breaking news
Narsinha Rao
-
వ్యక్తి పైకి దూసుకెళ్లిన లారీ.. పరిస్థితి విషమం
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల శివారులో లారీ ఓ వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఘటనలో అతడి కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. పోరుమామిళ్లకు చెందిన వెంకట నర్సింహారావు (50) రైసు మిల్లు నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో లారీ అతడ్ని ఢీకొని రెండు కాళ్లపై నుంచి ముందుకు వెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సింగభూపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బుల్లెట్.. ఫేవరేట్..
యడ్లపాడు, న్యూస్‌లైన్ :ఆ సౌండే వేరు.. ఆ లుక్కే వేరు.. దాన్ని నడుపుతుంటే వచ్చే కిక్కేవేరు.. అంటారు బుల్లెట్ నడిపేవారు. ద్విచక్రవాహనాల్లో రారాజు లాంటిదే ఈ బుల్లెట్ అని కితాబిచ్చేస్తారు. మూడు దశాబ్దాల కిందట బుల్లెట్ కొనడం గొప్పగా భావించేవారు. అది హుందాతనానికి ప్రతీక గా ఉండేది. తరం మారినా ఈ వాహనంపై మోజు తగ్గలేదు. పైగా నేటి యువత రాన్ని మరింత ఆకర్షిస్తోంది. ద్విచక్రవాహన కంపెనీలు ఈ వాహనాల ఉత్పత్తులను కూడా పెంచాయి. అదలా ఉంచితే.. సుమారు నాలుగు దశాబ్దాల కిందట తయారు చేసిన బుల్లెట్ ఎక్కడైనా కనిపిస్తే ఎంతో ఆసక్తిగా చూస్తాం. అప్పుడు కొన్న రాయల్ బుల్లెట్ ఓ వ్యక్తి ఇప్పటివరకు వాడుతున్నారు. తాను బుల్లెట్ అభిమానిని అని గర్వంగా చెప్పుకొంటున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘నాపేరు లావు నర్శింహారావు. నాకు 72 సంవత్సరాలు. మాది యడ్లపాడు మండలంలోని జాలాది గ్రామం. భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నా యుక్తవయస్సులో అంతా మార్చురేస్ వాహనాలు ఎక్కువగా మార్కెట్లో లభించేవి. ఇవి ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి దిగుమతి అయ్యేవి. 1950 తర్వాత స్వదేశంలోనే బుల్లెట్ తయారీ ప్రారంభమైంది. ఆంధ్ర, మద్రాసు సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న సమయంలో మద్రాసులో ఎన్ఫీల్డ్ కంపెనీ ఆవిర్భావించింది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్, ఎజ్డీ జావాలను ఉత్పత్తి చేసేవారు. ఎజ్డీ జావా అయితే కేవలం 2.5 హార్స్పవర్, అదే రాయల్ బుల్టెట్ అయితే 3.5 హార్స్పవర్ ఉండేది. నా ఇరవైఏడేళ్ల వయసులో 1968 నవ ంబర్ 22న విజయవాడ పద్మజ కమర్షియల్ కార్పొరేషన్లో రాయల్ బుల్లెట్ కొన్నాను. అప్పటినుంచి ఇదే వాహనాన్ని నడుపుతున్నాను. ఇది వేగంతో పాటుగా ఎంతో సౌకర్యవంతంగా, హుందాతనంగా ఉంటుంది. అందుకే బుల్లెట్ ఫేవరేట్‌గా మారిపోయాను. వాహనం కొన్న మొదట్లో లీటరు పెట్రోలు కేవలం ముప్పావలా. ప్రస్తుతం రూ.82కు పెరిగింది. అందుకే కొంతకాలం క్రితం పెట్రోలు నుంచి డీజిల్ వాహనంగా మార్పు చేయించాను. ఎగుడుదిగుడు గ్రామీణ రోడ్లలో ఈ బుల్లెట్ ఎటువైపు వాలకుండా నిటారుగా ఉంటుంది. చిన్నచిన్న రాళ్లు టైరు కిందపడినా, బురదలో నడిపినా త్వరగా స్కిడ్ కాదు. ఎంతదూరం ప్రయాణించినా ప్రయాణ బడలిక, అలసట కన్పించదు. అందుకే రాయల్ బుల్లెట్.. నా ఫేవరేట్..!