breaking news
peoples movement
-
ప్రజాస్వామ్యంలో ఏకతా శక్తి
ధార్మిక, సాంస్కృతిక, జ్ఞాన భూమి అయిన బిహార్‌లో గంగా, ఘాఘరా నదుల సంగమ స్థానాన ఉన్న సితాబ్ దియారా గ్రామంలో 1902 అక్టోబరు 11న జయప్రకాశ్ నారాయణ్ జన్మించారు. మనమంతా ఆత్మీయంగా జేపీ అని పిలుచుకునే జయ ప్రకాశ్ నారాయణ్... గొప్ప రాజ నీతిజ్ఞుడు, ప్రజాస్వామ్య రక్ష కుడు, ‘సంపూర్ణ క్రాంతి’ రూప శిల్పి. ‘లోక్ నాయక్’ బిరుదు ఆయనకు ఎవరో పెద్దలుఇచ్చింది కాదు... 1974 జూన్ 5న పట్నాలోని గాంధీ మైదా నంలో సమావేశమైన లక్షలాది ప్రజలు ప్రేమతో ఆయనను ‘లోక్ నాయక్’ అని పిలిచారు. రాజకీయ చేతనకు పునాది సితాబ్దియారాలో ప్రాథమిక విద్య అనంతరం పట్నా వెళ్లిన ఆయనను అక్కడి జాతీయవాద వాతావరణం ఆకట్టుకుంది. ఇంట ర్మీడియట్ చదువుతున్న రోజుల్లో దేశంలో బ్రిటిష్ ఆక్రమణవాదా నికి వ్యతిరేకంగా సాగుతున్న అహింసాయుత, సహాయ నిరాకరణో ద్యమం ఆయనపై అమితమైన ప్రభావం చూపింది. అమెరికాలో ఏడేళ్ల విద్యాభ్యాస సమయంలో మార్క్సిజం వైపు ఆకర్షితుడయ్యారు. దేశంలో సమస్యలన్నింటికీ మార్క్సిజమే పరి ష్కారం చూపుతుందని ఆ సమయంలో భావించారు. అయితే, భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఈ దేశ పరిస్థితులకు మార్క్సిజాన్ని అన్వయించే సాధ్యాసాధ్యాలను అన్వేషించిన అనంతరం... ‘ప్రజా స్వామ్య సామ్యవాదం’, ‘సర్వోదయ’ భావనలే ఇక్కడి సమస్యలకు పరిష్కారమన్న నిశ్చయానికి వచ్చారు. ఈ ఆచరణాత్మక దృక్పథమే జేపీ ఔచిత్యానికీ, రాజనీతిజ్ఞతకూ నిదర్శనం. శ్రమ విలువ తెలిసినవారు!వినోబా భావే భూదానోద్యమాన్నీ, సర్వోదయ తాత్వికతనూ మేళవిస్తే దేశంలోని భూ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారం లభిస్తుందని 1952లో జేపీ భావించారు. 1954–73 మధ్య కాలంలో ఆయన చేపట్టిన చంబల్ బందిపోట్ల పునరావాసం, అహింసాయుత సంపూర్ణ విప్లవం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునూ, ప్రశంసలనూ పొందాయి. ‘శ్రమకు గౌరవం (డిగ్నిటీ ఆఫ్ లేబర్)’ అన్న భావనను జేపీ అర్థం చేసుకున్న తీరు కేవలం సైద్ధాంతికపరమైంది కాదు. స్వీయా నుభవాల నుంచి గ్రహించినదే. అమెరికాలో అభ్యసిస్తున్న రోజుల్లో ‘చదువుకుంటూనే సంపాదించుకోవడం’ ఆయనకు అలవడింది. ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న పనులు చేశారు. నిజాయతీగల శ్రమకు గౌరవం, న్యాయబద్ధమైన వేతనాలు, మానవీయ పని వాతా వరణం ఉండి తీరాలన్న ఆయన నిశ్చయాన్ని ఇవి మరింత బలో పేతం చేశాయి. కార్మిక వర్గ సంక్షేమమే న్యాయబద్ధమైన సమాజానికి పునాది అన్న దృఢమైన నిశ్చయంతో ఆయన భారత్‌కు వచ్చారు. ముఖ్యంగా 1947లో మూడు ముఖ్యమైన అఖిల భారత కార్మికసంఘాలు – అఖిల భారత రైల్వే సిబ్బంది సమాఖ్య, అఖిల భారత పోస్టుమెన్ – టెలిగ్రాఫ్ దిగువ స్థాయి సిబ్బంది సంఘం, అఖిల భారత ఆయుధ కర్మాగారాల కార్మికుల సంఘాలకు ఆయన అధ్య క్షుడిగా ఎన్నికయ్యారు.1960ల సమయంలో రుతుపవనాల వైఫల్యం బిహార్‌ను కరవు పరిస్థితిలోకి నెట్టింది. ఆ సమయంలో జేపీ తన భూదానోద్యమ సహచరులు, అనుచరులతో కలిసి ప్రజల బాధలను తగ్గించేందుకు సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. ‘బిహార్ రాహత్ కమిటీ’తో ఈ సమయంలోనే ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ‘దేశ సేవా దృక్పథా’న్ని ప్రత్యక్షంగా చూశారు. అది ఆయననెంతో ప్రభావితం చేసింది. నా అనుభవంజీవితంలో ప్రతి దశలోనూ అవినీతి సమస్యను ఎదుర్కొన్న జేపీ... భారతీయ సమాజ పునరుజ్జీవనం, పునర్నిర్మాణంలో భాగ స్వాములయ్యేలా దేశ యువతను ప్రేరేపించాల్సిన ఆవశ్యకతఉందని భావించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్న తరుణంలో... ప్రజాస్వామ్య శక్తిపై వారిలో ఆశలనూ, నమ్మకాన్నీ పునరుద్ధరించారు. 1973లో వినోబా భావే పవనార్ ఆశ్రమం నుంచి ‘సంపూర్ణ విప్లవం’ దిశగా జేపీ స్పష్టంగా పిలుపు నిచ్చారు. ఆదర్శ మానవీయ సమాజాన్ని సాధించడమే ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమ లక్ష్యం. అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం గొంతె త్తిన ఆయన భావాలు నాటి రాజకీయాల్లో వేళ్లూనుకున్నాయి. ప్రజల్లో చైతన్యాన్ని రగల్చగల ఆయన సమర్థత, 1977లో దేశంలో ఓ కొత్త వ్యవస్థను నెలకొల్పే దిశగా వారి ఆగ్రహాన్ని ఆయన మళ్లించిన తీరు అనన్య సామాన్యం. 19 ఏళ్ల యువకుడిగా కోయంబత్తూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్ర టరీగా ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమంలో భాగస్వామినయ్యే అవకాశం దక్కడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఈ దశలో, దేశ చరిత్రలో అత్యంత కీలక సమయంలో నేను నేర్చుకున్న విషయాలు యువ కుడిగా ఉన్న నన్ను... ఆత్మవిశ్వాసంతో కూడిన, సామాజిక అవగా హన కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దాయి.మన ప్రియతమ నేత జయప్రకాశ్ నారాయణ్‌ను ప్రేమగా గుర్తు చేసుకుంటున్న మనం... దేశ స్వాతంత్య్రోద్యమం కోసం నిస్వార్థంగా బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన ఆయన జీవిత భాగస్వామి ప్రభావతీ దేవినీ మరవకూడదు. గాంధీ ఆదర్శాల సాధన కోసం నిస్వార్థంగా ఆమె తన శక్తినంతా వెచ్చించారు.జేపీ వారసత్వం 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నుంచి 1970లో చేపట్టిన ‘సంపూర్ణ క్రాంతి’ దాకా... దేశం పట్ల ఉన్న ప్రేమ భావనే ఆయనను నిరంతరం ముందుకు నడిపింది. ప్రభుత్వంలో తనకు నచ్చిన పదవిని పొందే అవకాశం దొరికినప్పటికీ, అధికార వ్యామోహానికి ఆయనెప్పుడూ లొంగలేదు. నిస్వార్థ దేశసేవకే కట్టుబడి ఉన్నారు. ఎంత కఠినమైన సవాళ్లు ఎదురైనా, ప్రజలు తలచుకుంటే మార్పును తేగలరని చెప్పడానికి జేపీ జీవితం, బోధనలు నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుంటూనే – సమానత్వం, న్యాయం, శాంతి నెలకొని ఉన్న సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన బోధనల సారాంశం. సామాజిక, ఆర్థిక న్యాయమూ, రాజకీయ స్వేచ్ఛ విడదీయలేనివని ప్రకటించిన దార్శనిక నాయకుడాయన. విప్లవమంటే హింస అని భావించే అవకాశం ఉంది. కానీ, జేపీ చేపట్టిన సంపూర్ణ విప్లవానికి అహింసే ప్రాతిపదిక. అహింసాయుత ప్రజా ఉద్యమం ద్వారా... వ్యవస్థాగతంగానూ, సామాజికంగానూ మానవత, నైతికత విలువల ఆధారంగా భారత పురోగమనానికి ఆయన పునాది వేశారు. జాగరూకులమై, నిస్వార్థం, సేవ, సత్యసంధతతో భారత అభ్యున్నతికి కృషి చేయడమే మనం ‘భారతరత్న’ జేపీకి అందించే నిజమైన నివాళి.-సి.పి. రాధాకృష్ణన్ భారత ఉప రాష్ట్రపతి -
ఇది ప్రజా ఉద్యమం
