16 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. ఎవరీ నీల్ పటేల్?
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌లో వచ్చే నెలలో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనున్న నేపథ్యంలో సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 16 మందితో కూడిన జట్టులో భారత సంతతి టీనేజర్ అయిన నీల్ పటేల్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అతడి తల్లిదండ్రుల స్వస్థలం గుజరాత్ కావడంతో నీల్ పటేల్ వచ్చే నెలలో పేరేంట్స్ పుట్టిన గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు వస్తుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నీల్ పటేల్ ఎవరు? ఆస్ట్రేలియా తరఫున అతడు క్రికెటర్‌గా ఎలా ఎదిగాడన్నది ఆసక్తిగా మారింది.సిడ్నీకి చెందిన నీల్ పటేల్ న్యూసౌత్ వేల్స్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. న్యూసౌత్ వేల్స్ తరఫున ఓపెనర్ బ్యాటర్‌గా జూనియర్ లెవెల్ కెరీర్‌ను ప్రారంభించాడు. సిడ్నీ ప్రీమియర్ క్రికెట్ ఫస్ట్ గ్రేడ్‌లో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) నీల్ పటేల్ ప్రపంచ రికార్డు అందుకున్నాడు. బ్యాట్‌తోనే గాక తన ఆఫ్ స్పిన్‌తోనూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో నీల్ పటేల్ సమర్థుడు. నీల్ పటేల్ అండర్-19 జట్టుకు ఎంపిక కావడం వెనుక అతడి కఠోర శ్రమ దాగుంది. అడిలైడ్ వేదికగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు సాగిన అండర్-19 టాలెంట్ క్యాంప్‌కు ఎంపికైన నీల్ పటేల్ తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా బృందం కళ్లలో పడిన నీల్ పటేల్ ఇవాళ మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అంతేకాదు బాక్ ఫుట్ ప్లే షాట్స్‌ను కచ్చితంగా ఆడే నైపుణ్యం సాధించాడు.ఇక నీల్ పటేల్ కంటే ముందు జాసన్ సంఘా భారత్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడిన తొలి భారత సంతతి క్రికెటర్‌గా ఉన్నాడు. ఇక ప్రస్తుతం అండర్-19 చాంపియన్‌షిప్ ట్యాగ్ భారత్ వద్దే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను 100 పరుగులతో ఓడించిన భారత అండర్-19 జట్టు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జరగనున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మూడు యూత్ వన్డేలతో పాటు రెండు యూత్ టెస్టులు (నాలుగు రోజులు) ఆడనుంది. మ్యాచ్‌లన్నీ రాజ్‌కోట్, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. Read: భారత్‌లో మల్టీ ఫార్మాట్ సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన