MI vs RR
-
బుమ్రాపై వైభవ్ సూర్యవంశీ కామెంట్ వైరల్
టీమిండియా ప్రధాన పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలితో రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు బుమ్రా. అతడు బంతితో రంగంలోకి దిగాడంటే దిగ్గజ బ్యాటర్లు సైతం వణికిపోవాల్సిందే.అయితే, రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మాత్రం బుమ్రాను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఏకంగా సిక్సర్‌తో స్వాగతం పలికి ఔరా అనిపించాడు. ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మంగళవారం తలపడ్డాయి.తొలి బంతికే సిక్సర్ ఈ మ్యాచ్‌లో వైభవ్- బుమ్రా ఫైట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన వైభవ్.. అతడి ఓవర్లో మరో సిక్స్ కూడా రాబట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముంబైపై విజయానంతరం రాయల్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో బుమ్రాను ఎదుర్కొన్న అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ..గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు‘‘ఇందులో నేనేమీ గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. బౌలర్ కంటే కూడా బంతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేందుకు నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను. అయితే, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ఎదురుగా ఉండటం వల్ల కాస్త గాబరాగానే అనిపించింది.అయితే, నా అలవాటుకు తగ్గట్లే బంతిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అనుకున్న ఫలితం రాబట్టగలిగాను’’ అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో వైభవ్ 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇవ్వడంతో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ముంబైపై 27 పరుగుల తేడాతో గెలిచింది.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే! View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) -
BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా!
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్‌కప్ విజేత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్లో.. అటు భారత జూనియర్ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్.మెరుపులు మెరిపించాడుఇక ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలవడంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్‌ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్‌తో వైభవ్ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026డెస్టినీ చైల్డ్ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడుఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్‌లో చితక్కొడతాను’ అని చెప్పాడు.అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్‌లోనే వైభవ్ అదరగొట్టాడు.20 ఏళ్లు ధనాధన్దయచేసి వైభవ్‌ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్’’ అంటూ టీమిండియాకు వైభవ్‌ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి సూచించాడు. చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ -
బుమ్రాకే చుక్కలు చూపించావు!.. నీ గుండె గట్టిదిరా!: హార్దిక్
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లో 31 పరుగులతో మెరిశాడు.విధ్వంసకర బ్యాటింగ్తాజాగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఇందులో ఓ ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్.. ముంబై స్టార్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూడగా.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.ఈ గుండె గట్టిదిరా బుడ్డోడాఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ముంబై కెప్టెన్, టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. అతడి భుజం తడుతూ.. గుండెపై చేయి వేసి.. ‘ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026 ఏ బౌలర్ బౌలింగ్లోనైనాఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ‘‘పదహారు, పదిహేడేళ్ల పిల్లాడు ఇలా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మేము వైభవ్ గురించి చాలా సేపు చర్చించాము.అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి అసలు భయమే లేదు. అందుకే ఏ బౌలర్ బౌలింగ్‌లోనైనా అలాంటి షాట్లు ఆడగలుగుతున్నాడు. అతడి భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని హార్దిక్ పాండ్యా వైభవ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’𝙂𝙖𝙢𝙚 𝙧𝙚𝙘𝙤𝙜𝙣𝙞𝙨𝙚𝙨 𝙜𝙖𝙢𝙚! 🤝🎥 #MI captain Hardik Pandya with some very kind words for the young Vaibhav Sooryavanshi 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/t5Wg9LCtoV— IndianPremierLeague (@IPL) April 7, 2026 -
‘వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసు.. అతడికి అంత సీన్ లేదు’
భారత క్రికెట్ వర్గాల్లో గత కొంతకాలంగా చర్చనీయాంశమైన పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఫార్మాట్లకు అతీతంగాఇక భారత్ అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా ఫార్మాట్లకు అతీతంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్ ఫైనల్లో విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో భారత్‌కు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో భారీ అంచనాలతో ఐపీఎల్-2026 బరిలో దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై దంచికొట్టాడు.ఆది నుంచే దూకుడుకేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం సాధించి సత్తా చాటాడు వైభవ్. ఇక గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ 18 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ తమ మూడో మ్యాచ్‌లో భాగంగా మంగళవారం గువాహటిలో ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. వైభవ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.వరల్డ్‌క్లాస్ బౌలర్, టీమిండియా పేస్‌దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ముంబై సైతం ఈ కుర్రాడి కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించిందా? అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ పారస్ మాంబ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు.వైభవ్ గురించి తెలుసు‘‘ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. వైభవ్ కొత్త ఆటగాడేమీ కాదు. ఐపీఎల్లో అతడికి ఇది రెండో సంవత్సరం. కాబట్టి అతడు కొత్త కాదు. అయితే, అతడొక మంచి ప్లేయర్. అయినా అతడి కోసం మేమేమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. మిగతా వారిలాగే అతడు కూడా!’’ అని పారస్ మాంబ్రే కొట్టిపారేశాడు.అతడికి అంత సీన్ లేదుఇక రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయి గురించి ప్రస్తావన రాగా.. ‘‘రవి మిస్టరీ స్పిన్నర్‌గానే కొనసాగుతున్నాడని నేను నమ్మను. గత కొన్నేళ్లుగా అతడు ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసు. ఆటగాళ్ల కెరీర్లో ఒడిదుడుకులు సహజం. ఒక్కోసారి బాగా ఆడతారు.. మరోసారి తేలిపోతారు. ఇప్పుడు ఫామ్‌లో ఉన్నంత మాత్రాన అతడి గురించి భయపడాల్సిందేమీ లేదు’’ అని పారస్ మాంబ్రే అతడిని తేలికగానే తీసుకుంటున్నట్లు తెలిపాడు.కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రవి బిష్ణోయి అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాలుగు ఓవర్ల కోటాలో 41 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. సాయి సుదర్శన్ (73), గ్లెన్ ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4), రాహుల్ తెవాటియా (12) రూపంలో కీలక వికెట్లు తీసి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’