గ్వాలియర్(మధ్యప్రదేశ్), చండీగఢ్, చర్ఖిదాద్రి (హరియాణా), భరూచ్(గుజరాత్): వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ప్రజా ఉద్యమమని, ఇది విజయం సాధించి తీరుతుందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ విశ్వాసం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు రద్దయ్యేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని, అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లోనే నిరసన కొనసాగిస్తామని, ఇళ్లకు వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి ఖాప్ పంచాయత్‌లు, వాటి నేతలు గొప్పగా సహకరిస్తున్నారన్నారు. హరియాణాలో ఆదివారం జరిగిన ఒక కిసాన్ మహా పంచాయత్‌కు ఆయన హాజరయ్యారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ హరియాణాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే, సాంగ్వన్ ఖాప్ పంచాయత్ ముఖ్యుడు సాంబిర్ సాంగ్వన్ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఖాప్ పంచాయత్‌లు హర్షవర్ధన మహారాజు కాలం నుంచి ఉన్నాయని, అప్పటి నుంచి సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నాయని తికాయత్ గుర్తుచేశారు. రైతు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాంతాలపరంగా, మతాల పరంగా నేతల్లో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని, అయితే, వారి ప్రయత్నాలేవీ సఫలం కాలేదని పేర్కొన్నారు.‘ఉద్యమ వేదిక మారదు.. ఉద్యమ నేతలు మారరు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న 40 మంది రైతు నేతలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఉద్యమ నేతల్లో విబేధాలు లేవని స్పష్టం చేశారు. పంజాబ్‌కు చెందిన బీకేయూ నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. మరోవైపు, ఈ రైతు ఉద్యమం కొన్ని ప్రాంతాలకే పరిమితమని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానించారు. రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. అధికారంలో ఉండగా, రైతుల కోసం ఏమీ చేయని కాంగ్రెస్‌కు.. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వ్యవసాయం గురించి తోమర్‌కు ఏమీ తెలియదన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని, కాంగ్రెస్ కూడా ఆయనను పట్టించుకోవడం మానేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగానే ఉందని, చర్చల విషయంలో ప్రభుత్వం ఒక ఫోన్‌కాల్ దూరంలోనే ఉందని ప్రధాని కూడా స్పష్టం చేశారని, అయినా రైతు ప్రతినిధుల నుంచి స్పందన లేదని కేంద్ర మంత్రి, రైతులతో చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. రైతు ఆత్మాహుతి రైతు ఉద్యమానికి మద్దతుగా ఒక 52 ఏళ్ల రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని టిక్రీ నిరసన కేంద్రానికి 2 కిమీల దూరంలో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నారు. హరియాణాలోని జింద్‌కు చెందిన కరంవీర్ సింగ్‌గా ఆయనను గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘రైతు సోదరులారా.. మోదీ సర్కారు తేదీలపై తేదీలు ప్రకటిస్తోంది. ఈ నల్ల చట్టాలు ఎప్పుడు రద్దవుతాయో తెలియడం లేదు’ అని చేతిరాతతో ఉన్న ఆ లేఖలో ఉంది. దాదాపు రెండు వారాల క్రితం హరియాణాకే చెందిన మరో రైతు విషం తాగి ఆత్మాహుతికి పాల్పడ్డ విషయం తెలిసిందే. చట్టాలను వెనక్కు తీసుకోండి వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అమెరికా నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రధాని తన ఇంటికి పిలిచి ఆతి«థ్యమిచ్చిన తరహాలోనే.. రైతులకు కూడా ఆతిథ్యమిచ్చి, సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పెద్ద మనసు చేసుకుని రైతుల బాధ అర్థం చేసుకోవాలన్నారు. రైతుల నిరసనతో ప్రధాని మోదీకి నిద్ర కరవైందని ఎద్దేవా చేశారు. గుజరాత్లో గిరిజనులు, ముస్లింలు, దళితులు, ఓబీసీలు ఏకం కావాలన్నారు. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, భరూచ్ల్లో భారతీయ ట్రైబల్ పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. -
మెరుపుదాడుల వ్యూహకర్త
ముగిసిన కిష్టయ్య ఉద్యమ ప్రస్థానం ► రెండు దశాబ్దాలకు పైగా పోరుబాటలోనే.. ► మిలిటెంట్ నుంచి అంచలంచెలుగా అగ్రనేతగా.. ► సాంబశివుడు, నయీమ్‌కు ఇతడే గురువు ► 26 ఏళ్లుగా ఇంటిముఖమే చూడని వైనం సాక్షి, యాదాద్రి/వలిగొండ: మిలిటెంట్‌గా చేరి అంచలంచెలుగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన శ్యామల కిష్టయ్య అలియాస్ దయూ 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడేనికి చెందిన చంద్రమ్మ, రామయ్య దంపతుల ఆరో సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్‌వార్ ఉద్యమంలోకి వెళ్లాడు. భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో బీకాం చదువుతూ 1990లో ఆర్ఎస్యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్ గా పనిచేస్తూ వలిగొండ, భువనగిరి, ఆలేరుతోపాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యాడు. కిష్టయ్యకు మెరుపుదాడుల వ్యూహకర్తగా పేరుంది. సాయుధ గెరిల్లా నక్సల్స్ శిక్షకుడిగా, సాంకేతిక విభాగం సభ్యుడిగా, మిలటరీ ప్లటూన్ నాయకుడిగా పనిచేశాడు. పోలీసులు పలుమార్లు వచ్చి ‘మీ కుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని చెప్పండి’ అంటూ కిష్టయ్య తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఓఎస్డీ వెంకటేశ్వర్లు 2015లో కిష్టయ్య ఇంటికి వెళ్లి ఆయన తల్లి, సోదరులను కలిశారు. కిష్టయ్య లొంగి పోతే ఆయనపై ఉన్న రూ.20 ల క్షల రివార్డు ఇప్పిస్తామని, బతుకుదెరువుకు సహకరిస్తామని చెప్పారు. అయినా కిష్టయ్య ఏనాడు ఇంటివైపు చూడలేదు. ఆ యనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. నయీమ్‌ను చేర్పించాడు పీపుల్స్‌వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్‌తో పాటుమరెందరినో కిష్టయ్య పీపుల్స్‌వార్‌లో చేర్పించాడు. వలిగొండలోనే పదో తరగతి వరకు డిగ్రీ భువనగిరిలో చదివాడు. ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న నయీమ్‌ను చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. వలిగొండలో పీపుల్స్‌వార్‌కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు. సహచర ఉద్యమకారిణి సుభద్ర అలియాస్ స్వర్ణ అలియాస్ లతను కిష్టయ్య వివాహమాడాడు. ఆమె వరడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందింది. 