Middle-class
-
ఇల్లు.. అందుబాటులోనిల్లు
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. సొంత స్థలంలో ఇల్లు అనేది దశాబ్దాలుగా నగరంలో ఉంటున్న వారికి మినహా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చింది. తొలినాళ్లలో ఎక్కువగా సింగిల్ బెడ్ రూమ్ (1 బీహెచ్‌కే), డబుల్ బెడ్ రూమ్ (2 బీహెచ్‌కే) ఇళ్లే ఎక్కువగా నిర్మించేవారు. దీంతో సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకోలేని వారు అపార్ట్మెంట్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేవారు. 600–700 చ.అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. సొంతిల్లు కావాలనుకునే వారు ఈ సింగిల్ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొనుగోలు చేసి కల నెరవేర్చుకునేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం వరకు కూడా డెవలపర్లు ఈ 1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.1, 2 బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 1 బీహెచ్‌కే ఇళ్లయితే అసలు కనిపించడమే లేదు. మిగతా నగరాలతో పోల్చుకుంటే అత్యధికంగా హైదరాబాద్‌లోనే ఈ తరహా ఇళ్లు (అఫర్డబుల్ హౌసింగ్/సామాన్యులకు అందుబాటులో ఉండేవి) 70 శాతం తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, లేబర్ల జీత భత్యాలు పెరగడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో బిల్డర్లు అఫర్డబుల్ హౌసింగ్‌ను దాదాపుగా మానుకుంటున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చాలావరకు అవసరమైతే మరింత అప్పు చేసైనా సరే కాస్త విశాలమైన ఇళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు, విల్లాల వంటివి గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. కరోనా తర్వాత.. కరోనా కాలంలో చిన్న, ఇరుకైన ఇళ్లలో నివసించడం ఎంత రిస్కో తెలిసొచ్చింది. ఎక్కువ గదుల భావన బలపడింది. దీంతో అప్పటినుంచి అత్యధిక శాతం కొనుగోలుదారులు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 25–40 శాతం భూమి ధరలదే ఉంటోంది. దీంతో లాభదాయకం కాదనే భావనతో బిల్డర్లు కూడా 1, 2 బీహెచ్‌కే ఫ్లాట్ల నిర్మాణాన్ని తగ్గించారు. 2018లో గృహ విక్రయాలలో మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 26 శాతానికి పడిపోవడం గమనార్హం. మధ్య తరగతి గృహాలపై తీవ్ర ప్రభావం.. దేశంలోని ఇతర మెట్రో నగరాలలో కూడా అఫర్డబుల్ గృహాల నిర్మాణం వేగంగా తగ్గుతోంది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం మన తర్వాత (70 శాతం) ముంబైలో 60 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 50 శాతం మేర క్షీణించాయి. ప్రత్యేకించి హైదరాబాద్‌లో 2022 నుంచి రూ.కోటి కంటే బాగా తక్కువగానే ధర ఉండే మధ్య తరగతి గృహ నిర్మాణాల అమ్మకాలు భారీగా తగ్గాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు, కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వారి అభిరుచులకు మేరకు డెవలపర్లు కూడా లగ్జరీ గృహ నిర్మాణాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు భూముల ధరలు ఆకాశాన్నంటడం, నిర్మాణ సామగ్రి, నైపుణ్య కారి్మకుల వేతనాలు పెరగడం వంటి కారణంగా మధ్య తరగతి ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు లాభసాటిగా ఉండటం లేదు. దీంతో ఎక్కువ లాభదాయకంగా ఉండే ప్రీమియం ప్రాజెక్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరిగే అవకాశం టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు.కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు తుదిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పదు. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలను చ.అ.కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గుతున్న అమ్మకాలు భూములు, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, నైపుణ్య కారి్మకుల కొరత, గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల సూచనలు.. వెరసి హైదరాబాద్ స్థిరాస్తి రంగం కుప్పకూలుతోంది. 