-
విలియమ్సన్ శతకం వృథా
వెల్లింగ్టన్: కఠినమైన పిచ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (143 బంతుల్లో 112 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించినా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో తుది వరకు పోరాడినా చివరకు కివీస్‌కు ఓటమి తప్పలేదు. శనివారం ఇక్కడి వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, బెన్ స్టోక్స్ (39; 2 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఇష్ సోధికి 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేయగలిగింది. మున్రో (49; 7 ఫోర్లు), సాన్‌ట్నర్ (41; 3 ఫోర్లు) రాణించారు. ఒక దశలో 80/1 పటిష్టంగా ఉన్న కివీస్...ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ అలీ (3/36), ఆదిల్ రషీద్ (2/34) ధాటికి 23 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో విలియమ్సన్, సాన్‌ట్నర్ ఏడో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా నడిపించారు. అయితే వోక్స్ ఫాలోత్రూలో దురుదృష్టవశాత్తూ సాన్‌ట్నర్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వోక్స్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా... విలియమ్సన్ తొలి నాలుగు బంతుల్లో భారీ సిక్సర్ సహా 10 పరుగులు రాబట్టాడు. ఈ స్థితిలో ఒత్తిడిని అధిగమిస్తూ చక్కగా బౌలింగ్ చేసిన వోక్స్ ఆఖరి రెండు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేశాడు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే బుధవారం డ్యునెడిన్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో 11వ సెంచరీ సాధించిన విలియమ్సన్ వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
విరాట్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో కేన్ విలియమ్సన్కు సొగసైన ఆటగాడిగా పేరుంది. అయినా కూడా భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతీరుపై ఈ కివీస్ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌ను చూస్తూ ఎంతో నేర్చుకోవచ్చని కొనియాడాడు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ఆధిపత్యం ఎంతో ప్రత్యేకమైంది. అది నన్ను చాలా ప్రభావితుడ్ని చేస్తోంది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంటుంది. అలాంటి ఆటగాడి నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు’ అని ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో మూడో స్థానంలో ఉన్న విలియమ్సన్ చెప్పాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, రూట్లను బిగ్ ఫోర్‌గా పరిగణిస్తున్నారు. ‘స్మిత్, రూట్ కూడా నాణ్యమైన ఆటగాళ్లే. మా అందరికీ విభిన్న శైలి ఉంది. ఎవరి సొంత శైలిని బట్టి వారు ఆడడం ఈ గేమ్‌కున్న గొప్ప అందం. అందుకే అందరికీ విజయాలున్నారుు’ అని 26 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ అన్నాడు. ఇక భారత్‌తో జరగబోయే సిరీస్‌లో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని అంగీకరించాడు. తమ జట్టులోనూ ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని అతడు గుర్తుచేశాడు. స్పిన్‌తో పాటు రివర్స్ స్వింగ్ కూడా భారత్‌తో టెస్టు సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తుందని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో ఈ నెల 22 నుంచి జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్ చేరుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement