-
విషాదం: అక్కతో కలిసి పాఠశాలకు.. నీళ్లు పట్టుకుందామని వెళ్లి..
అడ్డాకుల: పాఠశాలలు తెరిచిన రెండో రోజే జరిగిన ఓ ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. సంపు వద్ద నల్లా నీళ్లు పట్టుకుంటుండగా అందులో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కందూర్ గ్రామానికి చెందిన షాహీనాబేగం, మహ్మద్ రఫిక్ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే చిన్న కుమార్తె షరీఫా (6) పాఠశాలలో చేరాల్సి ఉంది. కాగా, గురువారం అక్కతో కలసి పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్న భోజన సమయంలో నల్లా నీళ్ల కోసం వెళ్లి పాఠశాల ఆవరణలో ఉన్న సంపులో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. శుక్రవారం ఉదయం సంపులో పాప మృతదేహం కనిపించడంతో కన్నీరు మున్నీరయ్యారు. అధికారుల విచారణ ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ మంజుల, ఎస్ఐ విజయకుమార్ తదితరులు పరిశీలించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి ఈ పాఠశాలలోని ఓ గదిలో అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ కంటే ముందు షరీఫా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేది. ఈసారి పాఠశాలలో చేరాల్సి ఉన్నా తల్లిదండ్రులు ఇంకా చేర్పించలేదు. అక్కతోపాటు వెళ్లిన షరీఫా సంపులో పడి ప్రాణాలు కోల్పోయింది. -
అక్రమ దందాకు కేరాఫ్ అడ్రస్ రిటైర్డ్ డెప్యూటీ ఎమ్మార్వో ఇల్లు
- ఆర్డీవో ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు - 38 పాసుపుస్తకాలు, రికార్డులు స్వాధీనం - ఆర్డీవోకు అందిన తనిఖీల నివేదిక కమలాపూర్ : అతనో రిటైర్డ్ డెప్యూటీ తహశీల్దార్. అయితేనేమీ పాత పరిచయాలతో ఇప్పటికీ రెవెన్యూపరమైన పనులను తన ఇంట్లోనే చక్కబెడుతున్నాడు. ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలు జారీ చేస్తున్నాడంటూ ఆర్డీవోకు అందిన ఫిర్యాదు మేరకు అతని బండారం బట్టబయలైంది. రెవెన్యూ అధికారుల కథనం మేరకు.. కమలాపూర్‌కు చెందిన కోవెల భిక్షేందర్‌స్వామి హుజూరాబా ద్, శంకరపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలా ల్లో రెవెన్యూశాఖలో పని చేశారు. ఇటీవలే భీమదేవరపల్లి డెప్యూటీ తహశీల్దార్‌గా రిటైర్డ్ అయ్యారు. అయినా రెవెన్యూ పరమైన పనులను కమలాపూర్‌లోని తన ఇంట్లోచే చక్కబెడుతున్నాడు. ఈ క్రమంలోనే భిక్షేందర్‌స్వామి ఫోర్జరీ సంతకాలతో నకిలీ పాసు పుస్తకాలు తయారు చేసి జారీ చేస్తున్నాడంటూ ఇటీవల కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్‌కు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో భిక్షేందర్‌స్వామి ఇంట్లో తనిఖీలు నిర్వహించాలని వీణవంక, కమలాపూర్ తహశీల్దార్లను ఆర్డీవో ఆదేశించారు. శనివారం రెవెన్యూ అధికారులు భిక్షేందర్‌స్వామి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. శంకరపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుజూరాబాద్ మండలాలకు చెందిన 38 పాసు పుస్తకాలు లభించాయి. అలాగే ఆర్వోఆర్, విరాసత్ ఫైళ్లు 13, జమాబందీ ఫైళ్లు 14, ప్ర భుత్వ భూముల అసైన్మెంట్ దరఖాస్తులు 13, వివిధ మండలాలకు చెందిన 38 పాసు పుస్తకాల జిరాక్స్‌లు ల భ్యమయ్యాయి. తనిఖీల సమయంలో భిక్షేందర్‌స్వామి అందుబాటులో లేరని, స్వాధీనం చేసుకున్న రికార్డులు సీజ్ చేసి కమలాపూర్ తహశీల్దార్‌కు అప్పగించామని, తనిఖీ పూర్తి నివేదికను ఆర్డీవోకు నివేదిస్తామని వీణవంక తహశీల్దార్ భావుసింగ్ తెలిపారు. ఈ తనిఖీల్లో తహశీల్దార్ అనంతుల రవీందర్, ఆర్ఐలు రజని, నెహ్రూ, సదానందం, వీఆర్వోలు సదానందం, రవీందర్రావు, వీఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement