breaking news
neredmet police
-
వింత ఘటన: పెంపుడు పిల్లిని దొంగిలించి.. తిన్న ముగ్గురు వ్యక్తులు..
సాక్షి, అల్వాల్: పెంపుడు పిల్లిని దొంగిలించి..కోసుకుని తిన్న ముగ్గురు నిందితులను నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ జీకే కాలనీలో నివాసం ఉండే తాలూరి రూత్‌వర్ష పెంచుకుంటున్న పిల్లి గత నెల 29వ తేదీ నుండి కనిపించడం లేదు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించడంతో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో చొరబడి పిల్లిని అపహరించి సంచిలో వేసుకొని పారిపోయినట్లు గుర్తించారు. దీంతో నేరేడ్మెట్ పోలీసులకు రూత్‌వర్ష ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వినాయక్‌నగర్‌కు చెందిన నర్సింహ, కిరణ్, శంకర్ నిందితులుగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. ఆహారం కోసమే పిల్లిని దొంగిలించామని నిందితులు తెలిపారు. (చదవండి: తెలంగాణ కొత్త సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్) -
10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.57 లక్షల నగదుతోపాటు 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.