breaking news
people voice
-
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
పరామర్శకు వస్తే అడ్డుకుంటారా!
- జగన్మోహన్రెడ్డి ఎవరినీ బెదిరించలేదు - ఆయన వస్తున్నారని తెలియగానే హడావుడి చేశారు - శవాలను త్వరగా తీసుకెళ్లమని అంబులెన్సులు పంపారు - బస్సు ప్రమాదంలో మరణించిన మృతుల బంధువుల వెల్లడి గరిడేపల్లి (హుజూర్నగర్): కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సమీపంలోని ముండ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారిని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని మృతుల బంధువులు ఆరోపించారు. ఆయన ఎవరినీ బెదిరించలేదని స్పష్టంచేశారు. మానవత్వంతో పరామర్శించేందుకు వచ్చిన జగన్‌ను అడ్డుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్‌కు వంతపాడడం దారుణమని మండిపడ్డారు. బస్సు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కోదండరాంపురానికి చెందిన సోదరులు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారమిక్కడ అశ్రునయనాల మధ్య వారి అంత్యక్రియలు నిర్వహించారు. శేఖర్‌రెడ్డి భువనేశ్వర్ ఆర్మీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో ఆర్మీ అధికారులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న నేతపై అక్కసు వెళ్లగక్కడం సిగ్గుచేటన్నారు. మేం కూడా బతకలేం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదంలో పెళ్లీడుకొచ్చిన కొడుకులిద్దర్నీ కోల్పోయాను. మేం కూడా ఇక బతకలేం. – శేషిరెడ్డి, కోదండరాంపురం (శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల తండ్రి) ప్రభుత్వాలపై హైకోర్టులో రిట్ వేస్తా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే మా పిల్లలు చనిపోయారు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ వస్తే అడ్డుకోవడం దారు ణం. ఆయన ఎవరినీ బెదిరించ లేదు. ప్రభుత్వాలు స్పందించ కపోతే... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై రిట్ వేస్తాను. సాయం చేయాల్సిన ప్రభుత్వం అసలు విషయాన్ని పక్కన పెట్టి జగన్‌ను అడ్డుకుంది. – ఎన్.సత్యనారాయణరెడ్డి, మృతుల పెదనాన్న, అడ్వొకేట్, హైదరాబాద్ మంత్రి పట్టించుకోలేదు చనిపోయిన వారు మా బావమర్దులు. ప్రమాదంలో మర ణిస్తే వారిని పరామర్శిం చాల్సిన మంత్రి కామినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి పట్టించుకోలేదు. జగన్ వస్తున్నారన్న విషయాన్ని తెలు సుకున్న అధికారులు.. చిన్న అంబులెన్స్‌లను పంపించి శవాలను త్వరగా తీసుకెళ్లమని చెప్పారు. – కట్టా శ్రీనివాస్‌రెడ్డి, నేరేడుచర్ల కావాలనే బద్నాం చేస్తున్నారు పోస్టుమార్టం చేసేటప్పుడు డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిం చారు. డ్రైవర్ ఎలా చనిపోయాడో.. ఆల్క హాల్ తీసుకున్నాడా.. లేదా..అన్న విష యం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సింది. ఈ విషయంపైనే జగన్ అడిగారు. అయినా డాక్టర్లు నోరు విప్పలేదు. జగన్‌ని ప్రభుత్వం కావాలని బద్నాం చేస్తోంది. – తోడేటి బాలకృష్ణ, స్నేహితుడు, గరిడేపల్లి దివాకర్ ట్రావెల్స్‌ను నిషేధించాలి దివాకర్ ట్రావెల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధించాలి. కేవలం ఒకే డ్రైవర్‌ను కేటాయించడం వల్ల 11 మంది ప్రాణాలు గాల్లో కలిసా యి. అయినా ఏపీ ప్రభుత్వం దివాకర్ ట్రావెల్స్‌పై చర్య తీసుకోకపోవడం బాధాకరం. జగన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు. జగన్ రాకతోనే మాకు న్యాయం జరిగింది. – వెన్న రవీందర్‌రెడ్డి, కోదండరాంపురం