breaking news
	
		
	
  narasimhakonda
- 
      
                   
                                                       నరసింహకొండపై అపచారం..నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు. ఇవి సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా కొరవడటంపై భక్తులు మండిపడుతున్నారు.నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఈ వీడియోను చూసిన నెల్లూరు వాసులు, ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. వెంటనే ఆ జంట క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టింది. ఆర్నెల్ల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు.వీటినీ సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయకపోవడం, ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవడం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
- 
      
                   
                                 నరసింహకొండ గిరి దర్శనానికి కృషి
 
 నెల్లూరు(అర్బన్): నరసింహకొండ చుట్టూ రోడ్డును ఏర్పాటు చేసి గిరి దర్శనానికి వీలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నరసింహకొండపై కొలువైన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ నూతన చైర్మన్ మల్లినేని వెంకటేశ్వర్లునాయుడు, సభ్యులు దైవసన్నిధిలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆదాల మాట్లాడారు. ఆలయానికి 1348 ఎకరాల భూమి ఉందని, ఈ ఆస్తులను నూతన కమిటీ పరిరక్షిస్తూ ఆదాయ పెంపునకు కృషి చేస్తుందని చెప్పారు. భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి మాట్లాడారు. కొండపైకి బస్సు సౌకర్యాన్ని కల్పించేలా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కృషి చేయాలని కోరారు. అనంతరం ఆదాలను కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. టీడీపీ రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు కిలారి వెంకటస్వామినాయుడు అధ్యక్షత వహించిన సభలో పార్టీ నగరాధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నాయకులు హరిబాబుయాదవ్, హంసకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 అసంతృప్తి
 స్థానిక ఎంపీటీసీగా ఉన్న తనను వేదికపైకి ఆహ్వానించలేదని సునీల్ పలువురు టీడీపీ నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు.


