదురుగా డిగ్రీ చదువుతున్న కొడుకు... సంతు.‘‘నానా! బయల్దేరుతున్నూ...’’ అని బేగ్ సర్దుకుంటున్నాడు. దిగులేసింది వాడిని చూసి, వాడి భవిష్యత్తుని తలచుకొని. నాలాగా పని చేయలేడు. సదువున్నోడని ఉజ్జోగం గేరంటీ లేదు. ఎందుకంటే ఆడి కన్నా ఎక్కువ సదివినోలు బోల్డుమంది వున్నారు వూర్లో. హాష్టల్లో వుండి కాలేజీ కెల్తున్నోడు. కరుసుల కేటి సేస్తున్నాడో! మొన్న సంతలో అమ్మిన పనసకాయల డబ్బులు తీసి వాడి చేతిలో పెట్టేను. నులక మంచమ్మీద కూర్చుని బూటు తాడు కట్టేసి నిలబడ్డాడు. అడ్డంగా తల వూపి ‘‘ఒద్దు నీదగ్గరే వుంచు’’ అని పేంట్ ఎనకజోబీ నుంచి పర్సు తీసి ఐదొందల కాగితం తీసి నా చేతిలెట్టేడు. ఆశ్చర్యపోయేను. నాకు తెలిసి ఈమద్దిన కూలికెల్లలేదు సంతు. ఉపాదిహామీ డబ్బులు రాలేదు. పెరట్లో పనస కాయలు తప్ప ఏదీ సంతలో అమ్మలేదు. అదే అడిగాను...‘‘ఎక్కడివిరా డబ్బులు?’’ నా గొంతులో కంగారునీ, అనుమానాల్నీ దూరం చేస్తూ చెప్పేడు. ‘‘నువ్వేమీ గాబర పడిపోకు నానా... నీనేమీ తప్పు చేయలేదు’’ అని మంచమ్మీదకూర్చున్నాడు.‘‘పగలు కాలేజీ కెల్లినా... రాత్రి పనికెల్తున్నాను’’ అన్నాడు బేగు వీపుకి దోపుకుంటూ. ‘‘ఏం పనిరా?’’ నా అనుమానాలు తీరలేదు. ‘‘పుట్టీ పని. రాత్రంతా రంగులేయడమే’’ అని బయల్దేరేడు పచ్చకాగితం నా చేతిలో పెడుతూ. వూరు దాటి కొండ మలుపు తిరుగుతున్న వాడు రాత్రికి రంగులు వేస్తున్న వాడిలా కనిపించేడు. కానీ... మరుక్షణమే భయమేసింది. ఆ రాత్రి మీద ఈగ వాలితే?!?అలా మొదలైన నా పనితనం మొదట్లో బాగానే సాగింది. ఇష్టమైన పని. లాభం కాకపోయినా పెళ్ళిళ్ళకి బోర్డులు మాత్రమే రాసే నేను కొన్నాళ్ళకి ఆ పని కూడా లేకుండా అయిపోయాను. దానికి కారణం ఫ్లెక్సి. గీసిన బొమ్మ కన్నా కంప్యూటర్ బొమ్మ ఆకర్షణీయంగా కనిపించడంతో ఆ పనీ నా చేతి నుండి జారిపోయింది. - మల్లిపురం జగదీశ్ -
తమిళ అసెంబ్లీలో జయ చిత్రపటం
సాక్షిప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో దివంగత సీఎం జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి కోసం జయ చేసిన కృషిని స్పీకర్ కొనియాడారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్, అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జయకు నివాళులర్పించారు. అసెంబ్లీ హాలులో ఇప్పటికే పెరియార్, అన్నాదురై సహా పదిమంది అగ్రనేతల చిత్రపటాలను గత ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. కాగా, చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని డీఎంకే, కాంగ్రెస్ బహిష్కరించాయి. అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆస్తుల కేసులో జయ దోషిగా తేలినందున ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీ నుంచి తొలగించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేసింది. -
40ఏళ్ల తర్వాత ఫేస్బుక్ వారిని కలిపింది..!
