breaking news
NTR Jr
-
హాలీవుడ్ రేంజ్లో...
యాక్షన్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌ను ఆరంభించనున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా సెట్స్‌లోకి ఎన్టీఆర్ రానుండటం ఇదే తొలిసారి. కాగా ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తారని సమాచారం. అంతే కాదు... ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని ముప్పై రోజులకు పైగానే తీస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి... ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఏ లెవల్లో ఉంటుందో తెరపై చూడాలంటే చాలా సమయం ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్. -
RRR కారణంగా తారక్ సినిమా చరణ్ చేస్తున్నాడా...
-
స్పీడ్ పెంచిన తారక్.. ఇక బాక్సాఫీస్ బద్దలే..
-
'జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని...'
టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో డేటింగ్ చేయమని హైదరాబాద్ కు చెందిన తన స్నేహితురాలు సలహా ఇచ్చిందని బాలీవుడ్ తార ఆలియా భట్ వెల్లడించింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు వివాహమైనందున.. తాను డేటింగ్ చేయలేనని ఆలియా తెలిపింది. త్వరలో విడుదల కాబోతున్న 'హంప్టీ శర్మ కి దుల్హనియా' చిత్ర ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఆలియా భట్ జూన్ 26 హైదరాబాద్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగులో నటించాలని ఉందని తన మనసులోని కోరికను బయటకు చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ తో జత కడితే తమ జంట బాగుంటుందన్నారు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ తో ఓ చిత్రం చేయాలని ఉందన్నారు.