2024తో పోల్చుకుంటే 2025లో ప్రాజెక్టులు, అదే విధంగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో 2025 చివరి త్రైమాసికంలో 60 లక్షల చదరపు అడుగులు (చ.అ.) మేర గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కేవలం 6 లక్షల చ.అ.లకే పరిమితయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో క్షీణించడం నగరలో నిర్మాణ రంగ పతనాన్ని సూచిస్తోంది. ఇంకోవైపు కనెక్టివిటీ, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో శివారుప్రాంతాల్లోని 40 శాతం మధ్య తరగతి గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపాలి భూ యజమానులు అత్యాశతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లు చేపట్టాలంటే బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ భూముల లభ్యత విపరీతంగా ఉంది. అయితే సరైన మౌలిక వసతుల్లేవు. ఆ మేరకు ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తే మధ్య తరగతి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుంది. – నరేంద్రకుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ (ఫొటో కామన్‌లో నరేంద్ర కుమార్ పేరుతో ఉంది) -
గుప్త దానం
స్వామి వారి దర్శనార్థం తిరుమలకొండకు చాలామంది తమిళ భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు. వారు కాలికి చెప్పులు వేసుకోరు. ఆడామగా తేడా లేకుండా పసుపు గుడ్డలు ధరించి, భుజానికి సంచి తగిలించి, గోవింద నామస్మరణలు చేస్తూ నడుస్తారు. అలసిన సమయంలో ఏ చెట్టునో ఏ గుడినో ఆశ్రయిస్తారు. దొరికింది తింటారు.తమిళనాడు దాటి ఆంధ్ర సరిహద్దుల్లో ప్రవేశించే దారిలో అనేక పల్లెటూర్లు ఉన్నాయి. ఆ ఊర్లలోని ఒక పల్లెటూరి యువకుడికి ఒక పౌర్ణమి రోజున నడిచి వెళ్ళే భక్తులకు అన్నదానం చేయాలనిపించి తండ్రితో ఆ విషయం చెప్పాడు. ‘‘పేదలమైన మనం అంత ఖర్చుతో కూడుకున్న పనులు చేయలేము, ఆ ఆలోచన మానుకో!’’ అన్నాడు తండ్రి. ‘‘మన దగ్గర డబ్బు లేదు సరే, దానగుణం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారిని అడుగుదాము’’ అన్నాడు కొడుకు.సరేనని కొడుకును తోడు చేసుకుని తండ్రి ఊరివారినడిగాడు. ఎవ్వరూ స్పందించలేదు. పక్క ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక ధనవంతుడిని కలిశారు. తాను ఎంతమందికైనా చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయగలనని, అయితే, అన్నదానం చేసే చోట తన పేరును పెద్ద అక్షరాలతో రాసి పెట్టాలని కోరాడతను. ఆలోచించి చె΄్తామని అక్కడినుంచి కదిలాడు తండ్రి. వెనుకనే కొడుకు కూడా నడిచాడు.మరో ఊరు వెళ్తూ ఉంటే దారిలో ఒక మధ్యతరగతి రైతు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. అన్నదాన కార్యక్రమానికి దాతలకోసం వెదుకుతున్నామని బదులిచ్చారు. వెంటనే ఆ రైతు ‘‘నాకు ఆ అవకాశం ఇవ్వండి. విందు భోజనం కాక΄ోయినా నా శక్తి కొలది మంచి భోజనమే చేయిస్తాను. అయితే నేను అన్నదానం చేసినట్లుగా ఎక్కడా ప్రచారం చేయకండి. నాకు అలాంటి ప్రచారాలు ఇష్టం లేదు’’ అని చెప్పాడు. అలాగేనని తండ్రి అంగీకరించాడు.పౌర్ణమి రోజు రానే వచ్చింది. భక్తులకు తండ్రీకొడుకు అన్నదానం చేస్తూ ఉన్నారు. కొడుకు తండ్రితో ‘‘ఇప్పుడు మనం చేసే అన్నదానం... పులిహోర, పెరుగన్నం, అరటిపండే కదా. దీనికన్నా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తానన్న అతడి విందు ఎందుకు వద్దన్నావు? అని ప్రశ్నించాడు.తండ్రి నవ్వి ‘‘ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే అది దానమవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. పేరు ప్రతిష్టల కోసం చేసేది దానమనిపించుకోదు. అందుకే దాన్ని వద్దన్నాను’’ అని వివరించాడు. తృప్తి్తగా తిన్న భక్తులు ‘అన్నదాతా సుఖీభవ!’ అంటూ అక్కడినుంచి కదిలారు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఆహ్లాదం.. ఆనందం..
