breaking news
One Battle After Another
-
అనుబంధాలకే ఆస్కారం
ఎన్ని గ్రాఫిక్స్ వచ్చినా, ఎన్ని ఏఐ విప్లవాలు వచ్చినా, ‘ఈ జనరేషన్ కథ’ అనుకోవడానికి ఎన్ని ఫీట్లు చేసినా... గత, వర్తమాన, భవిష్యత్‌లలో తిరుగులేని కాలాతీత కథా వస్తువు... కుటుంబం, అనుబంధాలు, త్యాగాలు... మొదలైనవి. ‘నాది పాత స్కూలు’ అని చెబుతుంటారు డైరెక్టర్ పాల్ థామస్ ఆండర్సన్. సెంటిమెంట్, భావోద్వేగాలు అనే ఆ పాత స్కూల్ సబ్జెక్ట్‌తోనే ఆస్కార్ బరిలో సంచలనం సృష్టించారు. అతడి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆరు ఆస్కార్ అవార్డులు గెల్చుకుంది. ఈ ఏడాది ‘ఉత్తమ చిత్రం’గా ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంటోంది...‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అనే ప్రసిద్ధ మాట ఉన్నప్పటికీ... ఆర్థికం ఒక్కటే కాదు అనేకానేక సంబంధాలు అనుబంధాలను నిర్ణయిస్తాయి అని చెప్పుకోవడానికి ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ను ఉదాహరణగా చెపొ్చచ్చు. ‘సాగర సంగమం’ సినిమాలో పితృ సమానుడైన బాలు (కమల్ హాసన్)ను శైలు అకారణంగా ద్వేషిస్తుంటే ‘అయ్యో!’ అనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్లు తెరుచుకొని ‘మాతృదేవోభవ పితృదేవోభవ’ అని పాడుతుంటే ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. అలాంటి బలమైన భావోద్వేగాలు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో చాలా ఉన్నాయి.ఇదీ కథ...విప్లవ సంస్థ ‘ఫ్రెంచ్ 75’లో సభ్యులైన ΄్యాట్ కల్వాన్ (లియోనార్డో డికాప్రియో), పెర్పిడియో బెవర్లీ హిల్స్ (టెయన్ టేలర్) ప్రేమికులు. ఒక డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించబడిన వలసదారులను బయటకు తీసుకువచ్చే క్రమంలో కమాండింగ్ ఆఫీసర్ స్టీవెన్‌ను అవమానిస్తుంది పెర్పిడియో. దీంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు స్టీవెన్. ఒక కేసులో పెర్పిడియోను అరెస్ట్ చేసిన స్టీవెన్, తన కోరిక తీర్చితే వదిలేస్తానని చెబుతాడు. అతడి డిమాండ్‌కు ఆమె అంగీకరించడంతో వదిలేస్తాడు.పెర్పిడియా ‘చార్లీన్’ అనే బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తరువాత విప్లవ కార్యకలాపాలు కొనసాగించడానికి అజ్ఞాతంలోకి వెళుతుంది. బ్యాంకు దోపిడి సమయంలో సెక్యూరిటీ గార్డ్‌ను హత్య చేసినందుకు పెర్పిడియో అరెస్ట్ అవుతుంది. స్టీవెన్ ఆమెను జైలు నుంచి తప్పించుకునేలా చేస్తాడు. అయితే ఇది ఆమె మీద ప్రేమతో చేసింది కాదు. ‘ఫ్రెంచ్ 75’ సభ్యుల సమాచారాన్ని తెలుసుకోవాలనే కుట్రతో చేస్తాడు.పెర్పిడియో ఇచ్చిన సమాచారంతో ఆమె సహచరులను వెంటాడి, ఉరి తీస్తాడు. పదహారేళ్ల తరువాత.... చార్లీన్కు తానే తండ్రి అని తెలుసుకున్న స్టీవెన్ ఆమెను చంపేందుకు కుట్రలు చేస్తాడు. ఇన్నాళ్లు చార్లీన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ΄్యాట్ ఎలా స్పందించాడనేది కథ. తనను వదిలేసి వెళ్లిపోయిన తల్లిపై చార్లీన్కు కోపం, పెంపుడు తండ్రి (΄్యాట్)పై అనుమానం. ΄్యాట్ ఆమె నమ్మకాన్ని ఎలా గెలుచుకున్నాడనేది అసలు సిసలు కథ.వైన్‌ల్యాండ్ స్ఫూర్తితో...‘వైన్‌ల్యాండ్’ నవలను స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ పాల్ థామస్ ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ తీశారు. థామస్ పిన్చాన్ 1990లో రాసిన పోస్ట్ మోడర్న్ నవల... వైన్‌ల్యాండ్. అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ రీగన్ తిరిగి ఎన్నికైన సంవత్సరం నేపథ్యంలో ఈ నవల సాగుతుంది. 1960 నుంచి 1980 వరకు అమెరికన్ సమాజంలో జరిగిన రకరకాల సంఘటనలను కళ్లకు కడుతుంది.తీయలేనేమో... లేదు తీయాల్సిందే!‘ఈ నవలను సినిమాగా తీయగలనా?’ అనే సందేహం మొదట్లో పాల్ థామస్‌కు వచ్చింది. నవలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదైనా కాన్సెప్ట్ అనుకొని తీయాలనుకున్నాడు. అప్పుడు అతడి మదిలోకి వచ్చిన ఆలోచనలు...యాక్షన్ కార్–చేజ్ మూవీ, మరొకటి... ఒక విప్లవకారిణి కథ. తండ్రి–కూతురు అనుబంధంతో పై రెండు కాన్సెప్ట్‌లను కలిపి సినిమా తీయాలనుకున్నారు.కారు ఛేజింగ్‌లు, షూటౌట్లతో యాక్షన్–హెవీ కథనం ఉండాలి. అదే సమయంలో బలమైన భావోద్వేగాలు ఉండాలనుకున్నారు. డ్రాఫ్ట్‌ల మీద డ్రాఫ్ట్‌లు రాశారు. ఎన్నోసార్లు తిరగరాసుకున్నాకగానీ తనకు స్క్రిప్ట్ సంతృప్తిగా అనిపించలేదు. అలా సినిమా తెర మీదికి వచ్చింది. ఆండర్సన్ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రానికి అయిన బడ్జెట్ చా...లా ఎక్కువ!ఒక తల్లి కథవిప్లవకారిణి, ప్రేమికురాలు, అన్యాయానికి గురైన మహిళ, ఒక బిడ్డకు తల్లిగా... రకరకాల షేడ్స్‌తో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు టెయన్ జాక్వెలిన్ టేలర్. సింగర్, సాంగ్ రైటర్, మోడల్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, మ్యూజిక్ వీడియో డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.డైనమిక్ డాటర్‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’లో కూతురిగా ప్రధాన పాత్ర పోషించింది అమెరికన్ నటి చేజ్ ఇన్ఫినిటి పేన్. పదేళ్ల వయసులో స్కూలులో జరిగిన సంగీత కార్యక్రమానికి ఎంపిక కావడం ద్వారా ఆమె మ్యూజిక్ జర్నీ మొదలైంది. హైస్కూల్ రోజుల్లోనే మ్యూజిక్, థియేటర్ ప్రోగ్రామ్స్‌తో బిజీబిజీగా గడిపేది. ‘కె–పాప్ కవర్ డ్యాన్స్ గ్రూప్’ కో–ఫౌండర్లలో ఇన్ఫినిటీ ఒకరు. ఫ్రెంచ్ బాగా వచ్చు.గతం విషయం ఎలా ఉన్నా... ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’తో ‘ఈ అమ్మాయి ఎవరు?’ అని ప్రపంచ ప్రేక్షకులు ఆరా తీసేలా నటించింది. ‘కెమెరా టెస్ట్‌ల తరువాత ఆండర్సన్ సినిమాకు ఎంపిక కావడం మాట ఎలా ఉన్నా, లియో డికాప్రియోతో కలిసి నటిస్తున్నాననే ఊహ భయపెట్టింది. అమ్మానాన్నలకు ఫోన్ చేసి చెబితే, నా కంటే ఎక్కువ భయభ్రాంతులకు గురయ్యారు! ఇదొక గొప్ప అవకాశం. భయపడకూడదు’ అనుకొని చేశాను’ అంటుంది ఇన్ఫినిటీ పేన్. -
కంటతడి పెట్టించిన చిత్రానికి ‘ఆస్కార్’.. ఏ ఓటీటీలో ఉందంటే?
