breaking news
Michael B Jordan
-
ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్.. అదే ఆయన స్పెషాలిటీ
98వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మైఖేల్ బీ జోర్డాన్ నిలిచాడు. సిన్నర్స్ చిత్రంలోని నటనకు ఆయనను ఈ అవార్డు వరించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వహించిన సిన్నర్స్ చిత్రంలో జోర్డాన్ ద్విపాత్రాభినయంలో కనిపించి కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. ఒకే చిత్రంలో కవలలుగా నటించి ఆస్కార్ గెలుచుకున్న తొలి నటుడిగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే, ఈ విభాగంలో ఆస్కార్ అందుకున్న ఆరో నల్లజాతీయుడిగా నిలిచారు.బుల్లితెర టు వెండితెరచిత్ర పరిశ్రమలో రాణించడం అంతా ఈజీ కాదు. స్టార్ హోదా సంపాదించాలంటే చాలానే కష్టపడాలి. ఈ విషయంలో మైఖేల్ బీ జోర్డాన్ సినీ ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం అని చెప్పాలి. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించి..వెండితెరపై రాణిస్తున్నాడు. చిన్నప్పుడు మోడలింగ్‌తో మొదలుపెట్టి, 'ది వైర్' (The Wire), 'ఫ్రైడే నైట్ లైట్స్' (Friday Night Lights) వంటి టీవీ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో వచ్చిన 'ఫ్రూట్‌వేల్ స్టేషన్' ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆస్కార్ గెలిచిన 'సిన్నర్స్' దర్శకుడు ర్యాన్ కూగ్లర్తో ఆయనకు ఇది మొదటి సినిమా. ఇందులో మైఖేల్ నటనకు హాలీవుడ్ ఫిదా అయింది. దీంతో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం 'క్రీడ్' చిత్రంతో వచ్చింది. ఇక మార్వెల్ చిత్రం బ్లాక్ పాంథర్ లో ఆయన పోషించిన 'కిల్మాంగర్' పాత్ర హాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోయింది.అదే ఆయన ప్రత్యేకతసామాజిక సందేశాన్నిచ్చే చిత్రాల్లో నటిస్తూ.. వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఆయన స్పెషల్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు. హీరోగా బిజీ ఉన్న సమయంలోనే 'బ్లాక్ పాంథర్’లో విలన్‌గా నటించాడు.నటుడిగానే కాకుండా దర్శకుడిగాను రాణించాడు. 'క్రీడ్ III' చిత్రంతో ఆయన దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా కథా గమనాన్ని నడిపించడంలోనూ ఆయనది ప్రత్యేక. -
ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నా!: మైఖేల్ బి జోర్డాన్
విల్ స్మిత్ నటించిన హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘ఐయామ్ లెజెండ్’. ఫ్రాన్సిన్స్ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఐ యామ్ లెజెండ్ 2’ని దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించారు. విల్ స్మిత్‌తో పాటు మైఖేల్ బి జోర్డాన్ కూడా ఈ సీక్వెల్లో నటించనున్నారు. ఈ విషయం గురించి జోర్డాన్ మాట్లాడుతూ– ‘‘ఇంకా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను. అయితే విల్ స్మిత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఆనందంగా ఉంది. విల్‌తో కెమెరా ముందు నటించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ‘ఐ యామ్ లెజెండ్ 2’కి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


