breaking news
Pickpocket
-
చోరీ చేయబోయి..యువతికి దొరికాడు అంతే..
బస్సులో పర్సు చోరీ చేయాలనుకున్న దొంగకి చుక్కలు చూపించింది ఓ యువతి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఓ యువతి తన ఫోన్‌తో బిజిగా ఉంది. అదే సరైన సమయంగా బావించి హ్యాండ్ బ్యాగ్ లక్ష్యంగా చేసుకొని ఓ దొంగ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, అంతలోనే బస్సు స్టాప్ రావడంతో కొందరు ప్రయాణికులు దిగిపోయారు. అయినా ఆ దొంగ తన ప్రయత్నాలను విరమించుకోలేదు. సరిగ్గా హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టే సమయంలోనే యువతి గమనించి అందిరిని పిలవడానికి ప్రయత్నించింది. అంతలోనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దొంగపై తన కరాటే స్కిల్స్ చూపించింది ఆ యువతి. సెకన్లలోనే అతన్ని కుప్పకూలేలా చేసింది. గట్టిగా ఒక్క తన్ను తంతే వెళ్లి బస్సు సీట్లో పడ్డాడు. అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అని వారినే టార్గెట్ చేసే దొంగలకు ఈ వీడియో చూపించాలంటూ..సోషల్ మీడియాలో కామెంట్లమీద కామెంట్లు వస్తున్నాయి. -
ఎన్నారై జేబులో పర్సు చోరీ
ప్రకాశం (అద్దంకి) : అద్దంకిలోని సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన పోకూరి రామేశ్వరరావు అనే ఎన్నారై జేబులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పర్సు చోరీ చేశారు. ఆ పర్సులో రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువైన అమెరికన్ డాలర్లతో పాటు ట్రైన్ టికెట్లు కూడా ఉన్నాయి. బాధిత ఎన్నారై ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.