breaking news
MLC Somy Reddy
-
25 శాతం భార్యాబాధిత కేసులే
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని వెల్లడి సాక్షి, అమరావతి: మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని చెప్పారు. బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు. ఆమెను చూసిన సోమిరెడ్డి.. మహిళా కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ అడిగారు. ఈ విషయంలో పురుషుల పట్ల మహిళా కమిషన్ దయ చూపించాలన్నారు. దీంతో నన్నపనేని స్పందిస్తూ.. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు. -
లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి
⇒ టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం ⇒ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత చంద్రబాబుకు సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఇవ్వాలని ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావే శంలో నేతలు పార్టీ అధినేత చంద్రబా బుని కోరినట్లు సమాచారం. దీనిపై ఆయన ఏమీ మాట్లాడక పోయినా ఈ విషయం ఖరారైనట్లు తెలిసింది. ఈసారి శాసనమండలిలో కచ్చితంగా లోకేష్ ఉంటారని పొలిట్ బ్యూరో నిర్ణయాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఏకగ్రీవంగా కోరినట్లు చెప్పారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ అంశాన్ని లేవనెత్తి లోకేష్‌ను మండలికి పం పాలని ప్రతిపాదించగా ఇతర సభ్యులందరూ బలపరిచారు. సీఎం మాట్లాడుతూ అభ్యర్థు ల ఎంపిక తాను చూసుకుం టానని చెప్పినట్లు సమాచా రం. పాత వారితో పాటు కొత్తగా పార్టీలో చేరిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తానని, పార్టీకి సేవలందించిన వారికీ న్యాయం చేస్తానని చెప్పారు. ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక బాధ్యతను చంద్రబాబుకు అప్పగిస్తూ పొలిట్‌బ్యూరోలో తీర్మానించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే మనకే మంచి జరుగుతుందని నేతలకు చంద్ర బాబు వివరించారు. ఒకేసారి ఎన్నికలు జర పాలనే కేంద్రం నిర్ణయానికి మద్దతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. జగన్ కేసులపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయని తెలిసింది.