breaking news
Operation 2019
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు రూ. 50 వేలు అడ్వాన్స్ : గుర్తు పట్టకూడదని గుండు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను తెలిపారు.గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ అతనిపై దాడికి పథకం పన్నాడని, ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులకు కలిపి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్టుగా దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అంతేకాదు అపరేషన్ విజయవంతంగా ముగిసిన తర్వాత మరింత డబ్బు ఇస్తామని వాగ్దానం చేశారని, విదేశాలకు పంపిస్తామని కూడా నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఈ ఆఫర్లతో అతడిని నేరానికి ప్రలోభ పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించామని వివరించారు.ఆపరేషన్ పూర్తయిందిటైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన అనంతరం నిందితులు తమ హ్యాండ్లర్లకు "ఆపరేషన్ పూర్తయింది" అంటూ సమాచారం అందించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఈ దాడికి ముందు నిందితులు ఫుట్‌బాల్ గ్రౌండ్లో టైగర్ ష్రాఫ్ ఆడుతున్న వీడియోను సుపారీ గ్యాంగ్‌కు పంపారు. ఆ తర్వాతే వారు కాల్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. గుండు కొట్టించుకున్నాడునిందితుడు హృతిక్ కుమార్ అలియాస్ రోషన్, తనను ఎవరు గుర్తు పట్టకుండా ఉండడానికి పట్టుబడకుండా తప్పించుకోవడానికి, గుండు చేయించు కున్నాడు. అద్దె ఇంటిని పదేపదే మార్చుకోవడం వరకు అనేక ప్రయత్నాలు చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి దాదాపు రెండు నెలల ముందే తన రూపాన్ని మార్చుకోవడం ప్రారంభించాడన్నారు.ఈ ఘటనకు సంబంధించి బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన హ్రితిక్ అలియాస్ రోషన్ (22), హర్యానాకు చెందిన రెహాన్ (18), ఫూల్ సింగ్ (18) అనే ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే టైగర్ ష్రాఫ్ పై దాడి జరిగిన ఘటనా స్థలం నుంచి ఐదు ఖాళీ తూటాలు, రెండు లైవ్ కార్ట్రిడ్జ్లను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, బట్టలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నారు.ఇదీ చదవండి: హాట్ టాపిక్ : ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై టీవీకే స్పందనలారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లింక్స్‌పై ఆరా ఈ కుట్ర వెనుక జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు అనిల్ పండిట్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి తర్వాత సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారు ఎవరైనా సరే లక్ష్యంగా చేసుకుంటామనే బెదిరింపులతో అనిల్ పండిట్, హర్మాన్ సంధూ పేర్లతో సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే, పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇదీ చదవండి: నర్సు దారుణ హత్య : సీఎం విజయ్‌పై స్టాలిన్ మండిపాటు -
రివ్యూల వల్ల అసంతృప్తి ఉంది
‘‘ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకి అనుగుణంగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ఈ మధ్యకాలంలో నేను నటించిన చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రమిది. మా సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని శ్రీకాంత్ అన్నారు. శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ ముఖ్య తారలుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పణలో టి. అలివేలు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత, బయ్యర్లు అందరూ సేఫ్. కానీ కొన్ని రివ్యూస్ వల్ల మాకు కొంచెం అసంతృప్తిగా ఉంది. మేము వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. కానీ, ఒక రివ్యూ రాసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ప్రొడ్యూసర్ చాలా కష్టపడి చిత్రాన్ని నిర్మిస్తాడు. ఎంతోమంది టెక్నీషియన్లకి పని దొరుకుతుంది. కేవలం రేటింగ్స్ చూసి సినిమాకి వెళ్లేవారు చాలా