breaking news
nats awards
-
NATS 8వ కర్టెన్ రైజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఫిలడెల్ఫియాలో బాలల సంబరాలు నిర్వహించింది. ఆ ప్రాంతంలోని భారతీయ టెంపుల్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. దాదాపు 120 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. ఎనిమిదిఏళ్ళలోపు, పన్నెండుఏళ్ళలోపు, పన్నెండుఏళ్ళపైన ఉన్న చిన్నారులను మూడు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ హరినాథ్ బుంగటావుల, సరోజ సాగరం, శ్రీనివాస్ సాగరం, రవి ఇంద్రకంటి, బాబు మేడి, రామకృష్ణ గొర్రెపాటి, పార్ధ మాదాల, అపర్ణ సాగరం, మాలిని గట్టు, సురేంద్ర ఈదర, మధు కొల్లి, సురేష్ బొందుగుల, మధు బూదాటి, సాయి సుదర్శన్ లింగుట్ల, లవ కుమార్ ఐనంపూడి, శ్రీకాంత్ చుండూరి, రమణ రాకోతు, ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామ్ నరేష్ కొమ్మనబోయిన, మురళి మేడిచెర్ల, బోర్డు సెక్రెటరీ శ్యామ్ నాళం, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. వీరితో పాటు నాట్స్ సంబరాలు కల్చరల్ టీం సభ్యులు బిందు యలంచిలి, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి వేదగిరి, ఓం నక్క, కిరణ్ తవ్వ , టి ఏ జి డి వి అధ్యక్షులు ముజీబుర్ రెహ్మాన్ షేక్, మాజీ అధ్యక్షులు కిరణ్ కొత్తపల్లి, తదితరులు పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు శ్రీనివాస్ చాగంటి, అన్నపూర్ణ చాగంటి, భాస్కరి బుధవరపు, సింధు బుధవరపు, అంజని వేమగిరి, వల్లి పిల్లుట్ల, సునంద గంధం, ప్రత్యుష నాయర్, శ్రీదేవి ముంగర, చిన్మయి ముంగర, నిర్మల రాజ్, లావణ్య న్, శ్రీనిధి దండిభొట్ల, విద్య షాపుష్కర్, రఘు షాపుష్కర్, మల్లి చామర్తి, సురేష్ యలమంచి ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు. ఈ కార్యక్రమానికి ధాత్రి గంధం, శ్రీనిజ దండిభొట్ల, స్నేహ ఇంద్రకంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహయించిన నాట్స్ ఫిలడెల్ఫియా చాప్టర్ కార్యవర్గ సభ్యులందరికి నాట్స్ సంబరాలు కన్వీనర్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రాండ్ స్పాన్సర్ బావర్చి బిర్యానీస్, స్పాన్సర్స్ ఓపెరా టెక్నాలజీస్, లక్ష్మి మోపర్తి న్యూయార్క్ లైఫ్, డివైన్ ఐటీ సర్వీసెస్, లావణ్య & సురేష్ బొందుగుల, సాఫ్ట్ స్కూల్స్.కామ్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించాయి. -
వేడుకగా నాట్స్ అవార్డుల ప్రదానోత్సవం
లాస్ఏంజిల్స్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) మహాసభలు స్థానికంగా గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీనటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా, ప్రముఖ వైద్యుడు ఎల్.ప్రేమ్సాగర్రెడ్డి అవార్డులు అందజేశారు. సినీనటుడు సాయికుమార్, సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్ తదితరులు అవార్డులు అందుకున్నారు. కూచిబొట్ల ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే అమెరికాలో వివిధ రంగాల్లో రాణించిన కె. ఉమామహేశ్వరి, కిరణ్ ప్రభ, రాజురెడ్డి, రమేశ్, పి.పి.రెడ్డి, దేశి గంగాధర్, వై.వి.నాగేశ్వర్రావుకు అవార్డులు అందజేశారు. నాట్స్ మహా సభల సమన్వయకర్త ఆలపాటి రవి, బోర్డు చైర్మన్ కొర్రపాటి మధు, వ్యవస్థాపక అధ్యక్షుడు మాదాల రవి, అధ్యక్షుడు ఆచంట రవి, సినీనటులు తనికెళ్ల భరణి, కాజల్, అలీ, సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ తదితరులు సభలకు హాజరయ్యారు.