breaking news
M.M. Keeravaani
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఓ నీలవేణి నీలవేణి రావె అలక మాని నీ హంస నడకలనీ ఫాలో ఔతున్నానని కోపంలోనూ ఇంతందమా... మనకి మనకి తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా... నీడై నీడై పోనా ఇలా.... తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా... నీడై నీడై పోనా ఇలా.... చరణం : 1 ఎండపడి ఎర్రఎర్రగా కందినదే లేతబుగ్గ గొంతు తడి ఆరి ఎంతగా వాడినదొ మల్లెమొగ్గ నీకోసం నీలిమబ్బునై ఆకాశం చేరనా నేనే ఓ వానజల్లులై ఒళ్లంతా తడమనా కూడా కూడా రానా... నీడై నీడై పోనా... తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా... చరణం : 2 సోయగము విసిరి గుండెకే చేయకిక తీపి గాయం సోకులతో నన్ను చంపడం నీకు ఇది ఏమి న్యాయం నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా కూడా కూడా రానా... నీడై నీడై పోనా... తేడాలెన్నో ఉన్నా... ఇలా హా... ఇలా... హా... చిత్రం : ఏమో గుర్రం ఎగరావచ్చు (2014) రచన : చైతన్యప్రసాద్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : రాహుల్ సిప్లీగంజ్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: ఆహాహాహా... హా... హా... ఆహ హాహా హా... ఆమె: అ హహహహ హా హ హా హహా... అ: అహ హా హా... హ హా... హా... ఆ... అ: రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా రోజాపువ్వా... పువ్వా పువ్వా... రోజు రోజు రోజు రోజు పూస్తువున్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా ఆ: రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నున్నా అ: పడుచుతనపు గడుసువలపు పాటవు నువ్వా... వావ్వా... ॥రోజ్॥ బృందం: గులాబి ఘుం... ఘుం ఘుం... (2) చరణం : 1 అ: చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా... కన్నె పువ్వా... వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా... పొద్దే నువ్వా... ఆ: గుండె చాటు ప్రేమలెన్నొ కోటు మీద చాటుతున్న రోజాపువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా అ: చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ... ॥రోజ్॥ చరణం : 2 ఆ: ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా... బాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వా జాజే నువ్వా అ: గుప్పుమన్న ఆశలెన్నొ కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా ఆ: మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా... ఆ... ॥రోజ్॥ చిత్రం : అల్లరి ప్రియుడు (1993) రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఎస్.పి.బాలు, చిత్ర, బృందం నిర్వహణ: నాగేష్