breaking news
mini pakistan
-
‘ఓల్డ్ సిటీ మినీ పాకిస్థాన్ అవుతోంది’
హైదరాబాద్: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నిజంగానే మినీ పాకిస్థాన్‌గా మారుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలను తాను ఇది వరకే తెలంగాణ అసెంబ్లీలో అన్నానని, అప్పుడు తాను అన్నమాటలు ఏదో పొరపాటున అన్నవి కాదని స్పష్టం చేశారు. మరోసారి తాను అప్పట్లో చెప్పిన మాటల్ని సమర్థించుకుంటున్నట్లు తెలిపారు. -
'నా నియోజకవర్గం ఓ మినీ పాకిస్థాన్'
పశ్చిమ బెంగాల్ కేబినెట్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత బాబీ ఫర్హాద్ హకిమ్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాకిస్థాన్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన 'నా నియోజకవర్గమే కోల్ కతాలో మినీ పాకిస్థాన్ లాంటిది' అని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అయినప్పటికీ మమతా బెనర్జీ నమ్మిన బంటు అయిన ఫర్హాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్థాన్ కు వెళితే ఏమీ లేదు కానీ, తాను పాకిస్థాన్ గురించి ఏమైనా మాట్లాడితే వివాదం చేస్తారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. తాను ముస్లిం కావడం వల్లే ప్రశ్నిస్తున్నారని, ఇందులో మత కలహాల కుట్ర కనిపిస్తున్నదని ఆయన ఎదురుదాడికి దిగారు. బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫర్హాద్ హకిమ్ నియోజకవర్గంలో ఇటీవల పాక్ దినపత్రిక డాన్ కు చెందిన విలేకరి మలెహా హమిద్ సిదిఖి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ ఫర్హాద్ చేసిన మినీ పాకిస్థాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. భారత్ లోని ముస్లింల గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు.