ఆ డైరెక్టర్ సినిమా ఆఫర్ చేసి.. కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి
అవకాశాల పేరుతో అమ్మాయిలను వాడుకునేందుకు ప్రయత్నిస్తారనే అపవాదు సినిమా ఇండస్ట్రీపై ఉంది. అది నిజమనే చెబుతోంది మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మౌనీషా చౌదరి. అమెరికాలో ఉంటూ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా రీసెంట్గా ఇండియాకు వచ్చింది. తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహించే టాక్ షోలో పాల్గొని..తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ‘తెలుగులో మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయా?’ అని హోస్ట్ అడగగా.. ఆఫర్స్ వచ్చినా తాను చేయలేదని చెబుతూ.. దానికి గల కారణం ఏంటో వివరించింది.‘నేను 16-17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఓ సారి ఒకరు వచ్చి ‘సినిమాలపై ఆసక్తి ఉందా? హీరోయిన్గా చేస్తావా?’ అని అడిగాను. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే అతను బాడీ కొలతలు ఎంత? నీ తొడల సైజ్ ఎంత? అని అడిగాడు. చాలా భయపడిపోయా. అలా చిన్న వయసులోనే నాకు సినిమా ఇండస్ట్రీపై భయం ఏర్పడింది. ఇంకోసారి ఇండియా టూరిజమ్ యాడ్ కోసం అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఆడిషన్ కి రావడమే ఒక మినీ స్కర్ట్ క్రాప్ టాప్ వేసుకుని రండి అని చెప్పారు. ఇండియా టూరిజమ్ కి మినీ స్కర్ట్ క్రాప్ టాప్ కి సంబంధం ఏముంది ? హీరోయిన్ అవ్వాలంటే బాడీ కొలతలు ఇవన్నీ ఎందుకండీ ? నటన వచ్చా రాదా అని అడగండి ఫస్ట్ ..రాదు అంటా ఆ సరే దొబ్బెయ్ అనాలప్పుడు అంతే అయిపోతుంది’ అని మౌనీషా చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు ఏర్పడిన భయంతో ఇప్పటికీ సినిమాల్లో నటించాలంటే భయంగానే ఉంటుందని చెప్పింది. ఇటీవల విశ్వక్సేన్ కొత్త సినిమాలో కీలక పాత్ర కోసం అడిగారు. భయంతో నో చెప్పానని మౌనీషా అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలోనూ మౌనీషా దీని గురించి చెబుతూ.. తనను కొలతలు అడిగిన వ్యక్తి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిపోయాడని.. స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నాడని చెప్పింది.