breaking news
pattern
-
వాన మారితే... సాగూ మారాలి!
అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకేల శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.భారతీయ వ్యవసాయం తరతరాలుగా ఒక నమ్మకంపై నడిచింది. అదేమిటంటే ‘కాలం వస్తే వాన వస్తుంది, వాన వస్తే విత్తనం పడుతుంది’. ఇప్పుడు ఆ నమ్మకమే మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యంగా రావటం, వానల మధ్య విరామం పెరగటం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవటం తరచుగా కనిపిస్తున్నాయి. ఎల్‌నినో వంటి పరిస్థితులు ఈ అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ‘ఎంత వర్షం పడుతుంది?’ అన్నది మాత్రమే కాదు. ‘వర్షం మనం ఊహించినట్లు పడకపోతే మన వ్యవసాయం ఎలా స్పందించాలి?’ అన్నదే కీలకం.ఈ ఏడాది పరిస్థితులు ఒక హెచ్చరికను సూచిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 12 మధ్య కాలానికి సంబంధించిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఏఆర్ఐ) కరువు అంచనా ప్రకారం దేశంలోని సుమారు 64 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’ ఏదో ఒక స్థాయి కరువులో ఉంది. అయితే, అందులో ఎక్కువ భాగం ‘స్వల్ప కరువు’ కేటగిరీలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సుమారు 88 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’లో కరువు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 21 శాతం మాత్రమే. అంటే రాష్ట్రంలో 88 శాతం పంట నష్టపోయిందని కాదు; ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పే హెచ్చరిక ఇది.జిల్లాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. బాపట్ల జిల్లాలో 9.9 శాతం, కాకినాడలో 4.6 శాతం, కృష్ణా జిల్లాలో 3.8 శాతం ప్రాంతం తీవ్ర కరువు నెలకొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లోనూ ఇటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంది. ఖమ్మంలో స్వల్ప విస్తీర్ణం తీవ్ర కరువులో ఉంది. సూర్యాపేట, ములుగు, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌లో తీవ్రమైన కరువు జాడలు నమోదయ్యాయి. మేడ్చల్–మల్కాజిగిరిలో 10.9 శాతం ప్రాంతం ఒక మోస్తరు కరువు కేటగిరీలో ఉంది. నారాయణపేటలో 30.5 శాతం, మెదక్‌లో 26.7 శాతం, కామారెడ్డిలో 22.7 శాతం, నిజామాబాద్‌లో 21.6 శాతం విస్తీర్ణం స్వల్ప కరువులో ఉంది.2 నుంచి 6–7 వారాల ఆలస్యం అంటే ఎల్‌నినోను ఎదుర్కొనే విధానం రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత స్థాయి ముందస్తు సంసిద్ధత అవసరమైతే, తెలంగాణకు హాట్‌స్పాట్ ఆధారిత చర్యలు అవసరం. కృషి విజ్ఞాన కేంద్రాల క్షేత్రస్థాయి అనుభవం మరో ముఖ్యమైన విషయం చెబుతోంది. అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.మొదటి మార్పు పంట ఎంపికలో రావాలి. వర్షం ఆలస్యమైతే ముందుగా అనుకున్న పంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయాలనే పట్టుదల ప్రమాదకరం. నేల, మిగిలిన పంటకాలం, అందుబాటులో ఉన్న నీటిని బట్టి కంది, పెసర, మినుము, ఉలవ, చిరుధాన్యాలు, ఆముదం వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. రెండోది స్వల్పకాలిక రకాలు. మూడు నాలుగు వారాలు ఆలస్యంగా విత్తిన రైతు దీర్ఘకాలిక రకాన్ని వేస్తే చివరి దశలో నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వరి, కంది, పెసర తదితర పంటల్లో తక్కువ కాలంలో కోతకు వచ్చే రకాలు అత్యంత కీలకం.మూడోది.. పడిన ప్రతి వాన చుక్కను ΄÷లంలోనే నిలబెట్టుకోవటం. నీటి కుంటలు, వాన నీటిని ఇంకించే గొడ్డు సాళ్లు, ఆచ్ఛాదన, బోదెలు–కాలువలు, అంతరకృషి, సబ్ సాయిలింగ్, డ్రిప్, స్ప్రింక్లర్, రక్షణాత్మక తడులు వంటి చర్యలు రెండు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు చూపుతున్నాయి.పచ్చిరొట్ట ఎరువులు, పంట అవశేషాలను నేలలో కలపటం, సమగ్ర పోషక యాజమాన్యం, అంతర పంటలు, జీవ ఎరువులు, ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ వంటి పద్ధతులు నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి.ఇకపై రైతుకు ‘కరవు రావచ్చు జాగ్రత్త’ అనే సాధారణ సందేశం సరిపోదు. ‘ఈ తేదీలోపు వర్షం వస్తే ఈ పంట; మరో పది రోజులు ఆలస్యమైతే ఈ రకం; ఇంకా ఆలస్యమైతే ఈ ప్రత్యామ్నాయ పంట’ అనే నిర్ణయాత్మక సలహాలు కావాలి. ఎల్‌నినోను మనం ఆపలేం. కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. ?వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్తు వ్యవసాయం నిలబడుతుంది. డా. షేక్ ఎన్. మీరాడైరెక్టర్, ఐసీఏఆర్–అటారీ,హైదరాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మీ నిద్రలోనే మీ ఆయుష్షు!
సాధారణంగా మనమంతా నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశగా భావిస్తాం. అయితే ఇదే అంశంపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక నూతన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఒక రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు.రక్త పరీక్షలు, ఎక్స్-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా అనిపించినప్పటికీ, శాస్త్రవేత్తలు తమ నవ్య ఆవిష్కరణలో దీనిని నిజం చేసి చూపారు. స్టాన్ఫోర్డ్ పరిశోధకులు తాజాగా ‘స్లీప్‌ఎఫ్‌ఎం’ (SleepFM) అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను, శ్వాస, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.‘స్లీప్‌ఎఫ్‌ఎం’నకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది. తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది.సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్‌ను రూపొందించారు. ఈ స్లీప్‌ఎఫ్‌ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులను 85 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే, ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75 శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.మన శరీరం లోపల వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చేవరకూ వైద్యుడిని సంప్రదించరు. అయితే స్లీప్‌ఎఫ్‌ఎం పరికరం అందుబాటులో ఉంటే, ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే గుర్తించి, అప్రమత్తం కావచ్చు. భవిష్యత్తులో మన స్మార్ట్‌వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు మన నిద్రను విశ్లేషించి.. ‘మీ ఆరోగ్యం సరిగా లేదు.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప విప్లవానికి నాంది కానుంది.ఇది కూడా చదవండి: ‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం.. -
ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో వస్తువులు బుక్ చేసేప్పుడు ‘మరో 10 నిమిషాల్లో ఈ ఆఫర్ ముగుస్తుంది’, ‘మీకు మాత్రమే ప్రత్యేకం’, ‘ఈ వస్తువులు ఇంకో 5 మాత్రమే మిగిలాయి’ అంటూ మీపై ఒత్తిడి పెంచే ప్రకటనలు రావడం గమనించారా.. అయితే ఇకపై ఇలాంటి ప్రకటనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను మోసగించేందుకు అనుసరిస్తున్న ‘డార్క్ ప్యాటర్న్స్’ (అనైతిక పద్ధతులు)కు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ అనైతిక పద్ధతులను తొలగించడానికి వీలుగా సెల్ఫ్ ఆడిట్ (స్వీయ తనిఖీ) చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది.తొలగింపునకు సిద్ధమైన 26 కంపెనీలుకేంద్ర ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడానికి దేశంలోని 26 ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్ వంటి అగ్రశ్రేణి కంపెనీలతో సహా పలు సంస్థలు ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్స్‌పై డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయా లేవా అని ఆడిట్ నిర్వహించినట్లు వెల్లడించాయి. ఆన్లైన్ వ్యాపారం చేసే అన్ని కంపెనీలు ఈ పద్ధతులను విధిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.డార్క్ ప్యాటర్న్స్ అంటే ఏంటి?కస్టమర్ల మనస్తత్వాలను వాడుకుని వారి ఇష్టానికి వ్యతిరేకంగా లేదా బలవంతంగా కొనుగోళ్లు, సబ్స్క్రిప్షన్లు లేదా డేటా షేరింగ్‌ను చేయించేలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగించే మోసపూరితమైన డిజైన్ పద్ధతులనే డార్క్ ప్యాటర్న్స్ అంటారు.వినియోగదారులకు తెలియకుండానే లేదా వారు సులభంగా క్యాన్సిల్ చేయలేని విధంగా సబ్స్క్రిప్షన్ ప్యాకేజీల్లో ఇరికిస్తారు.‘మరో 10 నిమిషాల్లో ఈ ఆఫర్ ముగుస్తుంది’, ‘మీకు మాత్రమే ప్రత్యేకం’, ‘ఈ వస్తువులు ఇంకో 5 మాత్రమే మిగిలాయి’ అంటూ ఒత్తిడి పెంచి తప్పుడు ప్రకటనలతో కొనుగోలుకు ప్రేరేపిస్తారు.కస్టమర్లు సులభంగా అర్థం చేసుకోలేని సాంకేతిక పదజాలం లేదా నిబంధనలను ఉపయోగించి వారికి తెలియకుండానే కొన్ని అంశాలకు అంగీకరించేలా చేస్తారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ అనైతిక పద్ధతులకు పాల్పడినట్లు తేలితే లేదా వినియోగదారులను మోసగించే చర్యలకు పాల్పడినట్లు రుజువైతే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గట్టిగా హెచ్చరించింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారుల హక్కుల రక్షణలో కీలకమైన ముందడుగుగా చెప్పవచ్చు. ఆన్లైన్ షాపింగ్ పెరిగిన నేపథ్యంలో కమీషన్ల కోసం, ఎక్కువ లాభాల కోసం ఈ-కామర్స్ కంపెనీలు అనుసరించే డార్క్ ప్యాటర్న్స్ కారణంగా మధ్యతరగతి వినియోగదారులు చాలా వరకు నష్టపోతున్నారు. ఈ కొత్త నిబంధనల అమలు, సెల్ఫ్ ఆడిట్ ద్వారా ప్లాట్ఫామ్ల్లో పారదర్శకత పెరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్ వంటి పెద్ద కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఈ నిబంధనల విజయానికి సానుకూల సంకేతంగా ఉంది. భవిష్యత్తులో సీసీపీఏ ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని యూజర్లు కోరుతున్నారు.ఇదీ చదవండి: రైల్వేకు ఐఆర్సీటీసీ కాసుల వర్షం.. ఎలాగంటే.. -
స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి
న్యూఢిల్లీ: వినియోగదారులను నష్టపర్చేలా పలు ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్ ’డార్క్ ప్యాటర్న్’ పద్ధతులు పాటిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకోవాలని సంస్థలను ఆదేశించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగీ, జొమాటో తదితర ఈ–కామర్స్ సంస్థలతో భేటీ అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన తగు వ్యవస్థ ఏర్పాటు కాగలదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్లో వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా మోసం చేసే విధానాలను డార్క్ ప్యాటర్న్లుగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు యూజరు ఎంచుకోకపోయినా షాపింగ్ బాస్కెట్లో కొన్ని ఐటమ్‌లను జోడించేయడం, చెక్ అవుట్ చేసే సమయంలో ఉత్పత్తుల ధరలను మార్చేయడం, తక్షణం కొనుగోలు చేయకపోతే నష్టపోతామేమో అనే తప్పుడు భావన కలిగేలా తొందరపెట్టడంలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. మధ్యవర్తులు అమ్మకాలను పెంచుకునేందుకు లేదా అమ్ముకునేందుకు అమలు చేసే మోసపూరిత విధానాల గురించి ఈ–కామర్స్ సైట్లను వాడే వినియోగదారులకు, విక్రేతలకు పెద్దగా తెలియదని సింగ్ చెప్పారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ అవగాహన కల్పించి, స్వీయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇలాంటి పద్ధతులు కొనసాగితే ఈ విషయంలో నిబంధనలను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. -
పది పాసవడం.. ఇక ఈజీ!
