breaking news
Nurological problem
-
హీరో సల్మాన్‌ఖాన్ సైతం అల్లాడిపోయాడు ఆ వ్యాధితో..!
ఇదో నరాలకు సంబంధించిన సమస్య. బాలివుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఈ సమస్యతో బాధపడటంతో ఇటీవల ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది. నరం తాలూకు సమస్య కావడంతో ఒకేచోట మాటిమాటికీ షాక్ తగులుతున్నట్టు, కనిపించని పదునైన కత్తితో పదే పదే పొడుస్తున్నట్టు బాధించే సమస్య ఇది. తానెదుర్కొన్న ఇతర వైద్య సమస్యలైన బ్రెయిన్ అన్యురిజమ్స్, ఆర్టీరియో వీనస్ మాల్ఫార్మేషన్ల గురించి చెబుతూనే... తన ఇతర సమస్యలతో పోల్చినప్పుడు ‘‘ట్రైజెమినల్ న్యూరాల్జియా అనేది మనిషి అనుభవించే నొప్పులలో అత్యంత చెత్త నొప్పి’’ అంటూ తన బాధను వెల్లడించాడు. మొదట 2007లో ఆ తర్వాత 2011లో ఈ సమస్యతో సతమతమైన అతడు ఇటీవల మళ్లీ తాజాగా ఈ సమస్య తనను బాధించినట్లు వార్తలు వెలువడ్డాయి. మొదట కాస్త అరుదైనదిగా పరిగణించే ఈ వ్యాధి తాలూకు కేసులు మునపటితో పోలిస్తే ఇటీవల కాస్త ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ‘ట్రైజెమినల్ న్యూరాల్జియా – (టీఎన్)’ గురించి తెలుసుకుందాం...మొదట్లో ట్రైజెమినల్ న్యూరాల్జియా బాధ చెంప భాగంలో నొప్పితో మొదలవుతుంది. కొన్ని సెకన్ల పాటు భయంకరంగా వచ్చే ఈ వ్యాధి కొన్ని సెకన్లు మొదలుకొని రెండు నుంచి కొన్ని నిమిషాలు బాధిస్తూ ఉంటుంది. ఓ పదునైన కత్తితో పొడుస్తున్నట్లు, భయంకరంగా షాక్ కొడుతున్నట్టు వచ్చే ఈ వ్యాధిలో... సమయం గడుస్తున్న కొద్దీ బాధించే వ్యవధి పెరుగుతూ పోతూ చాలా భరించలేనంత వేదనాభరితంగా ఉంటుంది. రోజులో 10 నుంచి 15 సార్లవరకూ రావచ్చు. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు, చల్లటి నీళ్లు తాగేటప్పుడు చాలా బాధాకరమైన రీతిలో బాధిస్తుంటుంది. ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే... మన దేహంలో మెదడు నుంచి వెన్నుపాము నుంచి అన్ని శరీర భాగాలకు నరాలు ఒక నెట్వర్క్లా వ్యాపించి ఉంటాయి. ఈ నరాల ద్వారానే మెదడు తన అన్ని శరీర భాగాలను నియంత్రిస్తుంటుంది. ముఖాన్నీ, ముఖ భాగాలను నియంత్రించే నరాన్ని ‘ట్రైజెమినల్ నర్వ్’ అంటారు. ఈ నరం నుంచి వచ్చే నొప్పిని ‘ట్రైజెమినల్ న్యూరాల్జియా’ అంటారు. మెదడులోని బ్రెయిన్ స్టెమ్ నుంచి వచ్చే ఈ నరం లోపలి చెవి (ఆడిటరీ కెనాల్) పక్క నుంచి వచ్చి ముఖంలోని చెంప దగ్గర మూడు భాగాలుగా విడిపోతుంది. ఎందుకీ నొప్పి..? కొందరిలో ట్రైజెమినల్ నరం పక్కన ఉండే రక్తనాళం మెలిదిరగడంతో అది ‘డీమైలినేషన్’ అనే ప్రక్రియకు గురవుతుంది. ప్రతి నరం చుట్టూతా ఉండే మైలిన్ అనే పొర దెబ్బతినడాన్ని్న డీమైలినేషన్ అంటారు. దాంతో నరం వాచి, ఈ సమస్య వస్తుంది. కొందరిలో హెర్పిస్ సింప్లెక్స్ అనే వైరస్ కారణంగా కూడా నొప్పి వస్తుంది. ఈ వైరస్ నరం లోపల ఉన్న గాసేరియన్ గాంగ్లియాన్ అనే భాగంలో ఈ వైరస్ నిద్రాణంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ వైరస్ ఉత్తేజితం కావడంతో ఈ నొప్పి తీవ్రతరమవుతుంది. చికిత్స... దాదాపు 90 శాతం కేసుల్లో మందులతో ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే పది శాతం మందిలో నొప్పి తగ్గిన తర్వాత కూడా మళ్లీ నొప్పి తిరగబెట్టేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు వాడుకలో ఉన్న మందులు (ముఖ్యంగా కార్బమాజిపిన్, ఆక్స్కార్టమాజిపిన్, అమైట్రిప్టలిన్, గాబాపెంటిన్, ప్రిగాబాలిన్, బాక్లోఫిన్, వాల్‌ప్రోయేట్ వంటి మందులను) సరైన మోతాదులో వాడటం వల్ల దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు.