breaking news
PG medical councelling
-
గుంటూరులో మంత్రి సత్యకుమార్‌కు చేదు అనుభవం
-
ముగిసిన పీజీ మెడికల్ నాన్ సర్వీసింగ్ కౌన్సెలింగ్
విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో నాన్‌సర్వీస్ అభ్యర్థులకు గత నెల 29 నుంచి నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ మంగళవారంతో ముగిసింది. దీనిలో భాగంగా 944 సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో క్లినికల్ డిగ్రీలో 621, నాన్ క్లినికల్ డిగ్రీలో 138, క్లినికల్ డిప్లొమాలో 172, నాన్ క్లినికల్ డిప్లొమాలో 13 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ఓపెన్ కేటగిరీలో 357, బీసీ కేటగిరీలో 360, ఎస్సీ కేటగిరీలో 168, ఎస్టీ కేటగిరీలో 59 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. బుధవారం సర్వీస్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
ఎన్టీఆర్ యూనివర్సిటీ పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 29న ప్రారంభమవుతుందని వైస్ ఛాన్సలర్ రవిరాజ్ మంగళవారం తెలిపారు. ఈ బుధవారం ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ మే 7వరకు కొనసాగిస్తామని ఆయన అన్నారు. అదే విధంగా రెండో విడత కౌన్సెలింగ్ జూన్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవిరాజ్ పేర్కొన్నారు.