-
26 ఓవర్ల ఆట మాత్రమే...
విజయనగరం: ఆంధ్ర, ముంబై జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం, వెలుతురు లేమితో అంతరాయం కలిగింది. శుక్రవారం కేవలం 26 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 170/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర రెండో ఆట ముగిసే సరికి 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. సెంచరీ పూర్తి చేసుకున్న రికీ భుయ్ (103)తో పాటు ప్రదీప్ (0) వెనుదిరగ్గా...కెప్టెన్ కైఫ్ (311 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. హైదరాబాద్ 325/9 డిక్లేర్డ్: మరో వైపు గోవాలో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు మెహదీ హసన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేదు. అనంతరం గోవా వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది. -
నమన్ ఓజా డబుల్ సెంచరీ
భారత్ ‘ఎ' 475/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ' 126/6 బ్రిస్బేన్: నమన్ ఓజా (250 బంతుల్లో 219 నాటౌట్; 29 ఫోర్లు, 8 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో పాటు బౌలర్లు నిలకడగా రాణించడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ' పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం భారత్ ‘ఎ' తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఫిల్ హ్యూస్ (34)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ మరో 349 పరుగులు వెనుకబడి ఉంది. ఓజా దూకుడు... ఓవర్‌నైట్ స్కోరు 304/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌ను ఓజా నడిపించాడు. సోమవారం భారత్ స్కోరుకు మరో 171 పరుగులు చేరితే... అందులో ఓజా ఒక్కడే 137 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆసాంతం భారీ షాట్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ సెంచరీ, డబుల్ సెంచరీలను సిక్సర్లతోనే పూర్తి చేసుకోవడం విశేషం.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్‌స్టర్‌తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్‌లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- స్వాతిమలివాల్‌పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్‌లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement