breaking news
October Month
-
యూపీఐ కొత్త రికార్డు!
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అక్టోబర్‌లో రూ.27.28 లక్షల కోట్ల విలువ చేసే 2,070 కోట్ల లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు గత గరిష్ట రికార్డు కావడం గమనార్హం. సంఖ్యా పరంగా గత ఆగస్ట్‌లో నమోదైన 2,000 కోట్ల లావాదేవీలు గరిష్ట స్థాయిగా ఉన్నాయి. అక్టోబర్‌లో అటు విలువ పరంగా, ఇటు సంఖ్యా పరంగా యూపీఐ కొత్త రికార్డులు సృష్టించింది. క్రితం ఏడాది అక్టోబర్‌లో రూ.23.49 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. దీంతో పోలి్చతే విలువ పరంగా 16 శాతం పెరుగుదల కనిపించింది. ఇక ఈ ఏడాది సెపె్టంబర్ నెలలోనూ రూ.24.90 లక్షల కోట్ల విలువ చేసే 1,963 కోట్ల లావాదేవీలు జరిగాయి. అక్టోబర్‌లో రోజువారీ సగటు లావాదేవీలు 66.8 కోట్లుగా ఉన్నాయి. సగటు లావాదేవీ విలువ రూ.87,993గా ఉంది. పండుగల సీజన్ కావడంతో యూపీఐ లావాదేవీలు పెద్ద మొత్తంలో పెరిగినట్టు తెలుస్తోంది. మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 85 శాతం యూపీఐ ద్వారానే కొనసాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రజల నిత్య జీవితంలో డిజిటల్ చెల్లింపులు భాగంగా మారాయని స్పైస్‌మనీ సీఈవో దిలీప్ మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌లోనూ యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.మలేసియాలోనూ యూపీఐ చెల్లింపులు యూపీఐ యూజర్లు ఇకపై మలేసియాలోనూ చెల్లింపులు చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. ఇందుకు వీలుగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్, రేజర్‌పే కర్లక్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో యూపీ ఐ మరో కొత్త దేశంలోకి అడుగుపెట్టినట్టయింది. -
నెమ్మదించిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్‌లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వృద్ధి 4.6 శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యల్ప వృద్ధి కావడం గమనార్హం. నిత్యావసరాల నుంచి ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ వరకు దాదాపు 375 ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించడం దీనికి నేపథ్యం. శనివారం కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం గతేడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 1.87 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే ఈసారి అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు 4.6 శాతం వృద్ధితో రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. స్థానిక అమ్మకాల తీరుతెన్నులను సూచించే స్థూల దేశీ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్నులు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లకు ఎగిశాయి. జీఎస్టీ రిఫండ్లు వార్షికంగా 39.6% పెరిగి రూ. 26,934 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను కూడా సర్దుబాటు చేయగా నికర జీఎస్టీ ఆదాయం 0.2 % వృద్ధితో రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదైంది. పండగ సీజన్ దన్ను.. పండగ సీజన్ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి పేరుకుపోయిన డిమాండ్‌ను అక్టోబర్ జీఎస్టీ గణాంకాలు ప్రతిబింబించాయి. దీపావళికి ముందు జీఎస్టీ రేట్లను తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో, రేట్లు తగ్గే వరకు వేచి చూద్దామనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా జీఎస్టీ రేట్లను తగ్గించడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్ల సగటు వృద్ధి సుమారు 9 శాతంగా నమోదైంది. ఆగస్టులో వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లుగా, సెప్టెంబర్‌లో 9.1 శాతం వృద్ధితో రూ. 1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రమంగా పెరుగుతున్న డిమాండ్.. దేశీయ జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా పెరగడాన్ని బట్టి చూస్తే, డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రైస్ వాటర్‌హౌస్ అండ్ కో పార్ట్నర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జీఎస్టీ రిఫండ్లు నిలకడగా పెరగడాన్ని చూస్తే, భవిష్యత్తులో కూడా జీఎస్టీ వసూళ్ల వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆదాయ పన్ను శాఖ విశ్వసిస్తోన్నట్లుగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. రేట్ల క్రమబదీ్ధకరణ, పండగ సీజన్‌కి ముందు వినియోగదారులు ఖర్చులను వాయిదా వేసుకోవడమనేది జీఎస్టీ వసూళ్ల వేగం నెమ్మదించడంలో ప్రతిఫలించినట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. ఇది ముందుగా ఊహించినదేనని, తదుపరి నెలలో మళ్లీ పుంజుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను పాటించడంలో (కాంప్లియెన్స్) క్రమశిక్షణ మెరుగుపడుతుండటాన్ని, వ్యాపారాలకు రుణలభ్యత సులభతరం కావడాన్ని రీఫండ్ల పెరుగుదల సూచిస్తోందని ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్ పార్ట్నర్ వివేక్ జలాన్ తెలిపారు. దిగుమతి ఆధారిత ఐజీఎస్టీ వసూళ్లు సుమారు 12 శాతం పెరగడమనేది ముడి వస్తువులు, క్యాపిటల్ గూడ్స్‌కి ఆరోగ్యకరమైన డిమాండ్ నెలకొనడాన్ని, పారిశ్రామికోత్పత్తి పటిష్టతను సూచిస్తోందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాలు ఈ వృద్ధికి దన్నుగా నిల్చాయని వివరించారు. చిన్న వ్యాపారాలకు 3 రోజుల్లోనే రిజి్రస్టేషన్.. తక్కువ రిసు్కలు ఉండేవి, చిన్న వ్యాపారాలు 3 పని దినాల్లోనే జీఎస్టీ రిజి్రస్టేషన్ పొందే విధంగా జీఎస్టీ విభాగం నవంబర్ 1 నుంచి సరళతర విధా నాన్ని అమల్లోకి తెచ్చింది. డేటా అనాలిసిస్ ఆధారంగా జీఎస్టీ సిస్టం గుర్తించిన చిన్న వ్యాపారులు, తమ ఔట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ నెలకు రూ. 2.5 లక్షలకు మించదని సెల్ఫ్–అసెస్మెంట్ చేసుకున్న వారు ఈ స్కీమ్‌ని ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగానే దీన్ని ఎంచుకోవచ్చు. దీన్నుంచి వైదొలగవచ్చు. సరళతరమైన కొత్త జీఎస్టీ రిజి్రస్టేషన్ స్కీముతో 96 శాతం మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీ కింద 1.54 కోట్ల వ్యాపారాలు నమోదు చేసుకున్నాయి. -
టాప్ గేర్‌లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌కు తోడు జీఎస్టీ 2.0 సంస్కరణలు కలిసిరావడంతో అక్టోబర్‌లో రిటైల్ వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, కియా మోటార్స్ ఆటో కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్ మోటార్లు సైతం చెప్పుదగ్గ స్థాయిలో వాహనాలను విక్రయించాయి. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అక్టోబర్‌లో 1,80,675 వాహనాలు విక్రయించింది. గత ఏడాదిలో అమ్ముడైన 1,63,130 వాహనాలతో పోలిస్తే ఇది 11% అధికం. విదేశాలకు చేసిన ఎగుమతులు(31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘మునుపెన్నడూ లేనంతగా ఒక్క అక్టోబర్‌లోనే 2,42,096 యూనిట్లు రిటైల్ అమ్మకాలు జరిపాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 20% అధికం. నవరాత్రుల ప్రారంభం నుంచి పండగ సీజన్ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్, 4.1 లక్షల రిటైల్ వాహనాలు విక్రయించాము. గతేడాది మొత్తం అమ్మకాలతో పోలిస్తే ఇవి రెట్టింపు. జీఎస్టీ సంస్కరణలకు ముందు తొలిసారిగా కార్లు కొనే కస్టమర్లకు కొన్ని సవాళ్లు ఉండేవి. సంస్కరణల అమలు తర్వాత అధిక సంఖ్యలో వినియోగదారలు షోరూంలను సందర్శిస్తున్నారు’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. → మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా రికార్డు స్థాయిలో 71,624 ఎస్‌యూవీలను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో అమ్మకాలు 54,504 యూనిట్లతో పోలిస్తే ఇవి 31% అధికం. ఎస్‌యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారి అని కంపెనీ నళినికాంత్ గొల్లగుంట తెలిపారు. → టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మొత్తం 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6% వృద్ధి నమోదైంది. ఇందులో 47 వేల యూనిట్లు ఎస్‌యూవీలున్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 69,894 వాహనాలను విక్రయించింది. గతేడాది అక్టోబర్‌లో అమ్మిన 53,792 యూనిట్లతో పోలిస్తే ఇవి 30% అధికం. దేశీయ విక్రయాలు మాత్రం 3% క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు దిగివచ్చాయి. అయితే మార్కెట్లోని డిమాండ్‌కు తగ్గట్లు క్రెటా, వెన్యూ విభాగంలో 30,119 ఎస్‌యూవీలను విక్రయించింది. ‘‘దసరా, ధన్‌తేరాస్, దీపావళి పండుగలతో డిమాండ్ నెలకొంది. జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు కూడా వీటికి తోడు కావడంతో అక్టోబర్‌లో భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ మరింత కాంతులీనింది’’ అని హెచ్ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ తెలిపారు. → కియా ఇండియా కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సెల్టోస్ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి. ‘‘కియా ఇండియా ప్రయాణంలో 2025 అక్టోబర్ ఒక చారిత్రాత్మక మైలురాయి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో ఉంటుంది’’ అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సోద్ తెలిపారు. → స్కోడా ఆటో ఇండియా 8,252 యానిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి పదినెలల్లో (జనవరి–అక్టోబర్) 61,607 యూనిట్లను అమ్మింది. కంపెనీ ఒక ఏడాదిలో అత్యధిక అమ్మకాలు (2022లో) 53,721 యూనిట్లను అధిగమించడం విశేషం. -
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్‌లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్బీఐ తన బులెటిన్‌లో పేర్కొంది. సంస్కరణల మద్దతు అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్‌తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. -
అక్టోబర్‌లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్‌ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు
సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..సెలవుల జాబితా ఇదే.. » అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చమ బెంగాల్లో బ్యాంకుల మూత» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో సెలవు» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్టక్లో సెలవు» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవుఅక్టోబర్లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్లైన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి భారీ పెట్టుబడులు - సిప్ రూపంలో రూ.17 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అక్టోబర్‌లోనూ ఇన్వెస్టర్ల ఆదరణ చూరగొన్నాయి. నికరంగా రూ.20,000 కోట్లను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో వచ్చిన రూ.14,091 కోట్లతో పోలిస్తే 40 శాతానికి పైగా పెరిగాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నెలవారీగా వచ్చే పెట్టుబడులు రూ.16,928 కోట్ల మైలురాయిని చేరాయి. సిప్ రూపంలో ఒక నెలలో వచ్చిన గరిష్ట స్థాయి పెట్టుబడులు ఇవే కావడం గమనించొచ్చు. అక్టోబర్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. అక్టోబర్ నెలలో నాలుగు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి రాగా, ఇవి రూ.2,996 కోట్లను సమీకరించాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.4,495 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తుండడం గమనించొచ్చు. థీమ్యాటిక్ ఫండ్స్ రూ. 3,896 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వరుసగా ఐదు నెలల పాటు పెట్టుబడులను కోల్పోయిన లార్జ్‌క్యాప్ పథకాల దశ మారింది. ఇవి నికరంగా రూ.724 కోట్లను రాబట్టాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి నికరంగా రూ.42,634 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో డెట్ విభాగం నుంచి నికరంగా రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లడం గమనార్హం. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.32,694 కోట్లను ఆకర్షించాయి. గిల్ట్ ఫండ్స్‌లోకి రూ.2,000 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లోకి రూ.841 కోట్లు వచ్చాయి. అన్ని విభాగాల్లోకి కలిపి అక్టోబర్‌లో రూ.80,528 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ చివరికి ఉన్న రూ. 46.58 లక్షల కోట్ల నుంచి రూ. 46.71 లక్షల కోట్లకు పెరిగాయి. -
దేశీ విమాన ప్రయాణాకిల్లో 10% వృద్ధి
న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థలు అక్టోబర్‌లో దేశీయంగా 1.14 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. సెప్టెంబర్‌లో నమోదైన 1.04 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 27 శాతం ఎగిసి 89.85 లక్షల నుండి 1.14 కోట్లకు చేరింది. కరోనా మహమ్మారి కాలంలో దాదాపుగా నిల్చిపోయిన విమాన ప్రయాణాలు కొంతకాలంగా తిరిగి ప్రారంభమవుతుండటంతో .. విమానయాన పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. డేటాలోని మరిన్ని కీలకాంశాలు.. ► దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో మార్కెట్ వాటా సెప్టెంబర్‌లో 58 శాతంగా ఉండగా అక్టోబర్‌లో 56.7 శాతానికి తగ్గింది. ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 0.9 శాతం నుండి 1.4 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ వాటా 7.3 శాతంగా, గో ఫస్ట్ వాటా 7 శాతంగా ఉంది. ► ఎయిరిండియా మార్కెట్ వాటా 9.1 శాతంగా ఉండగా, ఎయిర్‌ఏషియాది 7.6 శాతానికి చేరింది. విస్తార వాటా 9.6 శాతం నుండి 9.2 శాతానికి దిగి తగ్గింది. ► సమయ పాలనలో (ఓటీపీ) ఎయిరిండియా (90.8 శాతం) అగ్రస్థానంలో ఉండగా విస్తారా (89.1 శాతం), ఎయిర్ఏషియా ఇండియా (89.1 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడూ టాటా గ్రూప్ కంపెనీలే కావడం గమనార్హం. ► ఇండిగో ఓటీపీ 87.5 శాతంగా ఉండగా, అలయన్స్ ఎయిర్ (74.5%), స్పైస్‌జెట్ (68.9%), గో ఫస్ట్ (60.7%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి ఓటీపీని లెక్కించారు. ► 2022 జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 9.88 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 6.21 కోట్లతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ 59 శాతం పెరిగింది. -
అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల లిస్ట్.. ఏకంగా 21 రోజులు
సాక్షి, ముంబై: పండుగల సమీపిస్తున్న నేపథ్యంలో అక్టోబరు నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులు పనిచేయవు. రెండు,నాలుగు శనివారాలు, ఆదివారాలు సహా మొత్తం 21 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబరు నెలలో బ్యాంకులకు సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి కొన్ని ప్రాంతీయ సెలవులతో అన్ని ప్రభుత్వ సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ప్రాంతీయ రాష్ట్రసెలవులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో కస్టమర్లు తమ సమీప బ్యాంకును సందర్శించే ముందు సెలవుల లిస్ట్‌ను చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 2022 నెలలో బ్యాంక్ సెలవుల లిస్ట్ అక్టోబరు 1, 2022- బ్యాంకు ఖాతాల అర్ధ వార్షిక ముగింపు (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 2, 2022- గాంధీ జయంతి, ఆదివారం అక్టోబర్ 3, 2022- దుర్గా పూజ (అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) అక్టోబర్ 4, 2022- దుర్గాపూజ/దసరా/ఆయుధ పూజ/శ్రీమంత శంకరదేవ (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్ , తిరువనంతపురం) అక్టోబర్ 5, 2022- దుర్గాపూజ/దసరా/శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం అక్టోబర్ 6, 2022- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 7, 2022- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్) అక్టోబర్ 8, 2022- రెండో శనివారం. మిలాద్-ఉల్-నబీ (భోపాల్, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం) అక్టోబర్ 9, 2022- ఆదివారం అక్టోబర్ 13, 2022- కర్వా చౌత్ (సిమ్లా) అక్టోబర్ 14, 2022- ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ , శ్రీనగర్) అక్టోబర్ 16, 2022- ఆదివారం అక్టోబర్ 18, 2022- కటి బిహు (గౌహతి) అక్టోబర్ 22, 2022- నాల్గవ శనివారం అక్టోబర్ 23, 2022- ఆదివారం అక్టోబర్ 24, 2022- కాళీ పూజ/దీపావళి అక్టోబర్ 25, 2022- లక్ష్మీ పూజ/దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, ఇంఫాల్, జైపూర్) అక్టోబర్ 26, 2022- గోవర్ధన్ పూజ/భాయ్ దూజ్/దీపావళి/విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే (అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, డెహ్రాడూన్, గాంగ్టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, సిమ్లా, శ్రీనగర్) అక్టోబర్ 27, 2022- భాయ్ దూజ్/లక్ష్మీ పూజ/దీపావళి (గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్ మరియు లక్నో) అక్టోబర్ 30, 2022- ఆదివారం అక్టోబర్ 31, 2022- సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు/సూర్య పష్టి దాలా ఛత్/ఛత్ పూజ (అహ్మదాబాద్, పాట్నా, రాంచీ) 21 రోజుల పాటు బ్యాంకులు మూతపడినా ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెలవు రోజుల్లో కస్టమర్లు బ్యాంక్ నుండి డబ్బును భౌతికంగా డిపాజిట్ చేయలేరు లేదా విత్‌డ్రా చేయలేరు. కానీ ఇతర ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు. -
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో నమోదైన యూపీఐ లావాదేవీలు!
UPI Records: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అక్టోబర్ నెలలో 4 బిలియన్లకు పైగా యుపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయి. పండుగ సీజన్ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. విలువ పరంగా అక్టోబర్ నెలలో జరిగిన లావాదేవీల విలువ రూ.7.71 ట్రిలియన్లకు సమానం. సెప్టెంబర్ నెలలో రూ.6.5 ట్రిలియన్ విలువైన 3.65 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ప్రతి నెల యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం జంప్ అయితే, అక్టోబర్ నెలలో లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అలాగే ప్రతి సంవత్స రం లావాదేవీల పరిమాణం రెట్టింపు అవుతూ వస్తున్నాయి. 2016లో ప్రారంభించబడిన యూపీఐ అద్భుతమైన ప్రజాదరణ పొందింది. కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారి తర్వాత యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. 2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఫ్రాన్సెస్ హౌగెన్!) -
అక్టోబర్‌లో ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు అక్టోబర్‌లో 42.33 శాతం పెరిగి 35.47 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతులు ఇదే నెల్లో 62.49 శాతం ఎగసి 55.37 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 19.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ఇంజనీరింగ్, పెట్రోలియం రంగాల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ► మొత్తం ఎగుమతుల్లో 28.19 శాతం వాటా కలిగిన ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు అక్టోబర్‌లో 50.7 శాతం పెరిగి, 9.38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు 232 శాతం ఎగసి 5.19 బిలియన్ డాలర్లకు చేరాయి. ► సమీక్షా నెల్లో పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 44.24 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో 4.22 బిలియన్ డాలర్లకు చేరింది. ► మొత్తం ఎగుమతుల్లో 3.5 శాతం వాటా కలిగిన టెక్స్టైల్స్ పరిశ్రమ నుంచి 1.25 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే ఇది 6.4 శాతం అధికం. ► ఎలక్ట్రానిక్ గూడ్స్ విలువ 966 మిలియన్ డాలర్ల నుంచి (2020 అక్టోబర్) 1.34 బిలియన్ డాలర్లకు చేరాయి. ► దిగుమతుల విషయానికి వస్తే, పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తులు 140.5 శాతం పెరిగి 14.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ 23% పెరిగి 6.81 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మిషనరీ, ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ విభాగం 42% పురోగతితో 3.54 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు 55% పెరిగి 232.58 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 79 శాతం పెరిగి 331.29 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య వాణిజ్యలోటు 98.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. సేవలు ఇలా... కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశం నుంచి సేవల ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 22 శాతం ఎగసి 20.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 25 శాతం పెరిగి 12.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
అలర్ట్: అక్టోబర్‌లో ఎన్నిరోజులు బ్యాంక్ సెలవులో తెలుసా?