ఖైరతాబాద్ : వీకెండ్ వస్తే చాలు నగరవాసులు నెక్లెస్ రోడ్డుకు క్యూ కడతారు. సాయం సంధ్య వేళ కుటుంబ సమేతంగా అక్కడికి విచ్చేసిన వారంతా ఆహ్లాదంగా గడుపుతారు. దీంతోపాటు అక్కడే ఉన్న పీపుల్స్ ప్లాజాలో అన్ని సీజన్లలో వివిధ రకాల ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వేదికే మధ్యతరగతి ప్రజలకు ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా మారింది పీపుల్స్ ప్లాజా. ఇటీవల ఇక్కడ ఏర్పాటుచేసిన వింటర్ ఉత్సవ్ మేళా అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసిన వారు రెండు గంటల పాటు ఉత్సాహంగా గడపుతారు. ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా.. ఈ ఎగ్జిబిషన్లో ఎమ్యూజ్మెంట్ రైడ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గేమింగ్ జోన్, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే వేదికగా వివిధ రకాల స్టాల్స్ అందుబాటులో ఉండటాయి. దీంతో వారాంతాల్లో ఇక్కడికి విచ్చేసేవారు షాపింగ్ మొదలుకుని ఎంటర్టైన్మెంట్ వంటి వివిధ రకాల అంశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం.. అబ్బురపరిచే సెల్ఫీ జోన్లలో ఫొటోలు దిగుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో వీకెండ్ అయితే చాలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా ఇక్కడికి క్యూ కడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను సైతం నగర వాసులు నెక్లెస్ రోడ్డు పొడవునా తిరుగుతూ ఎంజాయి చేస్తూ జరుపుకోవడం విశేషం. -
నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగర పరిధిలోని బడా కుళాయిలకు(బల్క్) మీట రింగ్ పాలసీని అమలు చేస్తుండగా.. త్వరలో డొమెస్టిక్ కేటగిరీలోనూ ఈ విధానాన్ని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లో ని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో మీటర్లు లేని గృహవినియోగ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. మీటరింగ్ పాలసీ అమలు చేసిన పక్షంలో వీరందరికీ బాదుడు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుతం నెలకు రూ.200 బిల్లు చెల్లిస్తున్న వారు రూ.400 బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి రానుంది. బోర్డు పురోగతిపై ఎండీ తెలిపిన విశేషాలివే.. వేసవిలో నో పానీపరేషాన్... గ్రేటర్‌కు మంచినీరందిస్తున్న జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో జూలై చివరి నాటి వరకు నగరంలో మంచినీటి కటకట ఉండదని ఎండీ స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు 24 గంటల పాటు అదనపు ట్యాంకర్ ట్రి ప్పుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. రికార్డు అదాయం.. మార్చి 31 వరకు జలమండలి రికార్డు రెవెన్యూ ఆదాయం ఆర్జించిందని ఎండీ వెల్లడించారు. మార్చి నెలలో 4.50 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటాలో రూ.53 కోట్లు జలమండలి ఖజానాకు చేరడంతో ఒకే నెలలో రూ.160 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించిందన్నారు. గడువు పెంపు లేదు.. నీటి బిల్లు బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలకు చివరి గడువు మార్చి 31తో ముగిసినందున ప్రస్తుతానికి గడువు పెంచలేమని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నాటికి కృష్ణా మూడోదశ... ఈ ఏడాది జూన్ చివరి నాటికి కృష్ణా మూడోదశ పథకం మొదటి దశను పూర్తిచేసి నగరానికి 45 ఎంజీడీల జలాలు తరలిస్తామన్నారు. గోదావరి మంచినీటి పథకం మొదటి దశను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తై మల్కాజ్గిరి మంచినీటి పథకం పనులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే పనులు మొదలు పెడతామని తెలిపారు.