మంది ఉంటారు. ఒక సక్సెస్ వస్తే ఇండస్ట్రీలో చాలా మంది టెక్నీషియన్లకి పని దొరికినట్లేనని గుర్తించాలి’’ అన్నారు. ‘‘ఓ డైరెక్టర్‌గా ఫీల్ అయి ఈ సినిమా తీయ లేదు.. డబ్బుల కోసం కూడా కాదు.. ఓ బాధ్యత గల పౌరుడిగా తీశా. ప్రేక్షకుల ఆదరణ చాలా బావుంది’’ అన్నారు కరణం బాబ్జీ’. ‘‘ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే మంచి కథాంశంతో వచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు అలివేలు. నటుడు శివకృష్ణ పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆపరేషన్ 2019 జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : శ్రీకాంత్, దీక్షా పంత్, యగ్న శెట్టి, పోసాని కృష్ణమురళి సంగీతం : రాప్ రాక్ షకీల్ దర్శకత్వం : కరణం బాబ్జీ నిర్మాత : అలివేలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కనిపిస్తున్న వేళ సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆపరేషన్ 2019. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆపరేషన్ దుర్యోధన తరహాలో బోల్డ్‌గా తెరకెక్కించారు. కొంత కాలంగా సరైన హిట్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలనుకుంటున్నారు. మరి తెలంగాణ ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆపరేషన్ 2019 ఏ మేరకు ఆకట్టుకుంది..? కథ ; నిరుపేద కుటుంబంలో పుట్టిన ఉమాశంకర్ (శ్రీకాంత్) ఊరి ప్రజల సహకారంతో ఉన్నత చదువులు చదివి ఫారిన్లో సెటిల్ అవుతాడు. చిన్నతనంలో ఊరి ప్రెసిడెంట్.. వీలైనంతలో నీ ఊరికో దేశానికో ఉపయోగపడాలని చెప్పిన మాటలు ఉమాశంకర్‌ను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తుంది. తమ ప్రాంతంలోని రైతులు అప్పులు తీర్చలేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయలను వారికోసం ఆ ప్రాంత ఎమ్మెల్యేకు పంపిస్తాడు. కానీ ఎమ్మెల్యే ఆ డబ్బును రైతులకు అందించకపోవటంతో రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఈ విషయం తెలిసి చలించిపోయిన ఉమాశంకర్ ఇండియా వచ్చి ఆ ఎమ్మెల్యేను ఎదిరిస్తాడు. ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు తన తరుపున నారాయణ మూర్తి(శివకృష్ణ) అనే సామాజిక వేత్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలక్షన్లలో నిలబెడతాడు. కానీ కులం, మతం పేరుతో ప్రజలు అధికార పార్టీ నాయకుడికే పట్టం కడతారు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మారాల్సింది నాయకులు కాదు ప్రజలు అని భావించిన ఉమాశంకర్ ఏం చేశాడు..? ప్రజలకు, నాయకులకు ఎలా కనువిప్పు కలిగించాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : సినిమా అంతా శ్రీకాంత్ ఒక్కడి చుట్టూనే తిరుగుతుంది. మంచివాడిగా, మూర్ఖుడైన రాజకీయనాయకుడిగా రెండు కోణాల్లోనూ శ్రీకాంత్ నటన బాగుంది. దీక్షాపంత్, శివకృష్ణ, పోసాని కృష్ణమురళి, నాగినీడు తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఎవరికీ పెద్దగా స్క్రీన్‌టైం దక్కలేదు. ఇక మంచు మనోజ్, సునీల్‌లు పెద్దగా ప్రాధాన్యం లేని అతిథి పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ : ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు కరణం బాబ్జీ మంచి కథను రెడీ చేసుకున్నాడు. ఎన్నికల సమయంలో పరిస్థితులు, గెలిచిన నేతలు పార్టీలు మారటం, అమ్ముడుపోవటం, క్యాంప్ రాజకీయాలు లాంటి అంశాలతో కథ తయారు చేసుకున్నా.. ఆసక్తికరంగా తెరకెక్కించటంలో కాస్త తడబడ్డాడు. కేవలం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి స్వయంగా అన్ని పర్మిషన్లు ఇచ్చేయటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ద్వితీయార్థంలో కథనం కాస్త వేగం అందుకుంటుంది. రాజకీయ వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు ఆకట్టుకున్నా.. ప్రతినాయక పాత్రలు బలంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. షకీల్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; శ్రీకాంత్ సెకండ్‌హాఫ్‌లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ స్క్రీన్‌ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్.


