breaking news
newly married lady
-
కన్న తండ్రి చేతిలో నవవధువు దారుణ హత్య
-
నవ వధువు ఆత్మహత్య
-
పరీక్ష కోసం వెళ్తూ నవవధువు మృతి
అనంతగిరి: విశాఖపట్టణం జిల్లా అనంతగిరి శివారులో శనివారం ఉదయం లారీ బోల్తాపడి నవ వధువు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతగికిరికి చెందిన నిత్య(21)కు వారం రోజుల కిందటే వివాహం అయింది. వైజాగ్లో శనివారం ఉదయం 10 గంటలకు పరీక్ష ఉండగా రాసేందుకు మామతో పాటు బయలుదేరింది. బస్సులు లేకపోవడంతో వైజాగ్ వెళ్లే లారీ ఎక్కారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత లారీ ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో నిత్య అక్కడికక్కడే మృతిచెందగా ఆమె మామకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరారయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.