నరసింహకొండపై అపచారం.. | Objectionable Videos Are Being Filmed On Nellore Narasimhakonda, More Details Inside | Sakshi
Sakshi News home page

నరసింహకొండపై అపచారం..

Oct 31 2025 7:38 AM | Updated on Oct 31 2025 10:31 AM

Nellore: Objectionable Videos Are Being Filmed On Narasimhakonda

నెల్లూరు సిటీ: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్‌ మండలంలోని పవిత్ర వేదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కొందరు అసభ్యకర వీడియోలను చిత్రీకరించారు. ఇవి సోషల్‌ మీడియా ద్వారా బయటకు రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లా­లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో నిఘా కొరవడటంపై భక్తులు మండిపడుతున్నారు.

నరసింహకొండపై వెలసిన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఓ యువజంట కౌగిలించుకుంటూ అసభ్యకర వీడియోలు చిత్రీకరించారు. ఆపై దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. ఈ వీడియోను చూసిన నెల్లూరు వాసులు, ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో.. వెంటనే ఆ జంట క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టింది. ఆర్నెల్ల క్రితం కూడా కొండపైన చెట్ల మధ్యలో కొందరు మద్యం సేవిస్తూ వీడియోలను చిత్రీకరించారు.

వీటినీ సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేశా­రు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇలా నరసింహకొండపై తరచూ నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల­ను ఏర్పాటుచేయకపోవడం, ఆలయానికి ఎవరెవరు వస్తున్నారనే కనీస నిఘా వ్యవస్థ లేకపోవడం దారుణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement