-
– 53 డిగ్రీల సెల్సియస్, గడ్డకట్టే చలిలో పరుగు, ఎందుకిదంతా అని ఆశ్చర్యపోతున్నారా?
Worlds Coldest Marathon At Yakutia: చూశారుగా... కనురెప్పలు సహా మొహాన్ని మంచు కప్పేసినా, గడ్డకట్టే చలి తీవ్రతకు నోట్లోని లాలాజలం సూదిలా పెదవులను గుచ్చుతున్నా లెక్కచేయకుండా ఓ యువకుడు లక్ష్యం వైపు సాగిపోతున్న దృశ్యమిది. మంచులో ఈ పరుగేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అలాంటి, ఇలాంటి పరుగు పందెం కాదండి. రష్యాలోని సైబీరియాలో ఉన్న ఓమ్యకోన్లో ఇటీవల జరిగిన మంచు మారథాన్ అన్నమాట. అదేనండి 42.19 కి.మీ. ఆగకుండా పరుగెత్తి గమ్యం చేరుకోవడం. ఆ ఏముందిలే.. ఒళ్లంతా వెచ్చని దుస్తులు కప్పుకొని పరిగెత్తడమూ ఓ విశేషమేనా అని అనుకుంటున్నారా? విశేషమే మరి.ఈ పోటీ జరిగిన సమయంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా? ఏకంగా మైనస్ 53 డిగ్రీల సెల్సియస్. ఇంత చల్లటి ఉష్ణోగ్రతల్లో జరిగిన పోటీ కాబట్టే ‘వరల్డ్స్ కోల్డెస్ట్ మారథాన్’గా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఈ పోటీలో అమెరికా, రష్యా, యూఈఏ, బెలారస్‌కు చెందిన 65 మంది పరుగువీరులు అత్యంత ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొన్నారు. సుమారు 100 మంది స్థానికులు ఈ పోటీని చూసేందుకు, పోటీదారులను ఉత్సాహపరిచేందుకు వచ్చారు! పురుషుల విభాగంలో రష్యాకు చెందిన వ్యాసిలీ ల్యూకిన్ 3 గంటల 22 నిమిషాల్లో ఈ మారథాన్‌ను పూర్తి చేయగా మహిళల విభాగంలో సైబీరియా ప్రాంతానికి చెందిన మెరీనా సెడలిస్చెవా 4 గంటల 9 నిమిష్యాల్లో గమ్యం చేరుకుంది. చదవండి: ఆ వ్యక్తి ఏడు నిమిషాలకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు!.. ఎలాగో తెలుసా? ఏటా దాదాపు 10 నెలలు మంచు దుప్పటిలో ఉండే ఓమ్యకాన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎంతలా ఉంటుందంటే అక్కడ ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజుల తరబడి పెద్దపెద్ద మంటలు వేయాల్సి ఉంటుందట! అంతటి ప్రతికూల వాతావరణంలో ఎందుకు పరుగులు పెట్టడం? అని పోటీదారులను అడిగితే ‘గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు.. స్టేడియంలో కొట్టే వాడికే ఓ రేంజ్ ఉంటుంది’ అనే తరహాలో బదులిచ్చారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
శ్వాస సిగరెట్ పొగలా వచ్చేదట..!
సాక్షి, వెబ్ డెస్క్ : చలి చలిగా అల్లింది.. గిలి గిలిగా గిల్లింది... జనవరి మాసం అరె మంచు కురిసే సమయం... ఇలా చలి గురించి మనకు ఎన్నో పాటలున్నాయి. పాటలు పాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ, నిజంగా అంతటి చలిలో ఉంటే ఎలా ఉంటుంది?. రష్యాలోని ఓమియాకాన్ భూమ్మీద అత్యంత శీతల ప్రాంతం. అత్యంత శీతలంగా ఉండే ఈ ప్రాంతంలో వేడి నీటి కుంటలు ఉన్నాయి. ఓమియాకాన్ అంటే ‘గడ్డ కట్టని నీరు’ అని అర్థం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వేడి నీటి కుంటల కారణంగానే ఓమియాకాన్ అభివృద్ధిపై రష్యాను దృష్టి సారించేలా చేసింది. రెయిన్ డీర్లకు నీటిని అందించేందుకు ఓమియాకాన్‌లో నివాసం ఉండే 50 మంది కుంటలను వినియోగిస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడి ఉష్ణోగ్రతలు దాదాపు -50 డిగ్రీలకు పడిపోతాయి. ఆ సమయంలో వెచ్చదనం కోసం కర్ర, బొగ్గులను మండించి చలి కాచుకుంటారు ఓమియాకాన్ వాసులు. సముద్రమట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉన్న ఓమియాకాన్‌లో డిసెంబర్ నెల నుంచి వేసవి వరకూ పగటి పూట సమయాల్లో విపరీతమైన మార్పులు ఉంటాయి. ఒక్కోరోజు కేవలం మూడు గంటలు మాత్రమే పగటి సమయం ఉంటుంది. ఒక్కోసారి పగటి సమయం అత్యధికంగా 21 గంటలు వరకూ ఉంటుంది. ఓమియాకాన్‌లో కేవలం ఒకే ఒక దుకాణం, పాఠశాల ఉన్నాయి. -52 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటే వాటిని మూసేస్తారు. అలాంటి ప్రదేశంలో అడ్వెంచర్ ఫోటోగ్రాఫర్ అమోస్ చాపెల్ అక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఐదు వారాల పాటు ఓమియాకాన్‌లో పర్యటించిన చాపెల్ చలి తన కాళ్లను పట్టుకున్నట్లు, నోట్లోని లాలాజలం గడ్డ కట్టి, పెదవులని గుచ్చుతున్నట్లు అనిపించిందని చెప్పారు. శ్వాస తీసుకుని వదులుతుంటే అది పొగలా కనిపించేదని తెలిపారు. ఫొటోలను తీసే సమయంలో శ్వాసను బిగబట్టినట్లు చెప్పారు. ఓమియాకాన్ వాసులు నీటిలోకి వెళ్లడానికి భయపడతారని తెలిపారు. అలాంటిది చైనా యాత్రికులు అక్కడి నీటిలో ఈత కొట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అనస్థేసియా అనే అమ్మాయి స్నేహితులతో కలసి ఓమియాకాన్ను సందర్శించిన సమయంలో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. అనస్థేసియా సోషల్‌మీడియాలో పోస్టు చేసిన ఫొటోల్లో వారి కనుబొమ్మలు కూడా మంచు తీవ్రతకు గడ్డకట్టుకుపోయాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement