breaking news
new information
-
ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..!
ఉరుకులు పరుగులుగా సాగుతున్న ఈ జీవితంలో ఎన్నో కొత్త విషయాలు, విశేషాలు మనకు ఎదురుపడుతుంటాయి. అవి ఆశ్యర్యాలను కలిగిస్తుంటాయి. మీరెప్పుడైనా ఇలాంటి పదాలు గానీ, విషయాల గురించి గానీ విన్నారా..! మరి ఆలస్యం ఎందుకు? అవేంటో తెలుసుకుందాం. అవును..ఇది నిజమే.. పోలిస్’ ఫుల్‌ఫామ్.. పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్ కళ్లు మూసుకున్నప్పుడు మనకు కనిపించే రంగును ‘ఐగన్గ్రావ్’ అంటారు. ఇది నలుపురంగుకు భిన్నమైనది. థాయ్‌లాండ్ జాతీయ గ్రంథం రామకియన్. దీని అర్థం రామ మహిమ. ఆస్కార్ గెలుచుకున్న తొలి నాన్ హ్యూమన్ మిక్కీ మౌస్ యానిమేటెడ్ మిక్కీ మౌస్. ఏప్రిల్ 18,1930లో బీబీసి రేడియో ‘నో న్యూస్ టుడే’ అని ప్రకటించి న్యూస్‌కు బదులుగా పియానో మ్యూజిక్‌ను ప్రసారం చేసింది. ఇంగ్లీష్ ఇడియమ్స్.. మోర్ దేన్ మీట్స్ ది ఐ ‘అనుకున్నంత సులభం కాదు’ అనుకున్నప్పుడు, ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉండడం.. మొదలైన సందర్భాలలో వాడే మాట... మోర్ దేన్ మీట్స్ ది ఐ. ఉదా: ఐ హ్యాడ్ డన్ సమ్ రిసెర్చ్. బట్ దేర్ ఈజ్ మోర్ టు ది సబ్జెక్ట్ దెన్ మీట్స్ ది ఐ టర్న్ ది క్లాక్ బ్యాక్ పూర్వస్థితికి తీసుకురావడం, గతంలోకి వెళ్లడం, వోల్డ్–ఫ్యాషన్ ఐడియాలు.. మొదలైన సందర్భాలలో వాడే మాట.. టర్న్ ది క్లాక్ బ్యాక్. ఉదా: ది కోర్ట్స్ డెసిషన్ ఇన్ దిస్ కేస్ విల్ టర్న్ ది క్లాక్ బ్యాక్ ఇవి చదవండి: Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది.. -
చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం
-
పఠాన్‌కోట్ దాడి కేసులో పాక్‌కు షాక్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి తమకు సంబంధం లేదని బీరాలు పోయిన పాకిస్థాన్ మరోసారి ఇరుకున పడింది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తుండగా ఆ విచారణకు అమెరికా మరింత బలాన్ని చేకూర్చింది. పఠాన్ కోట్ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని నిరూపించేలా ఉన్న ఆధారాలను అమెరికా అధికారులు ఎన్ఐఏకు అప్పగించారు. దాడికి పాల్పడిన వారు ఉపయోగించిన ఫేస్ బుక్ ఖాతాల ఐపీ అడ్రస్‌లు పాకిస్థాన్‌లోనే ఉన్నట్లు గుర్తించి వాటి ఆధారాలను ఎన్ఐకు ఇచ్చారు. అంతేకాదు.. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న అల్ రహ్మత్ ట్రస్ట్ ఐపీ అడ్రస్ కూడా పాక్ లోనే ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రకారం దాడి జరిగే సమయంలో అల్ రహ్మత్ వెబ్ పేజీ ని రంగనూర్ డాట్ కామ్ అనే సైట్ లో, అల్కాలంఆన్ లైన్ డాట్ కామ్ అనే మరో సైట్లో అప్ లోడ్ చేశారు. ఈ రెండింటికి కూడా తారిక్ సిద్దిఖీ ఒకే ఈమెయిల్ ఉపయోగించారని, మొత్తానికి దాడి సమయంలో ఉపయోగించిన ఈ ఐపీ అడ్రెస్ లు పాకిస్థాన్‌లో ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొంటూ అమెరికా భారత ఎన్ఐఏ అధికారులకు అధారాలు సమర్పించారు.