LIC of India: గ్లోబల్‌గా ఎల్ఐసీ ఘనత

LIC 10th most valuable insurance brand, third moststrongest globally: Report - Sakshi

ప్రపంచంలో  అత్యంత విలువైన 10 వ సంస్థగా ఎల్‌ఐసీ

అత్యంత బలమైన మూడో  సంస్థగా ఎల్‌ఐసీ

బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) బలమైన ఇన్సూరెన్స్‌ సంస్థగా అవతరించింది. అలాగే ప్రపంచంలోనే  పదవ అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్‌ఐసీ నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన  నివేదిక ప్రకారం.

కరోనా మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తక్కవ వడ్డీరేట్ల కారణంగా బీమా రంగం మందగించిందని, అయితే మహమ్మారిని ఎదుర్కొని మరీ ప్రపంచంలోని అగ్ర బీమా సంస్థలు స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్నాయని బ్రాండ్ ఫైనాన్స్ డైరెక్టర్ డెక్లాన్ అహెర్న్ చెప్పారు. టాప్ 10 లో ఎక్కువగా చైనా బీమా కంపెనీలు ఆధిపత్యంలో ఉండగా,  యుఎస్‌కు రెండు కంపెనీలు ఉండగా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా ఒక్కొక్క కంపెనీ ఉన్నాయి. కాగా ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది.  

కరోనా మహమ్మారి కారణంగా బీమా కంపెనీలుకుదలేన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, తక్కువ వడ్డీ రేట్ల ప్రభావంతో బీమా రంగం దెబ్బతిన్నది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం. ఎల్ఐసీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 6.8 శాతం పెరిగి రూ. 64 వేల కోట్లకు చేరుకుంది. ఈ జాబితాలో44 బిలియన్ డాలర్లతో  మొదటిస్థానంలో చైనాకు చెందిన పింగ్అన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. అలాగే, చైనాకే చెందిన మరో సంస్థ చైనా లైఫ్ ఇన్సూరెన్స్ 22 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జర్మనీ అలియాంజ్, ఫ్రాన్స్ నుంచి ఆక్సా సంస్థలు ఉన్నాయి.

ఈ నివేదిక బలమైన బీమా బ్రాండ్‌లను కూడా పరిశీలిస్తుంది. ఇదే నివేదిక ప్రపంచంలోనే బలమైన బీమా సంస్థల జాబితాను కూడా విడుదల చేసింది.  ఇందులో ఎల్ఐసీ మూడో స్థానంలో ఉండటం విశేషం.  ఇటలీకి చెందిన పోస్టే ఇటాలియన్,  స్పెయిన్ మ్యాప్‌ఫ్రే, తొలి రెండు స్థానాల్లోనూ, చైనా పింగ్ఆన్ ఇన్సూరెన్స్, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇటలీకి చెందిన యునిపోల్ సాయి, యుఎస్ 'అఫ్లాక్, యుకె (బెర్ముడా) హిస్కాక్స్, దక్షిణాఫ్రికా ఓల్డ్ మ్యూచువల్ , అమెరికా ప్రోగ్రెసివ్ కార్పొరేషన్ సంస్థలు ఉన్నాయి.

చదవండి :  
అదరగొట్టిన రిలయన్స్‌
వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆసుపత్రి: రిలయన్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top