breaking news
Nobel Economics Prize
-
Nobel Prize 2025: నామినేటెడ్ పేర్లు .. 50 ఏళ్లగా ఎందుకంత సీక్రెట్?
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించే వారం దగ్గరపడింది. ఈ సోమవారం అంటే అక్టోబరు 6 నుంచి అక్టోబరు 13 వరకు విజేతల ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించేవారిని నోబెల్ బహుమతులతో సత్కరించనున్నారు.జ్యూరీ అనుసరించే విధానంనోబెల్ బహుమతుల ఎంపిక ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అవార్డుల విజేతలను జ్యూరీ అత్యంత రహస్యంగా ఎంపిక చేస్తుంది. గోప్యత అనేది విజేతల ఎంపికలో తప్పనిసరి విధానం. ఇది నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. నామినీలు, నామినేటర్ల గుర్తింపులను గత 50 ఏళ్లగా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి విధానం బాహ్య ఒత్తిళ్లు, ఊహాగానాలను నివారిస్తుంది. అవార్డుల గొప్పతనాన్ని కాపాడుతూ, విజేతలు ఎవరనే ఉత్కంఠను కొనసాగిస్తుంది. ప్రముఖ ప్రొఫెసర్లు, మునుపటి అవార్డు గ్రహీతలు, ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, శాంతి పరిశోధన సంస్థల డైరెక్టర్లు.. నోబెల్ బహుమతులకు అర్హులైవారిని నామినేట్ చేస్తారు. స్వీయ నామినేషన్లకు అవకాశం ఉండదు.శాంతి బహుమతి విభాగంలో..నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి వర్గానికి లేదా విభాగానికి చెందిన నిపుణుల కమిటీలు నామినేషన్లను సమీక్షిస్తాయి. ఈ కమిటీలు నివేదికలను సిద్ధం చేస్తాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న బహుమతి ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉన్నారా? లేదా అనే దానిపై చర్చలు జరుగుతాయి. నోబెల్ శాంతి బహుమతి విభాగంలో నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’ ఎంపికకు సారధ్యం వహిస్తుంది. వారు తమకు అందిన నామినీల నుండి ఒక షార్ట్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటారు. తుది నిర్ణయాన్ని సాధారణంగా ఏకాభిప్రాయం మేరకు తీసుకుంటారు. అక్టోబర్‌లో అధికారిక ప్రకటనకు ముందు ఈ తతంగమంతా జరుగుతుంది.ఎంపిక ప్రక్రియలో వీటికి తావుండదుసాహిత్యంలో నోబెల్ బహుమతి విషయానికొస్తే స్వీడిష్ అకాడమీ సభ్యులు నామినేటెడ్ అభ్యర్థులను రచనలను రహస్యంగా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యుల మెజారిటీ మద్దతును అందుకున్నవారే తుది అర్హత సాధిస్తారు. గోప్యతా నియమం అన్ని బహుమతి విభాగాలకు వర్తిస్తుంది. లాబీయింగ్, మీడియా హైప్, రాజకీయ జోక్యం మొదలైనవాటికి ఎంపిక ప్రక్రియలో తావుండదు. కఠినమైన గోప్యత, నిపుణుల నిర్ణయం, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే నోబెల్ బహుమతులకు అత్యంత అర్హులైనవారిని ఎంపిక చేస్తారు. -
అమెరికా ద్వయానికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోం: 2018 ఏడాదికి నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతి అమెరికా ఆర్థిక వేత్తలు విలియం నోర్ధాస్, పాల్ రోమర్లకు దక్కింది. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దీర్ఘకాలిక సుస్థిర వృద్ధి వంటి ప్రస్తుత కాలపు పలు ప్రాథమిక సవాళ్లకు వీరిద్దరూ పరిష్కారం చూపారు. ప్రకృతి కారణంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమవుతుందో నిర్మాణాత్మక నమూనాల ద్వారా వివరించి ఆర్థిక విశ్లేషణల విస్తృతిని బాగా పెంచారు’ అని అకాడమీ ప్రకటనలో వివరించింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు. నోర్ధాస్ (77) యేల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉండగా, రోమర్ (62) న్యూయార్క్ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేస్తున్నారు. రోమర్ గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. దీర్ఘకాలిక స్థూల ఆర్థిక విశ్లేషణలకు వాతావరణ మార్పులను జోడించినందుకు నోర్ధాస్కు, సాంకేతిక సృజనాత్మకతను జోడించినందుకు రోమర్‌కు ఈ బహుమతులు ప్రదానం చేశామని అకాడమీ తెలిపింది. వాతావరణ కల్లోల పరిస్థితులను ప్రపంచం ఎదుర్కొనేందుకు సమాజంలో గొప్ప పరివర్తనం రావాల్సి ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో పేర్కొన్న అనంతరం నోర్ధాస్, రోమర్లకు అవార్డు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నోబెల్ బహుమతి ప్రకటన అనంతరం రోమర్ అకాడమీతో ఫోన్లో మాట్లాడుతూ ప్రపంచం కర్బన ఉద్గారాలను తగ్గించుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రపంచ దేశాలపై కర్బన పన్నులను విధించడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని నోర్ధాస్ తన పరిశోధనలతో రుజువు చేశారు. ముగిసిన నోబెల్ బహుమతుల ప్రకటన ఆర్థిక శాస్త్ర బహుమతి ప్రకటనతో ఈ ఏడాది అన్ని నోబెల్ పురస్కారాల విజేతల పేర్లు ప్రకటించడం పూర్తయినట్లయింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య, శాంతి బహుమతులను ప్రకటించగా, సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం తెలిసిందే. అకా డమీ మాజీ సభ్యురాలి భర్తపై వచ్చిన అత్యాచారం ఆరోపణలు రుజువుకావడంతో ఈ ఏడాది సాహిత్య బహుమతిని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్, డెనిస్ ముక్వెగె, భౌతిక శాస్త్ర బహుమతికి ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరూ, డొనా స్ట్రిక్లాండ్, వైద్య శాస్త్ర బహుమతికి జేమ్స్ అలిసన్, తసుకు హొంజో, రసాయన శాస్త్ర బహుమతికి ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగ్ వింటర్‌లను విజేతలుగా ఇప్పటికే ప్రకటించారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు నోబెల్ బహుమతులను అందజేస్తారు. -
కాంట్రాక్ట్ థియరీలో ఇద్దరికి ఆర్థిక నోబెల్
స్టాక్‌హోమ్: ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో బ్రిటీష్ అమెరికన్ ఆర్థిక వేత్త ఒలివర్ హార్ట్, ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఆర్థిక వేత్త బెంట్ హోల్మ్ స్ట్రామ్లకు నోబెల్ బహుమతి దక్కింది. వారిద్దరు కాంట్రాక్ట్ థియరీ విభాగంలో చేసిన విశేష కృషిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎంపిక జ్యూరీ తెలిపింది. వీరిద్దరు 9,24,000 డాలర్లను చెరి సమానంగా పంచుకోనున్నారు. గత ఏడాది ఈ అవార్డు పేదరికంపై పరిశోధన చేసిన అమెరికన్ బ్రిటష్ పౌరుడు ఆంగస్ డెటన్కు దక్కింది. వినియోగం, పేదరికం, సంక్షేమం వంటిని అనేక అంశాలపై విశ్లేషణ చేసినందుకు ఈ అవార్డును ఇచ్చారు.