breaking news
music alerts
-
మానసిక ఆరోగ్యంపై సంగీత ప్రభావం.. ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’..!
సాక్షి, సిటీబ్యూరో: శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణిః అనే విశ్వాసాన్ని అనుసరిస్తూ. వంధ్యత్వానికి చికిత్సలో సంగీతాన్ని మిళితం చేస్తూ ‘మ్యూజిక్ ఆఫ్ హోప్’ పేరిట ఓ ట్యూన్‌ను నగరానికి చెందిన ఫెర్టీ–9 ఫెర్టిలిటీ సెంటర్ రూపొందించింది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవ వేడుకల ముగింపును పురస్కరించుకుని దీనిని విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మానసిక ఆరోగ్యంపై సంగీతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతత, విశ్రాంతి భావాన్ని కలిగిస్తుందని నిరూపితమైన నేపథ్యంలో ఈ ట్యూన్ ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. అదే విధంగా ‘టుగెదర్ ఇన్ ఐవీఎఫ్’ పేరిట వంధ్యత్వానికి సంబంధించిన అపోహలను పోగొట్టడం లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 15 వేర్వేరు ప్రదేశాల్లో వీధి నాటకాలు లేదా నుక్కడ్ నాటకాలను ప్రదర్శించామని వివరించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కొనియాడుతూ సత్యసాయి విద్యార్థినులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. దసరా వేడుకల్లో భాగంగా శని వారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అసోసియేట్ ప్రోఫెసర్ రుచిర్ దేశాయ్ ప్రసంగించారు. షిరిడీ సాయి , సత్యసాయి జీవిత చరిత్రలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు సంగీత కచేరి నిర్వహించారు.