-
Rahul Gandhi OU Visit: ఓయూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యూఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్‌గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు అక్కడ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వబోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళనలకు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది. సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు -
‘ఓయూకు వెళ్లలేని స్థితిలో కేసీఆర్’
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై తెలంగాణ సీఎం కేసీఆర్ కక్ష కట్టిన్నట్లు కనిపిస్తుందని కాంగ్రెస్ నేత, శాసనసభ మాజీ విప్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఓయూలో ఎవరు మీటింగ్ పెట్టొద్దనే జీవో తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఓయూకు వెళ్తే రాళ్లు, చెప్పులు పడుతాయన్నారు. ఉస్మానియా విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని, అలాంటి యూనివర్సిటీపై ఆంక్షలు పెట్టడం దుర్మార్గమన్నారు. ఉస్మానియాలో రాహుల్ గాంధీతో సభ పెడతానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ నడిబొడ్డున ఉన్న యూనివర్సిటీకి వెళ్లలేని కేసీఆర్ ఒక ముఖ్యమంత్రేనా అని ప్రశ్నించారు. ఉత్తమ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో సభ పెట్టి తీరుతామన్నారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో కేసీఆర్‌కి విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవోని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్‌కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
Advertisement