ఒక సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు.కేవలం భారీ బడ్జెట్, హంగులు ఉంటే సరిపోదు,ఆ సినిమా వెనుక ఒక బలమైన ఆత్మ ఉండాలి. సమాజానికి అవసరమైన సందేశం, మనుషుల మధ్య సంబంధాలు, సామాజిక అసమానతలు లేదా మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ఆస్కార్ టీమ్ ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. 98వ అకాడమీ అవార్డుల్లోనూ అదే జరిగింది. తండ్రి, కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’కి ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. అంతేకాదు ఉత్తమ దర్శకుడు(పాల్ థామస్ అండర్సన్), ఉత్తమ సహాయ నటుడు(షాన్ పెన్), ఎడిటింగ్(యాండీ జుర్గెన్సన్ ), కాస్టింగ్(కసాండ్రా కులుకుందిస్), అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (పాల్ థామస్ అండర్సన్ )తో పాటు మొత్తం ఆరు ఆస్కార్ అవార్డులు అందుకొని ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ రికార్డు సృష్టించింది.‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ కథేంటి?బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’. మాజీ విప్లవకారుడు బాబ్ పాత్రలో ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో నటించాడు. బాంబ్, పెర్ఫిడియా బేవర్లీ హిల్స్ (టియానా టేలర్) కలిసి సహజీవనం చేస్తుంటారు.పెర్ఫిడియా బేవర్లీ హిల్స్‌కి విప్లవ భావజాలం ఎక్కువ. ఓసారి వలసదారులను విడిపించే క్రమంలో అక్కడి కమాండింగ్ అధికారి స్టీవెన్‌ని ఆమె అవమానిస్తుంది. దీంతో పెర్ఫిడియాపై స్టీవెన్ పగపెంచుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఓ కేసులో ఆమెను పట్టుకొని..తనతో గడిపితే వదిలేస్తానని ఆఫర్ ఇస్తాడు. దీనికి పెర్ఫిడియా ఒప్పుకుంటుంది. అతని కారణంగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కోసం తండ్రి పోరాటంకొన్నాలకు ఆ చిన్నారితో పాటు తన జీవిత భాగస్వామి బాబ్‌ని వదిలేసి విప్లవ బాట పడుతుంది. దీంతో ప్యాట్ ఒంటరి చిన్నారి చార్లీన్ను పెంచుతాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. కొన్నాళ్ల తర్వాత స్టీవెన్‌కు ఆ చిన్నారి తన కూతురే అనే విషయం తెలుస్తుంది. ఈ విషయం బయటకు వస్తే కెరీరేకే ఇబ్బంది అవుతుందని తెలిసి..ఆమెను చంపేందుకు కుట్రలు పనఉనతాడు. ఈ విషయం బాబ్కి తెలుస్తుంది. తన కూతురిని కాపాడుకునేందుకు బాబ్ ఏం చేశాడు? స్వార్థం తన పరిస్థితులను ఎలా మార్చేసింది? అన్నదే ఈ సినిమా కథ. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ డ్రామా. తన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడే తపన తెరపై చూస్తుంటే కన్నీళ్ల ఆగవు.థామస్ పించన్ రాసిన 'వినైల్యాండ్' (Vineland) నవల ఆధారంగా దర్శకుడు పాల్ థామస్ అండర్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గతేడాది సెప్టెంబరు 26న వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. 175 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 209.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.