26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా.. పీపుల్స్‌వార్‌లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్కరోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నా పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తన కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులకు కూడా ఆయన పేరు తప్ప ఆయన ఉనికి తెలియదు. బుల్లెట్ గాయూలతో తప్పించుకుని కిష్టయ్యకు గన్‌మన్‌గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో స్వామి మృతి చెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య తాజాగా ఏవోబీ ఎన్కౌంటర్లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది. తన కుమారుడి ఆఖరిచూపైనా చూడలేకపోయానని తల్లి చంద్రమ్మ విలపిస్తోంది. అంతా అక్కడినుంచే.. దాసిరెడ్డిగూడెం ఉద్యమకారులకు పుట్టినిల్లుగా మారింది. కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడు, కొనపురి రాములు, రాపోలు స్వామి వీరంతా ఈ గ్రామానికి చెందిన వారే. వీరిలో రాపోలు స్వామి 2009లో ఎన్కౌంటర్లో మృతి చెందా డు. కొనపురి సోదరులు ఉద్యమం నుంచి బయటకు వచ్చాక (సాంబశివుడు 2011లో, రాములు 2014లో) హత్యకు గురయ్యారు. కిష్టయ్య మృతి తో దాసిరెడ్డిగూడెంలో మావోయిస్టుల చరిత్ర ముగిసినట్టయింది. గణేశ్‌తో ఉద్యమ బంధం గణేశ్ సహచరుడు కిష్టస్వామి సాక్షి, భూపాలపల్లి: ఎన్కౌంటర్లో మరణించిన గాజర్ల రవి అలియాస్ గణేశ్‌తో తనది తీరని బం ధమని బండి కిష్ట స్వామి పేర్కొన్నారు. వీరిద్దరిదీ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశా ల గ్రామం. గణేశ్, తాను చిన్నప్పటి నుంచి ఒకే ఊరిలో పెరిగామని, కలసి చదువుకున్నామని కిష్టస్వామి గుర్తుచేసుకున్నారు. 1992లో ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లి, ఉత్తర తెలంగాణ ఫారెస్ట్ డివిజన్ కమిటీల్లో 1992-1999లో పనిచేసినట్లు చెప్పారు. తాను మహదేవాపూర్ దళంలో, గణేశ్ ఏటూరునాగారం దళంలో చేరామన్నారు. 8 నెలలకే ఏటూరునాగారం దళ కమాండర్‌గా గణేశ్ ఎదిగాడని, మహదేవపూర్ లెంకలగడ్డ దాడిలో ఇద్దరం పాల్గొన్నట్లు తెలిపా రు. 1997 మేలో ఖమ్మం జిల్లా వెంకటాపురం, చత్తీస్‌గఢ్ సరిహద్దులో నుంచి 11 మంది చొప్పున 2 బృందాలతో వస్తుండగా పోలీసులు కాల్పులు జరిపారని, కాల్పుల్లో తన భార్య జ్యో తి మరణించగా, మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లామన్నారు. ప్రతిగా పాల్వంచ ఇంటెలిజెన్స్ ఎస్ఐని పీపుల్స్‌వార్ చంపినట్లు తెలిపారు. త్యాగాలు తప్పవు గణేశ్ సోదరులు సమ్మయ్య, అశోక్ సాక్షి, భూపాలపల్లి/ చిట్యాల: ఉద్యమంలోకి వెళ్లిన వారు, వారి కుటుం బాలకు త్యాగాలు తప్పవని మావోయిస్టు గణేశ్ సోదరులు అశోక్ అలి యాస్ ఐతు, సమ్మయ్య పేర్కొన్నారు. ‘ప్రజలను భూస్వాములు పీడించారు. పోలీసులు అమాయకులను ఇబ్బందులు పెట్టారు. దానికి అన్న సారన్న అలియాస్ ఆజాద్ తొలుత ఎదురు తిరిగాడు. తర్వాత మేమూ ఆ బాటలో నడిచాం. అనారోగ్య కారణాలతో నేను మధ్యలో లొంగిపోయా. గణేశ్ కొనసాగాడు’ అని అశోక్ చెప్పారు. 2009లో ఎన్కౌంటర్లో గణేశ్, అశోక్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారని, వెళ్లి చూస్తే అదేమీ లేదని సమ్మయ్య చెప్పారు. ఇప్పుడు మృతుల్లో గణేశ్ ఉన్నట్లు చెబుతున్నారని, స్వయంగా చూస్తే కానీ నమ్మలేమన్నారు. -
మంత్రి టీజీ వెంకటేష్‌కు సమైక్య సెగ
కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజా ఉద్యమంలో పాల్గొనకుండా.. పదవులను విడవలేకపోతున్న నాయకుల వెన్నులో చలి మొదలైంది. సమైక్యాంధ్ర పరిరక్షణకు కంకణబద్ధులైన ఉద్యోగులు, ప్రజలు రాజీనామా చేయని నేతల భరతం పడుతున్నారు. బయటి నుంచి వచ్చే నాయకులైనా.. జిల్లా ప్రజా ప్రతినిధులైనా సమైక్యవాదుల ముప్పేట దాడితో వణికిపోతున్నారు. ఆరు నూరైనా విభజన ప్రకటనను విరమించుకునే వరకు పోరుబాట వీడబోమని భీష్మిస్తున్నారు.. కలసిరాకపోతే నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర పరిరక్షకులు సింహాలై గర్జిస్తున్నారు. ఆదివారం కర్నూలులోని గౌరీగోపాల్ ఆసుపత్రి సమీపంలో కొత్తగా నిర్మించిన సస్య ప్రైడ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి అడుగడుగునా అవాంతరాలు తప్పలేదు. ఈ ఒక్క ఘటనతో రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని వెంట తెచ్చుకున్నా.. పోలీసు బలగాలను భారీగా మోహరించినా సమైక్యవాదులను నిలువరించలేకపోయారు. ప్రారంభోత్సవాన్ని ముగించుకుని వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని ‘డ్రామాలు కట్టిపెట్టి పదవికి రాజీనామా చేయాలని’ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ పైకి చెప్పు విసరడం ఆగ్రహావేశాలకు కారణమైంది. రెచ్చిపోయిన మంత్రి కారు నుంచి బయటకొచ్చి మీసాలు మెలేసి తొడ కొడుతూ అసలుసిసలైన సమైక్యవాదిని తానేనంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే న్యాయవాదులు సైతం అంతే ఆగ్రహంతో ఆయన తీరుపై విరుచుకుపడ్డారు. చివరకు పోలీసులు అతి కష్టం మీద ఉద్యమకారుల అడ్డు తొలగించి ఆయన కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు. ఇంతలో టీజీ అనుచరులు న్యాయవాదుల దీక్షా శిబిరంపైకి చెప్పులు విసరడంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత న్యాయవాదులను అరెస్టు చేయడంపై ఉద్యమకారులు మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు కార్యకర్తలు స్థానిక నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌ను ముట్టడించడంతో పాటు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇదే సమయంలో జేఏసీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఉద్యమకారులను బేషరతుగా వదిలేశారు. అయితే మంత్రి టీజీ తీరుపై అన్నిపక్షాల జేఏసీలు దుమ్మెత్తిపోశాయి. పోలీసులు సైతం మంత్రి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. -
'ప్రజల గుండెల్లోంచి వచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమం'
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల గుండెల్లోంచి వచ్చిందని, నాయకుల నుంచి కాదని టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడిఉన్నానని ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రకటన ద్వారా రాక్షస రాజకీయ క్రీడకు యుపిఏ చైర్పర్స్న్ సోనియా గాంధీ తెరలేపారని విమర్శించారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలను సోనియా అడ్డుకుని దమననీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తొలుత రాష్ట్ర విభజనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన హరికృష్ణ ఆ తరువాత రాష్ట్ర విభజన తీరు బాగాలేదని నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగు వాడిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. తెలుగు వారంతా కలిసి ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారని, ఎవరిని అడిగి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. తెలుగువారిని విడగొట్టే హక్కు సోనియా గాంధీకి ఎవరిచ్చారని హరికృష్ణ ప్రశ్నించారు.