చికిత్స సాధారణంగా కార్బమాజెపైన్ వంటి యాంటీకన్వల్సెంట్ మందులతో మొదలవుతుంది. మందులు పనిచేయకపోతే లేదా వాటితో తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. మైక్రోవాస్క్యులర్ డీకంప్రెషన్ అనే పిలిచే ఈ శస్త్రచికిత్సలో నరానికి వెళ్లే రక్తనాళాన్ని మెలితిప్పి వదిలేస్తారు. ఫలితంగా చాలాకాలం పాటు ఉపశమనం పొందవచ్చు. రిస్క్ తక్కువగా ఉండే రైజాటమీ, లేదా స్టీరియో టాక్టిక్ రేడియోసర్జరీ వంటి చికిత్సల్లో నర్వ్ ఫైబర్లను అడ్డుకుని తద్వారా నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. చివరగా... ట్రెజెమినల్ న్యూరాల్జియా నొప్పి కారణంగా జీవిత నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) చాలా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ నొప్పిని తట్టుకోలేక డిప్రెషన్‌కు లోనయ్యే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఆ వ్యక్తికి సంబంధించిన తీవ్రత... మందులతో కలిగే ఉపశమనం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత చికిత్స ప్రణాళికతో చికిత్స అందించాల్సిన అవసరముంటుంది.ట్రైజెమినల్ న్యూరాల్జియాలాగే అనిపించే ఇతర జబ్బులుట్రైజెమినల్ ఆటోనామిక్ సెఫాలాల్జియా : ఇది ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంటుంది. కన్ను చుట్టూ ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా. కంట్లో నీళ్లు వస్తుంటాయి. ముక్కు తడి అవుతుంది. నొప్పి చాలామట్టుకు ట్రైజెమినల్ న్యూరాల్జియా లాగే ఉండటంతో ఒక్కోసారి అదే అనుకుని పొరబడే అవకాశాలెక్కువ. గ్లాసోఫ్యారింజియల్ న్యూరాల్జియా : ఈ కండిషన్లో ముఖంలో కంటే మెడ పక్క భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. గుటక వేసేప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. పోస్ట్ హెర్పెటిక్ ట్రైజెమినల్ న్యూరాల్జియా : మొదట ముఖ మీద నీటి పొక్కులాంటివి వచ్చి, అవి ఎండిపోయాక నల్లటి మచ్చలుగా తయారవుతాయి. అవి తగ్గిపోయిన వారం రోజుల తర్వాత విపరీతమైన నొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా 50 ఏళ్లు దాటినవారిలో కనిపిస్తుంది. డెంటల్ కేరిస్ : పళ్లు పుచ్చినప్పుడు గాని, పంటి చుట్టూ ఉండే చిగురుకు గాని ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముఖంలో నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి ట్రైజెమినల్ న్యూరాల్జియాలా కేవలం కొద్ది సెకన్ల పాటే ఉండకుండా రోజంతా ఉంటుంది ∙ప్రమాదవశాత్తు ముఖానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడుగాని, ముఖంలోని ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడుగాని... గాయాలు మానిన తర్వాత ముఖంలో నొప్పి రావచ్చు. గ్లకోమా : కంటికి సంబంధించిన రుగ్మత అయిన గ్లకోమాలో కంటిలోపలి ద్రవపు ఒత్తిడి లెన్స్‌పై పడినప్పుడూ ముఖంలో నొప్పి వస్తుంది.లక్షణాలు... ఇది మొహానికి ఒకవైపే వస్తుంది. ఎక్కువగా చెంప/దవడ భాగంలో వస్తుంది ∙కొన్నిసార్లు కంటి చుట్టూ వస్తుంది ∙నొప్పి చాలా తీవ్రంగా కత్తితో పొడిచినట్లుగా రావడంతో దీన్ని ‘స్టాబింగ్ పెయిన్’ అని అంటారు ఈ నొప్పి కొద్ది సెకన్లు మొదలుకొని ఒకటి రెండు నిమిషాల పాటు రావచ్చు రోజులో ఐదు మొదలుకొని 15 లేదా 20 సార్లు రావచ్చు ∙తినేటప్పుడు, నమిలేసమయంలో, మాట్లాడేటప్పుడు ఇది తీవ్రమవుతుంది ∙ఒక్కోసారి ఈ నొప్పి వచ్చినప్పుడు నోటి నుంచి కొద్దిగా లాలాజలం స్రవించవచ్చు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. (అంటే... మహిళలు, పురుషుల్లో 60 : 40 నిష్పత్తిలో కనిపిస్తుంది) ముప్పయి ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్ జి. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ –స్ట్రోక్ ఇంటర్వెన్షనిస్ట్ (చదవండి: కపిల్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్..?) -
అదేపనిగా ఫోన్ వాడితే.. దానికి సమానమట
న్యూయార్క్ : మీరు స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నట్లయితే ఇది చదవాల్సిందే. ఓ రకంగా ఇంటర్నెట్ ప్రపంచాన్ని చిన్నదిగా మార్చివేసింది.. చిన్నా..పెద్దా అందరూ స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్న వైనాన్ని చూస్తున్నాం.. ఒక రకంగా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ వినియోగం మనుషుల మధ్య మాటల్ని మాయం చేస్తోంది.. అనుబంధాల మధ్య గోడలు కట్టేస్తోంది. స్మార్ట్‌ఫోన్ మోజులో యూజర్లు సోషల్ సైట్లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారట. ఇది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను న్యూరోరెగ్యులేషన్ జర్నల్ ప్రచురించింది. ఇందుకోసం సోషల్ మీడియాకు అడిక్ట్ అయిన 135మందిని ఎంచుకొని వారి మానసిక పరిస్థితిపై అధ్యాయనం చేశారు. ఇందులో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. అవసరం కోసం కొద్ది సమయం స్మార్ట్‌ఫోన్‌పై వెచ్చించడం పెద్ద ముప్పు కాకపోవచ్చు కానీ, మరీ ఎక్కువ సమయం అదే పనిగా వాటిపై దృష్టి కేంద్రీకరించడం మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వారి ఆలోచన పరిధి తగ్గడమే కాకుండా, పెయిన్ కిల్లర్‌కు బానిసగా మారడంతో సమానమని తెలిపింది. స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వినియోగించేవారిలో ఆత్రుత, ఒంటరితనం, ఒత్తిడి పెరుగుతుందని.. ఇది దీర్ఘకాలంలో మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రిపోర్ట్ చేసింది. ఒక పనిచేసేటప్పుడు మానవ మెదడులోని ఒక భాగం యాక్టివ్‌గానూ , మరోభాగం విశ్రాంతి తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది వేరొక పనిచేస్తూ కూడా స్మార్ట్ఫోన్లు వాడటం మెదడును ఒత్తిడికి గురిచేస్తుంది. సహజ సిద్ధంగా ఉన్న వ్యవహారశైలితోపాటు, చాలా విషయాల్లో వారికి తెలియకుండానే మార్పులు చోటుచేసుకుంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో నిరంతరం నెట్ అన్లో ఉండటం వల్ల రేడియేషన్ సమస్యలు కూడా ఎదురవుతాయని ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. -
బాధించే నడుమునొప్పి
నడుమునొప్పి గురించి విననివారు, దీనిబారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3 మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలో ఈ నొప్పితో ఎక్కువగా బాధపడతారు. వారి జీవన విధానం, ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇంటి పనులు తీవ్రతను పెంచుతారు. డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఈ బాధ బారిన పడేవారు ఒకరు తప్ప ఉంటారు. పనిచేయలేకపోవటం, విశ్రాంతి దీనికి అవసరం అవటంవలన వారు సెలవు దీనివలన