breaking news
never seen pics
-
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
-
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అల్ కాయిదా దాడి జరిగి ఇప్పటికి దాదాపు 16 ఏళ్లయింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ కాయిదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్‌ను ఢీకొన్న ఈ ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. పెంటగాన్ ప్రధాన కార్యాలయం కూడా దారుణంగా దెబ్బతిన్న ఈ ఘటనకు సంబంధించి, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అరుదైన ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా ఈ ప్రమాదాన్ని చూసినవాళ్లు ఎలా స్పందించారు, నష్టం ఎలా సంభవించిందనే విషయాలను ఈ ఫొటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కుప్పకూలిపోయిన గోడలు, చెలరేగుతున్న మంటలు, విమాన శకలాలు.. ఇలా రకరకాల ఫొటోలు కూడా వ ఈటిలో ఉన్నాయి. అల్ కాయిదా మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేసి, ఈ దాడులకు ఉపయోగించింది. పెంటగాన్‌ను ఒకటి ఢీకొనగా, మరో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడికి ఉపయోగించారు. నాలుగో విమానంలో ప్రయాణికులు హైజాకర్ల మీద తిరగబడగా.. వాళ్లు దాన్ని పెన్సల్వేనియా సమీపంలో ఒక పొలంలో కూల్చేశారు. కొన్ని ఫొటోలలో గ్యాస్ మాస్కులు ధరించిన గార్డులు ఒక కుక్క పిల్లను శిథిలాల నుంచి రక్షించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది మరణించారు. ఎక్కువమంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. -
ఆమెను ఇలా చూశారా!
బాలీవుడ్లో ఎన్నో గ్లామరస్ పాత్రల్లో నటించి అలరించిన దీపికా పదుకొనే తన కొత్త సినిమాలో వినూత్న పాత్ర పోషించబోతున్నది. ప్రఖ్యాత ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిద్ స్వయంగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె డీగ్లామరస్ పాత్ర చేయబోతున్నది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలోని ధోబీఘాట్లలో జరిగింది. ఈ సందర్భంగా మేకప్ లేకుండా నిరుపేదగా కనిపించిన దీపిక ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్లో ‘బాజీరావు మస్తానీ’ వంటి వరుస హిట్ సినిమాలను అందించిన దీపిక త్వరలో హాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి హాలీవుడ్ సినిమా ‘ట్రిపుల్ ఎక్స్: ద రిటర్న్ ఆఫ్ జాండర్ కేగ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ‘చిల్డ్రన్ ఆప్ హేవెన్’, ‘ద కలర్ ఆఫ్ ప్యారడైజ్’, ‘మహమ్మద్’ వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన మజిద్ భారత్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టులో దీపిక కీలకమైన పాత్ర పోషిస్తున్నది.