breaking news
Nutrition experts
-
Payal Kothari: టీబీ.. డిప్రెషన్.. సమస్యలు అధిగమించి హెల్త్ కోచ్‌గా!
‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్‌లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్ హెల్త్ కోచ్‌గా మారాను’’ అని చెబుతోంది పాయల్ కొఠారి. ముంబైకి చెందిన పాయల్ కొఠారి కోల్‌కతాలోని గుజరాతీ జైన్ కుటుంబంలో పుట్టింది. పాయల్‌కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్‌కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను. ఫెయిలవడంతో... ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చదువులో చాలా చురుకుగా ఉండేది పాయల్. కానీ మన సులో ఎప్పుడూ తెలియని నిరాశ వెంటాడేది. ఇలా అనిపించిన ప్రతిసారి విపరీతంగా తింటుండేది. దీంతో తన బరువు అమాంతం పెరిగి ఒబెసిటీ వచ్చింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన పాయల్‌ను మిగతా విద్యార్థులంతా హేళన చేస్తుండేవారు. వారి కామెంట్లను భరించలేని పాయల్ తీవ్ర నిరాశకు లోనై సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్ అయ్యింది. ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్ నుంచి బయటపడింది. కాస్త పర్వాలేదు అనుకునేలోపు... మానసికంగా కాస్త పర్లేదు అనుకుంటుండగా..పదోతరగతి పూర్తై కాలేజీలో అడుగుపెట్టిన పాయల్‌ను పొట్ట ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో అనేక మ్యాగజీన్లు చదివి తన కడుపు సమస్యకు డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటూనే కిచిడి, పెరుగన్నం, పండ్లు, నెయ్యి, సూప్‌లు తీసుకుంటూ పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పొట్ట, ఒబెసిటీ సమస్యలను తగ్గించి ఫిట్‌గా తయారైంది. డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ స్కూల్ అయిన న్యూయార్క్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంట్రాగేటివ్ న్యూట్రిషన్(ఐఐఎన్) లో క్లినికల్ న్యూట్రిషన్లో సర్టిఫికెట్ కోర్సులు చేసింది. పదిహేనేళ్ల తరువాత.. కోర్సు పూర్తయ్యాక పాయల్‌కు ఓ వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో భర్తతో హాంగ్‌కాంగ్ వెళ్లిపోయింది. పదిహేనేళ్లపాటు గృహిణిగా ఉన్న పాయల్ భర్తకు వ్యాపారంలో నష్టం రావడంతో 2016లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటోన్న పాయల్‌ను చూసిన కొంతమంది ‘‘అధిక బరువు నుంచి ఇంత ఫిట్‌గా ఎలా తయారయ్యావు? నీ చర్మం కూడా కాంతిమంతంగా ఉంది’’ మాకు కొన్ని టిప్స్ చెప్పు అని అడిగేవారు. దీంతో క్లినికల్ స్టడీ సర్టిఫికెట్ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్‌గా మారిన అనుభవంతో ‘గట్ హెల్త్ కోచ్’ గా మారాలనుకుంది. కోచ్‌గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్ చోచ్గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్‌గా బాలీవుడ్ సెలబ్రెటీల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల వరకు కోచ్‌గా పనిచేసింది. ఇలా ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్‌గా పనిచేసి వారి ఆరోగ్యస్థితిగతులను మెరుగుపరిచింది. పెద్దవాళ్లకేగాక స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మహిళా క్లబ్బులు, ఎన్జీవోలను సందర్శించి గట్ హెల్త్‌పై అవగాహన కల్పిస్తోంది. ద గట్ పేరిట బుక్ కూడా రాసింది. ఆన్లైన్ న్యూట్రిషన్ స్కూల్ ప్రారంభించి గట్ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్ రాస్తూ ఫిట్నెస్ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్. చదవండి: Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో.. -
నేరేడుతో ప్రయోజనాలెన్నో..
రోజూ గుప్పెడు నేరేడు పళ్లు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు తినడం వల్ల రక్తపోటు అదుపు కావడమే కాకుండా, ధమనులు బిరుసెక్కకుండా ఉంటాయని అంటున్నారు. తరచుగా నేరేడు పళ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ దశలో రక్తపోటును ఎదుర్కొనే మహిళలకు నేరేడు పళ్లు మరింత మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. నేరేడు పళ్ల పొడిని తీసుకున్నా, ఇవే రకమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. నేరేడు పళ్లలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందని వివరిస్తున్నారు. -
బంగాళదుంపల్లో...బంగారం నువ్వేలే!
మెన్స్ హెల్త్ బంగాళదుంపలు తినడం రుచికి మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలామంచిదని పౌష్టికాహార నిపుణులు చెబుతారు. మీరు తీసుకొనే ఆహారంలో బంగాళదుంపలు ఎంత శాతం తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వీలైతే రోజూ తినండి. వీటి వల్ల ఉపయోగాలు..... విటమిన్ బి6 - బంగాళదుంపలలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. - ఇది గుండెపోటు రాకుండా నివారిస్తుంది. విటమిన్ సి - దంతాలు, ఎముకలు, జీర్ణక్రియ... మొదలైన వాటిలో కీలక పాత్ర పోషించే విటమిన్- సి బంగాళదుంపలలో పుష్కలం. - చర్మసంరక్షణకు, ఒత్తిడి నుంచి విముక్తి కావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ డి - సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్లు రాకుండా అడ్డుకునే ’విటమిన్-డి’ బంగాళదుంపలలో ఉంటుంది. - గుండె, నరాలు, దంతాలు, చర్మానికి ఈ విటమిన్ మేలు చేస్తుంది. ఐరన్... అమోఘం - శరీరంలో ముఖ్య విధులు నిర్వహించే ఐరన్‌కు బంగాళదుంపలలో కొదవలేదు. -
ఆరోగ్యమైనా, ఆనందమైనా మగాళ్లకే ఎక్కువ!
సర్వే స్త్రీలతో పోలిస్తే పురుషులు ఆరోగ్యం, ఆనందం విషయంలో మెరుగైన స్థానంలో ఉన్నారని ఒక కొత్త సర్వే చెబుతోంది. ఈ సర్వే ప్రకారం... మహిళలతో పోలిస్తే పురుషులు చాలా తక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 60 శాతం మంది పురుషులు నెలకు ఒకసారి మాత్రమే ఒత్తిడికి గురవుతున్నారు. 70 శాతం మంది పురుషులు తాము అరుదుగా మాత్రమే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నామనీ, మానసిక స్థితిలో మార్పుకు గురవుతామనీ చెప్పారు. మహిళలో మాత్రం సగం మంది కనీసం నెలకు ఒకసారి డిప్రెషన్ బారిన పడతామని చెప్పారు. మహిళలతో పోల్చితే తలనొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు పురుషులలో తక్కువగా ఉన్నాయి. మహిళల్లో సగం మందికి పైగా నెలలో చాలాసార్లు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ‘‘మహిళలు ఆరోగ్యస్పృహతో ఉంటారు అనేది ఒక సాధారణ అభిప్రాయం. కానీ, సర్వేను బట్టి చూస్తే, పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయం అర్థమవుతోంది. నిద్రలేమి, ఆందోళన, మానసిక, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇంగ్లండ్‌కు చెందిన న్యూట్రీషియన్ నిపుణులు పెట్రిక్ హోల్ఫోర్డ్.