breaking news
peddler
-
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హైదరాబాద్ లో డ్రగ్స్ ఫెడ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్
-
ప్రవీణ్... ఎ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్!!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెమికల్ షాపుల నుంచి అక్రమంగా పెట్రోలియం ఈథర్ ఖరీదు చేయడం... దీన్ని విశాఖ ఏజెన్సీకి తరలించి హష్ ఆయిల్ తయారీదారులకు విక్రయించడం... వాళ్ల నుంచి హష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ఉన్న పెడ్లర్లకు సరఫరా చేయడం... కొన్నాళ్లుగా ఈ పంథాలో రెచ్చిపోతున్న ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారు లకు చిక్కాడు. ఇతడితో పాటు ముగ్గురు పెడ్లర్స్‌ను పట్టుకున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. మూడేళ్ల క్రితం పెడ్లర్‌గా మొదలెట్టి... కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్ దాదాపు మూడేళ్ల క్రితం గంజాయి పెడ్లర్‌గా మారాడు. ఇతడికి విశాఖ ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలం అలగాం ప్రాంతానికి చెందిన గంజాయి పండించే గిరిజనులతో పరిచయమైంది. కొన్నాళ్లుగా వాళ్లు గంజాయి నుంచి తీసే హష్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రవీణ్ అదే దందా చేశాడు. హష్ ఆయిల్ తయారీకి పెట్రోలియం ఈథర్ అవసరం. ఇది ఏజెన్సీలో దొరకట్లేదనే విషయం తెలుసుకున్న ఇతగాడు తాను సరఫరా చేస్తానంటూ గిరిజను లతో ఒప్పందం చేసుకున్నాడు. దాన్ని వినియో గించి తనకు హష్ ఆయిల్ తయారు చేసి ఇవ్వాలంటూ షరతు పెట్టాడు. రెండు ఏజెన్సీల నుంచి అక్రమంగా... పెట్రోలియం ఈథర్‌ను పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే విక్రయించాలి. అదీ అధీకృత పత్రాలు సేకరించిన తర్వాతే అమ్మాలి. అయితే నగరంలోని కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్ ఈ నిబంధనను తుంగలో తొక్కాయి. ఎలాంటి పత్రాలు లేకుండా ప్రవీణ్‌కు భారీ మొత్తంలో విక్రయిస్తున్నాయి. దీని రవాణా కోసం ఓ వాహ నం ఖరీదు చేసిన ఇతను డ్రైవర్‌ను నియమించుకున్నాడు. ఈథర్‌ను ఇక్కడ లీటర్ రూ.100కు కొని, అలగాం తరలించి అక్కడి వారికి రూ.400కు అమ్ముతున్నాడు. ఇలా ఇప్పటి వరకు ఈ రెండు ఏజెన్సీల నుంచి 1400 లీటర్లు కొనుగోలు చేశాడు. హష్ ఆయిల్ ‘డిస్ట్రిబ్యూటర్’గా మారి... పెట్రోలియం ఈథర్‌తో తయారు చేసిన హష్ ఆయిల్‌ను ప్రవీణ్ గిరిజనుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నాడు. లీటర్ గరిష్టంగా రూ.30 వేలకు కొని, తీసుకువచ్చి హైదరాబాద్ లోని 15 మంది పెడ్లర్స్‌తో పాటు బెంగళూరులో ఉన్న వారికీ సరఫరా చేస్తున్నాడు. నగరంలో లీటర్ రూ.70 వేల నుంచి రూ.80 వేలకు, బెంగళూరులో రూ.1.2 లక్షలు నుంచి రూ.1.4 లక్ష లకు విక్రయిస్తున్నాడు. చిన్న చిన్న డబ్బాల్లో ప్యాక్ చేసి డబ్బాల్లో అమ్మితే ప్రవీణ్‌కు లీటర్‌కు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఇలా అటు ఇథనాల్, ఇటు హష్ ఆయిల్ రెండింటి దందా చేస్తూ కొన్నాళ్లుగా రెచ్చిపోతున్న ఇతడికి గోవాలో కూడా నెట్వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చిక్కడపల్లిలో సరఫరా చేస్తుండగా... ప్రవీణ్ కుమార్‌కు నగరంలో ఉన్న పెడ్లర్లలో పటాన్చెరు, కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన పి.మోహన్ యాదవ్, పి.కళ్యాణ్, బి.సురేష్ కీల కం. ఇటీవల ఏజెన్సీ నుంచి హష్ ఆయిల్ తెచ్చిన ఇతడు దాన్ని చిన్న డబ్బాల్లో ప్యాక్‌చేసి పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. మంగళవారం చిక్కడపల్లి వద్దకు ఈ ముగ్గురికీ ఇచ్చేందుకు 60 డబ్బాలు తీసుకువచ్చాడు. దీనిపై హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రమేష్‌రెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై సి.వెంకటరాములు నేతృత్వంలోని బృందం వలపన్ని నలుగురినీ పట్టు కుంది. వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు 400 లీటర్ల ఈథర్, వాహనం స్వాధీనం చేసుకున్నా రు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోలియం ఈథర్‌ను వికయ్రించిన కూకట్పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన నర్మద ట్రేడర్స్, మహాలక్ష్మీ కెమికల్ ట్రేడర్స్‌పై కేసులు నమోదు చేశారు. ప్రవీణ్‌పై గతంలోనూ కేసులు కాగా, ప్రవీణ్‌పై గతంలో రెండు కేసులు నమోదై నట్టు పోలీసులు గుర్తించారు. 2015లో కూకట్ పల్లిలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన ముఠాలో సభ్యుడిగా కేసు నమోదైంది. 2020లో కూకట్‌పల్లిలోనే గంజాయి అమ్ముతూ పట్టుబడిన కేసు విచారణలో ఉంది. -
నార్కోటిక్ అధికారుల అదుపులో స్మగ్లర్ మోహిత్
-
డ్రగ్‌తో దొరికితేనే పెడ్లర్
♦ వాడుతున్నానని చెబితే బాధితుడు ♦ అమ్మినట్టు ఆధారాలుంటేనే నేరారోపణ సాక్షి, హైదరాబాద్: అసలు డ్రగ్స్ కేసుల్లో ఎవరు డీలర్ (పెడ్లర్)? ఎవరు బాధితులు? ఈ అంశాలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్డీపీఎస్(నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ ప్రకారం... ఓ వ్యక్తిని దర్యాప్తు విభాగాలు తనిఖీ చేసినప్పుడు అతడి వద్ద డ్రగ్స్ దొరికితేనే అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అతడు డ్రగ్స్ ఇతరులకు అమ్ముతున్నట్టు విచారణలో అదనపు ఆధారాలు లభిస్తేనే.. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద పెడ్లర్‌గా నేరారోపణ మోపే అధికారం ఉంటుంది. అలా కాకుండా డీలర్ల నుంచి డ్రగ్ కొనుగోలు చేసి తాను మాత్రమే వాడుతున్నట్టు తెలిస్తే.. అతడిని అరెస్ట్ చేసే అవకా శం లేదు. ఆ సమయంలో అతడు బాధితు డవుతాడు. అతడికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలివేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత... తాను డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కోర్టులో ఒప్పుకుంటూ డీ అడిక్షన్ సెంటర్‌కు వెళ్తానని స్వయంగా తెలిపితే బెయిల్ విషయంలో కూడా సడలింపులుంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.