breaking news
most valuable brand
-
అదానీ గ్రూప్ విలువ జూమ్..
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్‌గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. → ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది. → 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్‌సీఎల్‌టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి. → అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. -
LIC of India: గ్లోబల్‌గా ఎల్ఐసీ ఘనత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) బలమైన ఇన్సూరెన్స్ సంస్థగా అవతరించింది. అలాగే ప్రపంచంలోనే పదవ అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన నివేదిక ప్రకారం. కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తక్కవ వడ్డీరేట్ల కారణంగా బీమా రంగం మందగించిందని, అయితే మహమ్మారిని ఎదుర్కొని మరీ ప్రపంచంలోని అగ్ర బీమా సంస్థలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డెక్లాన్ అహెర్న్ చెప్పారు. టాప్ 10 లో ఎక్కువగా చైనా బీమా కంపెనీలు ఆధిపత్యంలో ఉండగా, యుఎస్‌కు రెండు కంపెనీలు ఉండగా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి. కాగా ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా బీమా కంపెనీలుకుదలేన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రభావంతో బీమా రంగం దెబ్బతిన్నది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం. ఎల్ఐసీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 6.8 శాతం పెరిగి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో44 బిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో చైనాకు చెందిన పింగ్అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. అలాగే, చైనాకే చెందిన మరో సంస్థ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 22 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జర్మనీ అలియాంజ్, ఫ్రాన్స్ నుంచి ఆక్సా సంస్థలు ఉన్నాయి. ఈ నివేదిక బలమైన బీమా బ్రాండ్లను కూడా పరిశీలిస్తుంది. ఇదే నివేదిక ప్రపంచంలోనే బలమైన బీమా సంస్థల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇటలీకి చెందిన పోస్టే ఇటాలియన్, స్పెయిన్ మ్యాప్ఫ్రే, తొలి రెండు స్థానాల్లోనూ, చైనా పింగ్ఆన్ ఇన్సూరెన్స్, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటలీకి చెందిన యునిపోల్ సాయి, యుఎస్ 'అఫ్లాక్, యుకె (బెర్ముడా) హిస్కాక్స్, దక్షిణాఫ్రికా ఓల్డ్ మ్యూచువల్ , అమెరికా ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి. Most valuable insurance #brands revealed! -Top 100 drop 6% due to #COVID19 -@pingan_group most valuable, US$44.8bn -@ChinaLifeBRK overtakes @Allianz to 2nd place -Chinese brands account for 30% total value; US brands up 14% -@PosteNews strongest REPORT: https://t.co/r4RdoHXClG pic.twitter.com/ZdHUVenOyp — Brand Finance (@BrandFinance) April 28, 2021 చదవండి : అదరగొట్టిన రిలయన్స్ వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి: రిలయన్స్ -
నెంబర్.1 టాటా.. నెంబర్.2 ఎవరో తెలుసా?
-
నెంబర్.1 టాటా.. నెంబర్.2 ఎవరో తెలుసా?
భారత్ లో అత్యంత విలువైన బ్రాండుల్లో అగ్రగామిగా టాటాల గ్రూప్ మరోసారి తన సత్తా చాటుకుంది. బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ బ్రాండు ఫైనాన్స్ రూపొందించిన వార్షిక అధ్యయన టాప్ 100 కంపెనీల జాబితాల్లో 13.1 బిలియన్ డాలర్ల(రూ.83,925కోట్లకుపైగా)తో టాటా గ్రూప్ తన స్థానాన్ని అలాగే నిలుపుకుంది. అయితే 2016లో కంటే 2017లో టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 4 శాతం పడిపోయిందని ఈ అధ్యయనం తెలిపింది. 2016 లో టాటా గ్రూప్ విలువ 13.7 బిలియన్ డాలర్లు(రూ.87,786కోట్లు)గా ఉండేంది. టాటా గ్రూప్ తర్వాత స్థానం టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ దక్కించుకుంది. 7.7 బిలియన్ డాలర్ల(రూ.49,339కోట్లకు పైగా)తో ఎయిర్ టెల్ ఈ స్థానంలో నిలిచింది. గతేడాది టాటా గ్రూప్ బోర్డు రూమ్ లో నెలకొన్న సైరస్ మిస్త్రీ వివాదమేని దీన్ని ప్రతిష్టను భంగ పరిచిందని తెలుస్తోంది. సైరస్ మిస్త్రీని అకస్మాత్తుగా బయటికి పంపేయడం బ్రాండు విలువను పడగొట్టిందని విశ్లేషకులంటున్నారు. బ్రాండు విలువ పడిపోవడం, గ్రూప్ కు అంత మందచిదికాదని బ్రాండు ఫైనాన్స్ సీఈవో డేవిడ్ హై చెప్పారు. 2015-16 మధ్యకాలంలో ఈ గ్రూప్ బ్రాండు విలువ 11 శాతం పడిపోయింది. 2015లో ఈ గ్రూప్ బ్రాండు విలువ 15.3 బిలియన్ డాలర్లు(రూ.98,038కోట్లకుపైగా)గా ఉండేది. గత ఐదేళ్ల కాలంలో గ్రూప్ విలువ చాలా తక్కువకు పడిపోయిందని, దీనికంతటికీ కారణం బోర్డు రూం వారేనని విశ్లేషకులు చెబుతున్నారు. టాటా గ్రూప్, ఎయిర్ టెల్ తర్వాత భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్స్ గా ఎల్ఐసీ 3వ స్థానం, ఇన్ఫోసిస్ 4వ స్థానం, ఎస్బీఐ 5వ స్థానం, రిలయన్స్ 6వ స్థానం, ఎల్ అండ్ టీ 7వ స్థానం, ఇండియన్ ఆయిల్ 8వ స్థానం హెచ్‌సీఎల్ 9స్థానం, మహింద్రా 10వ స్థానాన్ని దక్కించుకుని, టాప్-10 లో నిలిచాయి. ఈ ర్యాంకింగ్స్ లో అతిపెద్ద మెరుగుదల, ఇండిగో ఎయిర్ లైన్స్ ర్యాంక్ 95 నుంచి 62కు పెరగడమేనని హై తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థ అయిన ఇండిగో ఇటీవలే 35 కొత్త రూట్లను ప్రకటించిందని చెప్పారు. టాటా గ్రూప్ లకు చెందిన తాజ్ హోటల్స్ కూడా 14 స్థానాలు పడిపోయి 93 స్థానంలో ఉన్నాయి.