breaking news
parents gifted
-
రూ.3 కోట్ల బెంట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పేరెంట్స్.. తుపాకీతో కొడుకు హల్చల్!
చండీగఢ్: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్‌గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్ ప్రాంతానికి చెందిన శుభమ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్ లైసెన్స్ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్ జర్నల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్ చేయటం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ గన్‌తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి. #Punjab: Elated after being gifted a Bentley car from his parents, Mohali youth opens fires in the air; booked after video went viral on social media.#Viral #bentley #Car #Gift #Boy #Mohali #India #ViralVideo #fire pic.twitter.com/wjGAFkJEVo — Free Press Journal (@fpjindia) October 18, 2022 ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు! -
డజను మంది అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుని..
తమ పొరుగింట్లో ఏదో జరుగుతోందని జెన్ బెట్జ్ అనే మహిళకు పదే పదే అనుమానం వచ్చేది. అదే విషయాన్ని చివరకు ఆమె పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. తీరా పోలీసులు అక్కడికొచ్చి చూస్తే, ఆ ఇంట్లో దాదాపు డజను మందికి పైగా చిన్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో నిండా 18 ఏళ్లు కూడా లేని అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు!! ఇదంతా ఇంగ్లండ్ లోని పెన్సల్వేనియా ప్రాంతంలో జరిగింది. లీ కప్లాన్ (51) అనే వ్యక్తి వీళ్లందరినీ తన అదుపులో పెట్టుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తేలింది. వాళ్లలో తల్లి అయిన అమ్మాయి తల్లిదండ్రులను పోలీసులు విచారించగా, తమ కుటుంబం దివాలా తీయకుండా సాయం చేసినందుకు గాను తామే కూతురిని అతడికి ‘బహుమతి’గా ఇచ్చామని చెప్పారట. 14 ఏళ్ల వయసులోనే ఆమె తొలిసారి గర్భం దాల్చింది. ఈ వ ఇషయం తెలిసిన పోలీసులు ఆమె తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పెన్సల్వేనియాలోని కప్లన్ ఇంట్లో 18 ఏళ్ల అమ్మాయి, ఆమె ఇద్దరు పిల్లలతో పాటు 12 మంది అమ్మాయిలు కనిపించారు. కప్లన్ ఇంట్లోని బేస్ మెంటులో వీళ్లంతా ఉంటున్నారు. గాలి పరుపులపై పడుకుంటున్నారు. అదే ఇంట్లో ఒక ట్యాంకులో క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. అలాగే గ్రీన్ హౌస్ లో అవకాడో చెట్లను కూడా పెంచుతున్నారు. వాళ్లందరికీ సంగీతం పాఠాలు చెబుతున్నట్లు కూడా అక్కడ ఆధారాలు లభించాయి. ఆ ఇంట్లో అమ్మాయిలు ఎప్పుడూ భయం భయంగా కనిపించేవారని, అసలు బయటకు కూడా వచ్చేవాళ్లు కారని జెన్ బెట్జ్ తెలిపారు.