నాలుగు దశాబ్దాల తర్వాత ఆమె స్వప్నం సాకారమైంది. ఓ నర్సు ఒడిలో తాను హాయిగా ఒదిగి పోయిన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూసి... మైమరచిపోయేది. కాలిన గాయాలతో బాధపడుతున్నపుడు అక్కున చేర్చుకున్న ఆ మహిళను చూడాలన్నదే ఆమె తపన.. . అమండా స్కార్పినాటీ ఇరవై ఏళ్ళపాటు ఎలాంటి ఆధారం లేకుండా తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. తాను ఎలాగైనా ఆ నర్సును కలవాలన్నదే ఆశ. అమండాకు ఇప్పుడు 38 సంవత్సరాల వయసు.. ఫేస్ బుక్.. ఆమె లక్ష్య సాధనకు సహకరించింది. ఇరవై ఏళ్ళ స్వప్నాన్ని ఒక్కరోజులో సాకారం చేసింది. న్యూయార్క్ లోని అథెన్స్ లో హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్ గా పనిచేస్తున్న అమండా స్కార్పినాటి ఇరవై ఏళ్ళుగా తన శోధన కొనసాగిస్తూనే ఉంది. కేవలం మూడు నెలల పసిపాపగా ఉన్నపుడు మరుగుతున్న నీళ్లు పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు మందురాసి తలకు, చేతికి, తెల్లని గుడ్డతో కట్లు కట్టారు. పలు సర్జరీలు కూడ చేసి చివరికి గాయాలు తగ్గేలా చికిత్స అందించారు. ఎట్టకేలకు తాను బతికి బయట పడింది. అయితే తనను అంతలా లాలిత్యంతో సాకిన ఆ నర్సు ఎవరు? ఆమెను జీవితంలో ఎలాగైనా కలవాలి అన్నదే అమండా ఆశ... 1997 సంవత్సరంలో అమండాకు ఓ చిన్నపాటి క్లూ దొరికింది. అల్బానీ మెడికల్ సెంటర్ ప్రచురించిన వార్షిక నివేదికలో కార్ల్ హోవార్డ్ తీసిన చిత్రాల్లో ఆ నర్స్ ఫొటో కనిపించడంతో అమండా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ శీర్షికలో నర్స్ పేరు మాత్రం ప్రస్తావించలేదు. దాంతో అమండాకు దొరికిన చిన్నఆశ.. నీరుగారిపోయింది. అయినా ఆమె పట్టు వీడలేదు. ఈ నెల మొదట్లో అమండా తన చిన్ననాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆల్బనీ మెడికల్ సెంటర్ వార్షిక నివేదికలోని ఫొటోలను కూడ వరుసగా పోస్ట్ చేసింది. పై ఫోటోల్లోని నర్స్ పేరును గుర్తు పట్టేందుకు ట్రై చేయమని రిక్వస్ట్ కూడా పెట్టింది. తన ప్రయత్నంపై ఓ పక్క అనుమానం కలుగుతూనే ఉంది. ఆమె పోస్ట్ చేసిన పన్నెండు గంటల్లోపే ఆ ఫోటోలు ఐదు వేలసార్లు షేర్ అయ్యాయి. అంతేకాదు ఒక్క రోజులోనే ఆమెకు ఫలితం లభించింది. మెడికల్ సెంటర్ లో ఫెలోగా ఉన్న యాంజెలా ల్యూరీ ఫొటోలోని బెర్గర్ ను గుర్తు పట్టింది. అమండాకు ఆమె సుశాన్ బెర్గర్ అని చెప్తూ మెసేజ్ చేసింది. ''ఆమె ఎవరో నాకు తెలియదు.. నేను తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నపుడు నన్ను అక్కున చేర్చుకొని చికిత్స అందించింది. ఆమె ఒడిలో నేను సేద తీరానని నా ఫొటోలు చూస్తే నాకు తెలుస్తోంది. అంతేకాదు ఆమె నాపై ఎంతో శ్రద్ధ చూపించినట్లు కూడ అనిపించింది. నేనిప్పుడు ఆమెను కలుస్తున్నాను. ఈరోజు వస్తుందని నేనుకోలేదు'' అంటూ ఎంతో ఆనందంలో తేలిపోయింది అమండా స్కార్పినాటి. అమండాను కలిసే ముందు బెర్గర్ కూడ అప్పటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంది. సాధారణంగా పిల్లలు సర్జరీ తర్వాత నిద్ర పోతుంటారు. లేదా ఏడుస్తారు. కానీ అప్పట్లో ఈ పాప చాలా ప్రశాంతంగా ఉండేది... అంటూ జరిగిన విషయాన్ని నెమరువేసుకుంది. మనను జీవితాంతం గుర్తుకు తెచ్చుకునే అదృష్టం ఎంతమందికి కలుగుతుందో నాకు తెలియదు. నిజంగా నేను అటువంటి అదృష్టాన్ని పొందడం నాకు ఆనందంగా ఉంది అంటూ బెర్గర్ తన మనసులోని ఆనందాన్ని పంచుకుంది. ఓ లోకల్ టీవీ రిపోర్టర్... బెర్గర్ ను కలిసే ముందు అమండాతో ఫోన్లో మాట్లాడించాడు. పన్నెండేళ్ళ అమండా కుమారుడు కూడా... ఇది ఎంతో ఆనందకరమైన సందర్శమని, బెర్గర్ మాటలు వింటేనే ఆమె ఎంతటి సౌమ్యురాలో అర్థమైందని అన్నాడు. వారిద్దరి మీటింగ్ ప్రారంభమైన తర్వాత అమండా తన ఫీలింగ్ ను అందరితో పంచుకుంది. నిజంగా తాను బెర్గర్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని, తమ స్నేహం ఇప్పుడు మొదలయ్యేది కాదని, పరిచయం లేకపోయినా ఇది జీవిత కాల స్నేహమేనని తెలిపింది. సుమారు నలభై ఏళ్ళ తర్వాత వారి కలయిక ఇప్పుడు మెడికల్ సెంటర్ కాన్ఫరెన్స్ రూమ్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఆ ఉద్వేగ క్షణాలను ఎన్నో కెమెరాలు క్లిక్ మనిపించాయి.