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి చదివే విద్యార్థులకు శుభవార్త. ఇక మీరంతా పదోతరగతి పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే పాస్ మార్కులకు సంబంధించిన నిబంధనలను సవరించి, ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్ఈ) త్వరలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తంగా 33 శాతం వస్తే చాలు.. ప్రస్తుతం సీబీఎస్ఈ విద్యావిధానంలో పదో తరగతిలో ఓ విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే ఇంటర్నల్స్‌లో 33 శాతం, థియరీ పరీక్షల్లో 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనను సవరించి, ఇంటర్నల్స్, థియరీలో కలిపి 33 శాతం మార్కులు వస్తే చాలు. అంటే థియరీలో 33 శాతంకంటే తక్కువగా వచ్చి, ఇంటర్నల్స్‌లో 33 శాతం కంటే ఎక్కువ వచ్చినా.. మొత్తంగా 33 శాతం దాటితే ఉత్తీర్ణులైనట్లే. రెండింటిలో 33 శాతం మార్కులు రావాలనే నిబంధన నుంచి మినహాయింపును ఇవ్వాలని సీబీఎస్ఈ యోచిస్తున్నట్లు సమాచారం. మీ అభిప్రాయమేంటో చెప్పండి.. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్క్యూలర్‌ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలకు బోర్డు జారీచేసింది. 33 శాతం నిబంధనను సవరించడంపై అభిప్రాయమేంటో చెప్పాలని ఆయా పాఠశాలలను సీబీఎస్ఈ కోరింది. వాటి నుంచి సమాధానం వచ్చిన వెంటనే ఈ వారంలోనే సమావేశమై, దీనిపై అధికారిక ప్రకటన జారీ చేయాలని భావిస్తోంది. 2011 నుంచి సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలను ఆప్షన్ (ఐచ్చికం)గా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ 7 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలను కచ్చితం చేశాయి. దీంట్లో భాగంగానే పరీక్ష విధానాల్లో ఈ మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు... వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ సూచనప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కార్యాచరణను బోర్డు అధికారులు వేగవంతం చేశారు. 10, 12 తరగతుల పరీక్షలకు ముందు జరిగే ‘స్టూడెంట్ యాక్టివిటీస్’ను వీలైనంత త్వరగా అందజేయాలని ఆయా విద్యా సంస్థలు, పాఠశాలలకు సీబీఎస్ఈ అధికారులు లేఖలు పంపారు. దీన్ని బట్టి ఏటా జరిగే తేదీలకంటే ముందుగానే బోర్డు పరీక్షలు ఉండవచ్చని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థుల వివరాలు ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఆయా వివరాలను cbse.nic.inలో నమోదు చేయాలని సూచించింది. -
చంద్రబాబు తీరుతోనే ‘హోదా’ పట్ల నిర్లక్ష్యం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు తీరుతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల నిర్మాణాల నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోవాలని చంద్రబాబు, కేసీఆర్‌లకు హితవు పలికారు. కృష్ణా నీటి పంపిణీపై బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల ఆధారంగా ఇరు రాష్ట్రాలలోని పాలమూరు ప్రాంతం, రాయలసీమ,ప్రకాశం జిల్లా నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చర్చించి పరిష్కరించుకోవాలన్నారు.చర్చల ద్వారా నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంలను రామకృష్ణ కోరారు. -
యూపీఎస్సీ పరీక్ష విధానం మార్చాలి
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్ష పద్ధతిలో మార్పు లు చేయాలని వందలాది మంది సివిల్ సర్వీసెస్ ఔత్సాహిక అభ్యర్థులు రోడ్డెక్కారు. పార్లమెంట్ హౌస్ సమీపంలో సోమవారం ఆందోళనకు దిగా రు. యూపీఎస్సీ సిలబస్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది తప్పించిన కొన్ని సబ్జెక్ట్‌లను తిరిగి చేర్చాలన్నారు. పోలీసులు ఎంతగా నచ్చచెప్పినప్పటికీ అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడంతో జల ఫిరంగులను ప్రయోగించారు. ‘పరీక్ష పద్ధతిలో పక్షపాతంతో వ్యవహరిస్తోంది. దీన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంద’ని ఓ విద్యార్థి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.


