డజను మంది అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుని.. | man keeps 12 girls in home, including one gifted by parents | Sakshi
Sakshi News home page

డజను మంది అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుని..

Jun 21 2016 10:38 AM | Updated on Sep 4 2017 3:02 AM

డజను మంది అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుని..

డజను మంది అమ్మాయిలను ఇంట్లో పెట్టుకుని..

ఆ ఇంట్లో దాదాపు డజను మందికి పైగా చిన్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో నిండా 18 ఏళ్లు కూడా లేని అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు!!

తమ పొరుగింట్లో ఏదో జరుగుతోందని జెన్ బెట్జ్ అనే మహిళకు పదే పదే అనుమానం వచ్చేది. అదే విషయాన్ని చివరకు ఆమె పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. తీరా పోలీసులు అక్కడికొచ్చి చూస్తే, ఆ ఇంట్లో దాదాపు డజను మందికి పైగా చిన్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో నిండా 18 ఏళ్లు కూడా లేని అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు!! ఇదంతా ఇంగ్లండ్ లోని పెన్సల్వేనియా ప్రాంతంలో జరిగింది. లీ కప్లాన్ (51) అనే వ్యక్తి వీళ్లందరినీ తన అదుపులో పెట్టుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు తేలింది.

వాళ్లలో తల్లి అయిన అమ్మాయి తల్లిదండ్రులను పోలీసులు విచారించగా, తమ కుటుంబం దివాలా తీయకుండా సాయం చేసినందుకు గాను తామే కూతురిని అతడికి ‘బహుమతి’గా ఇచ్చామని చెప్పారట. 14 ఏళ్ల వయసులోనే ఆమె తొలిసారి గర్భం దాల్చింది. ఈ వ ఇషయం తెలిసిన పోలీసులు ఆమె తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. పెన్సల్వేనియాలోని కప్లన్ ఇంట్లో 18 ఏళ్ల అమ్మాయి, ఆమె ఇద్దరు పిల్లలతో పాటు 12 మంది అమ్మాయిలు కనిపించారు. కప్లన్ ఇంట్లోని బేస్ మెంటులో వీళ్లంతా ఉంటున్నారు. గాలి పరుపులపై పడుకుంటున్నారు. అదే ఇంట్లో ఒక ట్యాంకులో క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. అలాగే గ్రీన్‌ హౌస్ లో అవకాడో చెట్లను కూడా పెంచుతున్నారు. వాళ్లందరికీ సంగీతం పాఠాలు చెబుతున్నట్లు కూడా అక్కడ ఆధారాలు లభించాయి. ఆ ఇంట్లో అమ్మాయిలు ఎప్పుడూ భయం భయంగా కనిపించేవారని, అసలు బయటకు కూడా వచ్చేవాళ్లు కారని జెన్ బెట్జ్ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement