breaking news
Nutrient Mixture
-
సూపర్ ఫుడ్ అవిసె గింజల్లోని పోషకాల గురించి తెలుసా?
అవిసె గింజలను సూపర్ ఫుడ్‌గా, ఫంక్షనల్ ఫుడ్‌గా చెబుతారు. అంటే.. ఈ గింజలు పోషకాహారంగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయన్న మాట. సాధారణ ధాన్యాలు కేవలం ఆకలిని తీర్చటానికే పరిమితమవుతాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ పశ్చిమబెంగాల్ బారక్‌పూర్‌లోని కేంద్రీయ జనపనార, ఇతర నార ఉత్పత్తుల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్) శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం అవిసె గింజల్లో పోషక, ఔషధ విలువలు ఇలా ఉన్నాయి: అవిసె గింజల్లో 35–43% కొవ్వు ఆమ్లాలు, 18–21% మాంసకృత్తులు, 25–28% డయటరీ ఫైబర్, 1–2% పిండిపదార్థాలు ఉంటాయి. ఒమెగా 3 కొవ్వు ఆమ్లం, ఎఎల్ఎ, లినోలీక్ ఆమ్లం(ఎల్ఎ), ఎసెన్షియల్ విటమిన్లు, అమినో ఆమ్లాలు, స్థూల–సూక్ష్మ మూలకాలు, లిగ్నాన్లు, ఫ్లావనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అత్యధిక మొత్తంలో పాఅన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (పీయూఎఫ్ఏలు), ముఖ్యంగా ఎఎల్ఎలు, ఉంటాయి కాబట్టి అవిసె గింజలు ఆరోగ్యదాయకమైన అనుబంధాహారంగా ప్రాచుర్యం ΄పొందాయి.. ఎఎల్ఎ, లిగ్నాన్లు పుష్కలంగా ఉండటం మూలంగా అవిసె గింజలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను, ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు కేన్సర్‌ను నిరోధిస్తాయి.మెనోసాజ్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మలబద్దకం, మానసిక అలసటను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. అవిసె గింజల పిండిని అనేక అనారోగ్యాలను తగ్గించడానికి అనాదిగా వాడుతున్నారు. అయితే, శ్యానోజెనిక్ గ్లైకోసైడ్స్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్, ఫైటిక్ ఆసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్లు ఉన్నప్పటికీ.. మొత్తంగా చూస్తే అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెరవేరతాయి. అందువల్లనే అవిసె గింజలు ఔషధగుణాలున్న పోషక గింజలుగా ప్రసిద్ధి పొందుతున్నాయి.అవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్‌ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయంసమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూ పొందించుకోవటం ముఖ్యం. రైతులు తొలిగా సాగు చేసిన పంటల్లో ఒకటైన అవిసెకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ గింజలతో వంట నూనె తయారు చేసుకోవచ్చు. ఔషధ గుణాలతో కూడిన ఆహారోత్పత్తులు చేసుకోవచ్చు. గానుగ పిండి పశుదాణాగా పనికొస్తుంది. కాండం పీచుతో వస్త్రాలను తయారు చేసుకోవచ్చు. ప్రపంచ అవిసె ఉత్పత్తి గతంలో కన్నా క్షీణించినప్పటికీ.. దీని సహజ ఆరోగ్యకర ఉత్పత్తుల ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై పెరిగిన అవగాహన వంటి కారణాల రీత్యా అవిసె పంట తిరిగి పుంజుకోవడానికి అవకాశాలున్నాయి. ఉన్నతమైన అవిసె వంగడాలను అభివృద్ధి చేయడానికి అధునాతన బయోటెక్నాలజీ పద్ధతులను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో అవిసె ‘అద్భుత పంట’గా తన ఖ్యాతిని మరింత మిన్నగా కొనసాగిస్తుందని ఆశిద్దాం.అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ 2021 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల డాలర్ల లిన్సీడ్ వాణిజ్యం జరిగింది. రష్యా, కెనడా, కజకిస్తాన్ ఎగుమతిలో ముందంజలో ఉన్నాయి. బెల్జియం, చైనా, అమెరికా ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. 2021లో మన దేశం 1.35 కోట్ల డాలర్ల అవిసె గింజలను ఎగుమతి చేసింది. ప్రపంచ మార్కెట్లో ఇది 1%. అదే సంవత్సరం 1.53 లక్షల డాలర్ల విలువైన అవిసె గింజలను విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. 2021లో 98.5 కోట్ల డాలర్ల ముడి అవిసె నార వాణిజ్యం జరిగింది. ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా, బెలారస్ ఎక్కువగా ఎగుమతి చేశాయి. చైనా, బెల్జియం, భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. చదవండి: లోకార్బ్ హై/హెల్దీ ఫ్యాట్ : అవిసె గింజలు అద్భుతఃఅవిసె నార ఉత్పత్తి కన్నా అవిసె గింజల ఉత్పత్తికి మన దేశ వాతావరణం అనుకూలమైనదని ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరప్ దేశాల నుంచి అవిసె గింజలను దిగుమతి చేసుకోవటం వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని మన దేశం నష్ట΄ోతోంది. ఓఈసీ గణాంకాల ప్రకారం భారత్ ఫ్లాక్స్ ఫైబర్ దిగుమతులు 2016లో 3.15 కోట్ల డాలర్ల నుంచి 2021 నాటికి 9.45 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఫ్లాక్స్ ఫైబర్‌ను మనం పండిస్తున్న దానికీ, మన అవసరాలకు పెద్ద అగాధం ఉంది. అంటే, ఫ్లాక్స్ ఫైబర్ సాగును దేశీయంగా పెంచుకోవటానికి గల అవకాశాలను ఇది సూచిస్తోంది. అయితే, గింజల కోసం ఒక పంట, నార కోసం మరో పంట కాకుండా.. రెండిటి కోసమూ ఒకే పంటను పండించుకుంటే ఈ కొరతను తీర్చుకోవటం వీలవుతుంది. భారతీయ పరిస్థితులకు తగిన మేలైన నార అవిసె రకాలను అభివృద్ధి చేసుకోవటం ద్వారా ఫ్లాక్స్ ఫైబర్ ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ సవాలును అధిగమించేందుకు అనువైన వంగడాలను 2015లోనే జెఆర్ఎఫ్–2 (తైర)ను ఐసీఏఆర్–సీఆర్ఐజేఏఎఫ్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. సాగు పెంచాలంటే చెయ్యాల్సిన మరో పని ఏమిటంటే.. మన దేశంలో వేడిగా, తేమగా ఉండే వాతావరణాల్లో చక్కగా పెరిగే అవిసె నార పంట సాగుకు అనువైన వంగడాలను రూపొందించుకోవటం ముఖ్యం. ఇదీ చదవండి: ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షిసాగుబడి డెస్క్ -
ఈ బియ్యం.. అమృతతుల్యం
పోషకాల మిశ్రమంతో బియ్యం ⇒ అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్‌వో సూచన ⇒ విటమిన్ల లోపంతో బాధపడే వారికోసం ఏర్పాట్లు ⇒ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టి ⇒ రాష్ట్రంలో 60 శాతం పిల్లల్లో ఐరన్ లోపమున్నట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: రక్తహీనత, డయేరియా, గుండె జబ్బులు, షుగర్ తదితర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఐరన్, విటమిన్లు, లవణాల లోపాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. పోషకాలు, లవణాలు, విటమిన్లు కలిగిన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. ఇటువంటి బియ్యాన్ని తయారుచేసి ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ప్రజలకు అందజేస్తే ఎలా ఉంటుందన్న దానిపై జాతీయ పోషకాహార సంస్థతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. 60 శాతం చిన్నారుల్లో రక్తహీనత... దేశంలో అత్యధికమంది బియ్యంతో తయారైన ఆహారాన్నే తీసుకుంటారు. దక్షిణ భారతంలో ఇదే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఐరన్ వంటివి ఉండటంలేదు. దీంతో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు పోషకాల లోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు. 2015–16 జాతీయ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 6 నుంచి 59 నెలల పిల్లల్లో 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15–49 ఏళ్ల మహిళల్లో 56.9 శాతం మంది, అదే వయస్సు గల గర్భిణీల్లో 49.8 శాతం మంది, అదే వయస్సులోని 15.4 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరంతా ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 25 శాతం మంది పోషకాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాలు లేకపోవడంతో అనేకమంది రక్తహీనత, డయేరియా, అధిక బరువు, ఎముకల జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రధానంగా పేదల్లో ఉండటం గమనార్హం. పోషకాలతో బియ్యాన్ని ఎలా తయారుచేస్తారంటే..? బియ్యంతో తయారైన అన్నం బదులు ఇతరత్రా ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల మిశ్రమంతో బియ్యాన్ని తయారు చేయాలనేది డబ్ల్యూహెచ్‌వో సూచన. నిర్ణీత నిష్పత్తిలో ఐరన్, అయోడిన్, జింక్, ఫోలిక్ యాసిడ్, బీ1, బీ2, బీ6, బీ12, నియాసిన్ వంటి నీటిలో కరిగే విటమిన్లు సహా ఏ, డీ వంటి కొవ్వులో కరిగే విటమిన్లతో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని తయారు చేస్తారు. అలాగే బియ్యాన్ని దంచి, అందులో ఈ పోషకాల మిశ్రమాన్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వండడానికి అనువు గా తిరిగి బియ్యంగా తయారుచేస్తారు. ఈ బియ్యంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఈ బియ్యంతో పోషక లోపం నివారించవచ్చు ‘పోషకాహార బియ్యాన్ని ప్రజలకు అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఆయా దేశాలకు సూచించింది. ముఖ్యంగా విటమిన్లు, ఐరన్ వంటి లోపంతో బాధపడే పిల్లలు, పెద్దలకు ఇవి అందజేయాలి. దీనిపై జాతీయ పోషకాహార సంస్థ కూడా దృష్టిసారించింది. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదలకు అందజేస్తే పోషకాహార లోపాన్ని సరిదిద్దవచ్చు.’ –డాక్టర్ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్