తీసుకుంటారు. అధికంగా పని దినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణములు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వ సాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్ (Facet Synovial Cyst) నడుమునొప్పికి కారణాలు అనేకం. శరీరశ్రమ, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం దీనిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్ Systemic Disease, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా Nurological problem న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ వలన. సామాన్యంగా పది మంది నొప్పులతో బాధపడేవారిలో, ఆరుగురు నడుమునొప్పి బాధ ఉన్నవారే. సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూ వీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూర్చునే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి, అందరినీ బాధించే నొప్పి నడుమునొప్పి. వివిధ కారణాలు: స్వల్పకాలిక నొిప్పి: కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూసవాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసటతో పనిచేయడం, బరువులు ఎత్తుట... ఇటువంటి సమయాలలో నొప్పి ఆకస్మాత్తుగా తీవ్రం గా పొడిచినట్లుగా ఉంటుంది. కదలికలలో నిర్బంధం, ఫ్రీగా తిరగలేరు, కండరాలు పట్టివేసినట్లుండటం, నిటారుగా నిలబడలేరు, చక్కగాపడుకోలేరు. దీర్ఘకాలిక నొప్పి : మూడు నెలల కంటే ఎక్కువైనచో కారణాలు వేరుగా ఉంటాయి. వివిధ రకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు. డిస్క్ (వెన్నుపూస) సమస్యలు డిస్క్ హెర్వియేషన్ డిస్క్‌బల్జ్ (వాపు) డిస్క్ ప్రొలాప్స్ (ప్రక్కకు జరుగుట) నర్వ్ కంప్రెషన్ కెనాల్ నారోయింగ్ డిస్క్ లైసిస్ డిస్క్ ట్రోమ డిస్క్ ఫ్యాక్టర్స్ డిస్క్ సిండ్రోమ్స్ స్పైనల్ టీబీ ఆస్టియో పొరోసిస్ డిస్క్ వాపు, ఆర్ట్రైటిస్ డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగుట వంటివాటికి కలిగే బాధలు: వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అపుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు, మెడనొప్పి, భుజములు, చేతులు, తిమ్మిరి, మొద్దు బారిపోవుట, కండరాల పట్టు తగ్గుట, వణుకుట చూస్తాం. రోగ నిర్ధారణ: ఎక్స్-రే ఎమ్ఆర్ఐ సీటీ స్కాన్ వాడదగిన హోమియో మందులు రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధం (స్టిఫ్నెస్) చల్ల గాలి, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు. తార్నికం: గాయాలు, బెణుకుట వలన కలిగే నొప్పి,జ్వరం, కీళ్ళ నొప్పులు, వాపు, నడకతో పెరిగే నొప్పులు. సిమిసిపూగ: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళవాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి వేడి పడదు, నడకతో పెరిగే నొప్పి. అకొటైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాలసంబంధ నొప్పులు. బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం, కండరాలు పట్టి వేయుట, స్పాజెర్స్. హోమియో చికిత్స హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరముల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడినది. నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ కారణం రోగ లక్షణములను, మూలకారణములు వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109