Bank Holidays October 2021: ఆర్బీఐ వచ్చే నెలలో దేశం మొత్తం 14 రోజులు బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. వాటిలో రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 14 సెలవుల్ని ఆర్బీఐ ప్రకటించింది.అయితే దేశంలో ఆయా ప్రాంతాల వారీగా మొత్తం 21 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి. 1.అక్టోబర్ 1 - హాఫ్ ఎర్లీ క్లోజింగ్ బ్యాంక్ అకౌంట్స్ (గాంగ్టక్ సిక్కిం) 2. అక్టోబర్ 2 - మహత్మా గాంధీ జయంతి (అన్నీ రాష్ట్రాలకు ) 3. అక్టోబర్ 3- ఆదివారం 4. అక్టోబర్ 6 - మహాలయ అమావాస్యే (అగర్తలా, బెంగళూరు, కోల్‌కతా) 5) అక్టోబర్ 7 - లైనింగ్‌థౌ సనామహి (ఇంఫాల్) 6) అక్టోబర్ 9 - 2 వ శనివారం 7) అక్టోబర్ 10 - ఆదివారం 8) అక్టోబర్ 12 - దుర్గా పూజ (మహా సప్తమి) / (అగర్తలా, కోల్‌కతా) 9) అక్టోబర్ 13 - దుర్గా పూజ (మహా అష్టమి) / (అగర్తలా, భువనేశ్వర్, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ) 10) అక్టోబర్ 14 - దుర్గా పూజ / దసరా (మహా నవమి) / ఆయుధ పూజ (అగర్తల, బెంగళూరు, చెన్నై, గాంగ్టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం) 11) అక్టోబర్ 15 - దుర్గా పూజ / దసరా / దసరా (విజయ దశమి) / (ఇంఫాల్,సిమ్లాలో మినహా అన్ని బ్యాంకులు) 12) అక్టోబర్ 16 - దుర్గా పూజ (దాసైన్) / (గాంగ్టక్) 13) అక్టోబర్ 17 - ఆదివారం 14) అక్టోబర్ 18 - కాటి బిహు (గౌహతి) 15) అక్టోబర్ 19- మిలాద్ ఉన్ నబీ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు)/బరవఫత్/(అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి , లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం) 16) అక్టోబర్ 20-మహర్షి వాల్మీకి పుట్టినరోజు/లక్ష్మీ పూజ/ఐడి-ఇ-మిలాద్ (అగర్తలా, బెంగళూరు, చండీగఢ్, కోల్‌కతా, సిమ్లా) 17) అక్టోబర్ 22-ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ, శ్రీనగర్) తరువాత శుక్రవారం 18) అక్టోబర్ 23 - 4 వ శనివారం 19) అక్టోబర్ 24 - ఆదివారం 20) అక్టోబర్ 26 - ప్రవేశ దినం (జమ్మూ, శ్రీనగర్) 21) అక్టోబర్ 31 - ఆదివారం -
అత్యధికంగా క్యాన్సర్ బారిన పడుతుంది వారే!
గ్రామీణ మహిళల కంటే పట్టణాల్లో ఉండే వారే అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే వారిలో కేవలం 10 శాతం మంది మాత్రమే తొలి దశలో గుర్తిస్తుండగా, 70 శాతం మంది, 2, 3 దశల్లో ఆస్పత్రులకు వస్తున్నారు. మరో 20 శాతం మంది నాలుగో దశలో చికిత్సకోసం వస్తున్నారు. వ్యాధి లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు క్యాన్సర్ నిపుణులు చెబుతున్నారు. వ్యాధిపై విస్తృతమైన అవగాహన కలగించేందుకు అక్టోబర్ మాసాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. వీరికి వ్యాధి సోకే అవకాశం.. ►సాధారణంగా వయస్సు 40 ఏళ్లు దాటిన వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ►లేటు వయస్సులో బిడ్డలు పుట్టిన వారికి, పిల్లలు పుట్టాక పాలు ఇవ్వని వారికి ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ►కుటుంబంలో అంతకు ముందు ఎవరికైనా ఉన్నా, ఎక్కువ ఒత్తిళ్లకు గురయ్యే వారికి, పన్నెండేళ్లలోపు రజస్వల కావడం, నెలసరి ఆగడం, 55 ఏళ్ల వరకు నెలసరి ఉండటం వంటివి కారణాలుగా చెబుతున్నారు. ►ధూమపానం, ఆల్కాహాల్ సేవించే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ►ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు.. రొమ్ము క్యాన్సర్ ఎవరికి వారే గుర్తించవచ్చు. పీరియడ్ వచ్చిన వారం రోజుల తర్వాత స్నానం చేస్తున్న సమయంలో రొమ్ములో గింజంత సైజులో కణుతులు ఏమైనా వచ్చాయా, రొమ్ముపై చర్మం రంగు మారిందా, చంకల్లో గడ్డలు లాంటివి వచ్చాయా అనే విషయాలను మహిళలు చెక్ చేసుకోవాలి. రొమ్ము భాగంలో నొప్పిగా ఉన్నా, చిన్న చిన్న లక్షణాలు కనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. మమ్మోగ్రామ్‌తో నిర్ధారణ.. ►రొమ్ము క్యాన్సర్‌ను మమోగ్రామ్ అనే స్కానింగ్ ద్వారా నిర్ధారిస్తారు. ఇప్పుడు 3డీ మమ్మోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది. ►దీని ద్వారా వ్యాధి సూక్ష్మదశలో ఉన్నప్పుడే గుర్తించే అవకాశం ఉంది. ►రొమ్ము భాగంలో పౌడర్లా ఏదైనా చల్లినట్లు ఉన్నా కనిపెట్టేస్తుంది. ►ఏడాదికోసారి మమ్మోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ముందు చూపే మందు.. రొమ్ము క్యాన్సర్‌కు ముందు చూపే మందు. తొలిదశలోనే గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్తే అత్యాధునిక పరికరాలతో వ్యాధిని నిర్ధారించి చికిత్స పొందవచ్చు. సెల్ఫ్ చెక్ చేసుకునే విధానాలపై మహిళలకు అవగాహన ఉండాలి. రోజు వారీ వ్యాయామం చేస్తూ, బరువు పెరగకుండా చూసుకోవడం, కొవ్వు, నూనె ఉన్న పదార్థాలు తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏవైరావు, క్యాన్సర్ వైద్య నిపుణుడు -
కార్ల విక్రయాలకు పండుగ కళ..
రికార్డ్ అమ్మకాలు సాధించిన మారుతీ, హ్యుందాయ్ న్యూఢిల్లీ: పండుగ కళతో అక్టోబర్ నెల వాహన విక్రయాలు కళకళలాడాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లు తమ తమ కంపెనీల చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించాయి. హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ విక్రయాలు జోరుగా సాగాయి. వివరాలు.., కొత్త మోడళ్లు, కొత్త వేరియంట్లతో మంచి అమ్మకాలు సాధించామని మారుతీ సుజుకీ తెలిపింది. పండుగ సీజన్ సందర్భంగా అమ్మకాలు బావుంటాయనే ఉద్దేశంతో తమ నెట్‌వర్క్‌ను సిద్ధం చేశామని, తమ కంపెనీ చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. అక్టోబర్‌లో అత్యధిక దేశీయ అమ్మకాలు సాధించామని హ్యుందాయ్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రాండ్ ఐ10 కూడా రికార్డ్ స్థాయి అమ్మకాలు సాధించిందని వివరించారు. వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడిందని, రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రీమియం బ్రాండ్స్ క్రెటా, ఇలీట్ ఐ20/యాక్టివ్ కార్లకు మంచి స్పందన లభిస్తోందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక అమ్మకాలను గత నెలలో సాధించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన టీయూవీ300 ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. వడ్డీరేట్లు తగ్గడం, ఇంధన ధరలు కూడా తక్కువ స్థాయిల్లోనే కొనసాగడం కలసివచ్చాయని వివరించారు.రానున్న నెలల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


